- ప్రొటీను ఆహారము ఎక్కువ తీసుకోండి. ప్రొటీన్స్ ఎక్కువగా మొలకలు, ధాన్యసంబంధిత వాటిల్లో మాంసము, సోయాచిక్కుళ్లలోనూ ఉంటాయి.
- విటమిన్ ఎ, విటమిన్ బి సమృద్ధిగా గల ఆహారం తీసుకోండి. ఈ విటమిన్లు ముదురు ఆకుపచ్చ కూరగాయల్లో, పసుపురంగు ఉండే పళ్లలో సమృద్ధిగా ఈ విటమిన్స్ ఉంటాయి. తాజా ఆకుపచ్చని ఆకుకూరల్లో, అరటికాయల్లో, టమాటా, కాలీఫ్లవర్, పప్పుధాన్యాలు, లివర్, కిడ్నీ, పెరుగు, గోధుమలలో విటమిన్ బి ఉంటుంది.
- ఖనిజలవణాలు బాగా సమృద్ధిగా ఉండే ఐరన్ లాంటివి తీసుకోండి. ఎర్రగా ఉండే మాంసము లోనూ, ఆకుపచ్చని కూరగాయల్లోనూ జింక్ ఎక్కువగా ఉంటుంది. ఎండిన ఆప్రికాట్స్, కొత్తిమీర, గుడ్లు, గుడ్డులోని పచ్చసొన, ధాన్యములలో ఐరన్ ఉంటుంది. సన్‌ఫ్లవర్ గింజలలో, జీడిమామిడి ఆల్మండ్లలో కాపర్ ఎక్కువగా ఉంటుంది.
- అరటికాయలు, చేపలు, క్యారెట్లలో అయొడిన్ ఉంటుంది.
- కాఫీ, టీల కన్నా మజ్జిగ ఎక్కువ తీసుకోండి. మజ్జిగలో రెండు చుక్కల నిమ్మరసం కూడా కలిపి తీసుకోండి. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి, జుట్టుకి కావలసిన విటమిన్లు లభిస్తాయి.
- ఎర్లీ ఏజ్‌లో జుట్టుతెల్లబడినవారు, తాజాఅల్లాన్ని తీసుకుని అరగదీసి తేనెతో కలిపి తీసుకోవటం వల్ల ఆమ్లాలను తలపై రుద్దుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నల్లబడుతుంది.
- రోజూ రెగ్యులర్‌గా కొబ్బరినూనెని నిమ్మపండు రసంతో జతచేసి జుట్టుకు మసాజ్చేసుకోండి.
- పాలు కలవని టీ డికాషన్‌లో ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో తెల్లబడిన జుట్టు ప్రాంతంలో బాగా మెత్తగా మృదువుగా మసాజ్ చేసుకోండి. ఓ గంట పోయాక తలస్నానం చేయండి.
- రెండు టీస్పూన్ల హెన్నా పౌడర్ తీసుకోండి. ఒక టీస్పూన్ పెరుగు ఒక టీస్పూన్ మెంతుల పొడి, మూడు టీస్పూన్లు పుదీనా రసంను కలపండి. మిశ్రమాన్నంతా పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించండి. రెండు లేదా మూడు గంటలు తర్వాత షాంపూతో స్నానం చేయండి.