
రాజకీయాలు అంటే అంతగా నచ్చవు
హంగు ఆర్భాటాలకు చాలా దూరం
నలుగురిలో కలిసిపోయే మాటకారి
నిర్మొహమాటం ఎక్కువ
ప్రణబ్‌తో సాన్నిహిత్యం ఎక్కువ
భారతీయ నృత్య వైభవం ఆమె ప్రదర్శనలో సాక్షాత్కరిస్తుంది. రాష్టప్రతి కుమార్తె అన్న భావన ఏమాత్రం ఆమెలో కనిపించదు. అందరిలో తను ఒకరిలా కలివిడిగా కలిసిపోతుంది. అందుేక ఆమె అంటే ఇష్టపడే సహచరులు ఎందరో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుమార్తెగా కంటే కథక్ నృత్యకారిణిగా గుర్తింపు రావడమే తనకు విశేషమని చెబుతుంటారు. నాలుగు రోజుల క్రితం విశాఖలో జరిగిన ఓ ఉత్సవాల తొలి ప్రదర్శనగా భారత రాష్టప్రతి కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కథక్ నృత్యం అందరిని ఆకట్టుకుంది.
శర్మిష్ఠ జన్మస్థలం కోల్కత్తా. ఢిల్లీలో పెరిగింది. లేడీ ఇర్విన్, సెయింట్ స్టెఫన్స్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం,ఆమెకు పిన్నవయస్సు నుండే నృత్యంపై వల్ల మాలిన అభిమానం. ఎన్నో ప్రదర్శనలు నిర్వహించింది. తరచూ మ్యూజియాలను, చరిత్రకు సంబంధించిన ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటుంది. పండిట్ దుర్గాలాల్, ఉమాశర్మ, రాజేంద్ర గంగానీ వద్ద ఆమె నృత్యాన్ని అభ్యసించింది. తండ్రి పనుల్లో బిజీగా ఉండడంతో తల్లి సుద్ర, కుమార్తెను నృత్యం నేర్చుకోవటానికి తగిన ప్రోత్సాహం అందజేసింది.
విశాఖలో కథక్ ప్రవాహ్ పేరున గంటపాటు ఆమె ప్రదర్శించిన నృత్య విన్యాసాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. ఈ సందర్భంగా శర్మిష్ఠకు నాట్యశ్రీ బిరుదు ప్రదానం చేశారు. శర్మిష్ఠముఖర్జీ ఆషామాషా వ్యక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ కళలకు రాయబారిగా విధులు నిర్వ హిస్తోంది. ఆమె కథక్ కళాకారిణి. క్లాసికల్ డాన్స్‌లో మేటి. తనకంటూ ప్రత్యేక స్థానానికై కృషి చేసింది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా, ప్రావీణ్యతలో తనదైన శైలిని ప్రదర్శించింది. షర్మిష్తాకు ఇద్దరు సోదరులు. అభిజిత్. ఇంద్రజిత్. ఓ సారి ఓ ఆకతాయి తనను వేధిస్తుడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతే మంత్రిగారి కూతురు కావడంతో పోలీసులు నానా హడావుడి చేశారు. ఎక్స్ కేటగిరి భద్రత ప్రకటించారు. దీంతో శర్మిష్ఠకు కోపం వచ్చింది. ఏదో అతన్ని మందలించమని చెబితే ఇంత తతంగం ఎందుకు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆమె సమాజంలో ఇతర స్ర్తీలలా ఉండాలని కోరుకుంటుంది.
అనవసర హంగు ఆర్భాటాలు అంటే నచ్చవు అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.ఆమె వ్యక్తిగత గ్రంథాలయంలో విలువైన పుస్తకాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో పరిశోధన గ్రంథాలు, నవలలు చోటు చేసుకున్నాయి. ఆమెకు వైన్ అంటే ఇష్టం. శునకాలు, వర్ణచిత్రాలు, పెద్ద కార్ షోలంటే మక్కువ. సుప్రసిద్ధ యూసఫ్ అర్రకాల్ పెయింటింగ్స్ ఆమె ఇంటిలో ఉన్నాయి. శర్మిష్ఠ ఆరేళ్ల క్రితమే భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆమెకు జంతువులపై ప్రేమ ఎక్కువ. కుక్క పిల్లలను సాకుతుంది.అవి లేకపోతే ఆమెకు తోచదు. వారింట్లో కుక్కలకు గుగ్లీ, జున్ను, ధియోరా అని నామకరణం చేసింది. ఆరోగ్యపరంగా, వాటికేమైనా తేడా చేస్తే, తాను ప్రదర్శనలోనూ పాల్గొనదు. ఓసారి తండ్రి అంటార్కి టాకు బయలుదేరితే, తనను అంటార్కిటికా తీసుకువెళ్లమంది, లేకపోతే చంపమని నిర్మొహమాటంగా చెప్పింది. శర్మిష్ఠ ససేమిరా రాజకీయాలకు రానంటుంది. ఆరు ఎపిసోడ్ల ‘తాల్‌మేల్’ అనే నృత్య రూపకాన్ని టెలీ సీరియల్‌గా ప్రదర్శించింది. ‘బియాండ్ ట్రెడిషన్’ పేరున ఫీచర్ ఫిల్మను డాన్స్‌పై నిర్మించింది.
తనకు నచ్చని ఏమి చేసినా కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా ఖండిస్తుంది. ఢిల్లీలో అత్యాచారాల నేరాలను ఖండిస్తూ జరుగుతున్న ఆందోళనలపై అబిజిత్ తన అభిప్రాయాన్ని చెప్తూ విధ్యార్ధినుల కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు తెలియని వారు ఆందోళనల్లో పాల్గొంటున్నారని అభిజిత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బయట ప్రజలతో పాటు ఆయన సోదరి శర్మిష్ఠ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం ఆమె నిర్మొమమాటానికి ప్రతీకగా చెప్పవచ్చు.
శర్మిష్ఠ కథక్ కళకే అంకితం. కథక్ నృత్య ప్రదర్శనల కోసం తక్కువ సమయంలో ప్లాన్‌చేసి రైలులో ప్రయాణించవలసి వచ్చేది. ఆ పరిస్థితులలోనే, రిజర్వేషన్ కోసం తండ్రి పేరును వినియోగించుకునేది తప్ప మిగతా ఏ పనులకూ తండ్రిని అర్థించలేదు. శర్మిష్ఠ మాటకారి. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు. భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు ఎప్పుడూ వేసుకోదు. నడుస్తున్న కాలానుగుణంగా జీవిస్తుంది. ఆమె వెనిజులాకు 2004లో వెళ్లింది. భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు అక్కడ తక్కువే. శర్మిష్ఠ ప్రదర్శనతో అందరినీ మెప్పించింది. సంగీతం, నృత్య ప్రదర్శనలతో హద్దుల గోడలను పటాపంచలు చేయవచ్చని ఆమె నమ్మకం