
తరువాత రాజకీయాల్లోకి...
యుపిఏ హయాంలో రాజ్యసభకు నామినేట్
బాల్య వివాహాల రద్దుకు పోరాటం
వ్యాపార దక్షతలోనూ తనకు తానే సాటి
దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలో ఒకరైన ేకేక బిర్లాకు కుమార్తెగా శోభన భార్టీయా అందిరికీ తెలుసు. తన పుట్టినిల్లే కాదు, మెట్టినిల్లు సంపన్న కుటుంబమే. అరుున తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని చిన్ననాటి నుంచే తపించేవారు. పత్రికా రంగంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలను అందించారు. రాజ్యసభలోనూ అడుగుపెట్టి బాల్య వివాహాలను అరికట్టాలని తన గళాన్ని బలంగా వినిపించారు. ఇలా చేపట్టిన ప్రతి పనిలో తన శైలితో ముందుకు దూసుకుపోతున్నారు శోభన. 2009 ఫోర్బ్‌స పత్రిక వెల్లడించిన దేశంలోని ధనికుల తొలి వంద మంది జాబితాలో 76 స్థానాన్ని ెకైవసం చేసుకున్నారు. అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా నిలిచారు.
2006లో ది హిందూస్థాన్ టైమ్స్ గ్రూప్‌కి చైర్ పర్సన్‌గా, ఎడిటోరియల్ డైరెక్టర్‌గా బాధ్యతలు శోభన చేపట్టారు. శోభనా భార్టియా 1957లో జన్మించారు. పారిశ్రామిక నేత కేకే బిర్లా కుమార్తె. జీడీ బిర్లాకు మనవరాలు. బిర్లా కుటుంబంలో ఆడపిల్లగా జన్మించినా ఆ వ్యాపార చతురత ఈమెకి వంటబట్టింది. కేకే బిర్లా కుటుంబం హెచ్‌టీ మీడియాలో 75.36 శాతం స్టాక్‌ను కలిగి ఉంది. దీని విలువ దాదాపు రూ.834 కోట్లు (2004) కలకత్తా యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్‌ని శోభన పూర్తి చేశారు. శ్యాంసుందర్ భాటియాను పెళ్లి చేసుకుంది. ఇతను రూ.14 బిలియన్ విలువ కలిగిన ఫార్మా సంస్థ జూబిలాంట్ ఆర్గానోసిస్ లిమిటెడ్‌కు చైర్మన్. శ్యాం సుందర్ భార్టియా తండ్రి లేట్ మోహన్ లాల్ భార్టియా. వారి కుమారుడు షమిత్ భార్టియా హెచ్‌టీ మీడియా గ్రూప్‌కు డైరెక్టర్. శోభన మెట్టినింటి వారు కూడా ప్రముఖ వ్యాపార వేత్తలు కావడంతో తనకున్న ఆలోచనలు అమలు చేయడానికి అవకాశం దొరికింది. శ్యాం సుందర్‌లకు పలు వ్యాపారాలున్నాయి. డోమినో పిజ్జా ఫ్రాంచీజ్ వంటి లైఫ్ స్టైల్ బిజినెస్ లను ఏర్పాటు చేశారు. అలాగే బెంగళూరులో స్టోర్ చెయిన్ నడిపిస్తున్నారు.
1986 సంవత్సరం హిందూస్తాన్ టైమ్స్‌లో శోభన ఉద్యోగంలో చేరారు. ఒక జాతీయ దినపత్రికలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరిన తొలి మహిళగా శోభన నిలిచారు. అంతే కాకుండా తక్కువ వయసులో ఆ బాధ్యతను నిర్వర్తించిన మగువగా పేరుగాంచారు. జర్నలిజంలో ప్రవేశం లేకపోయినా తన బాధ్యతను చక్కగా నెరవేర్చేవారు.2006 ఫిబ్రవరిలో శోభన రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షులు సోనియాగాంధీ ప్రోత్సాహంతో పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ స్థానాన్ని సైన్స్, ఆర్ట్, సామాజిక సేవల్లో నిపుణులైన వారికి కేటాయిస్తారు. మీడియాలో సేవ కేటగిరిలో ఆ స్థానం దక్కించుకున్నారు. సామాజిక సేవ విభాగంలో ఆమెను ఎన్నుకున్నారు. 2006లో బాల్యవివాహాలను రద్దు చేయాలని రాజ్యసభలో తన వాదాన్ని శోభన గట్టిగా వినిపించారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరం(1996) నుంచి గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారో అవార్డును తీసుకుంది. 2001లో పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యాపార వేత్తగా నిలిచారు. నేషనల్ ప్రెస్ ఇండియా అవార్డు 1992 తీసుకున్నారు.
బిజినెస్ వుమన్ అవార్డు, ఎకనామిక్ టైమ్స్ అవార్డ్‌స ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డ్‌స 2007 తీసుకున్నారు. ప్రస్తుతం ఎండీవర్ ఇండియాకు చైర్మన్‌గా ఉన్నారు. 2001లో పంజాబ్, హర్యాన, ఢిల్లీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి బిజినెస్ ఉమెన్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా 2003లో భారతీయ మీడియా శక్తివంతురాలైన 50 మంది మహిళా జాబితాలో చోటు చేసుకున్నారు. శోభన హిందూస్థాన్ టైమ్స్ అండ్ హిందూస్థాన్‌లో ప్రముఖ పదవిలో కొనసాగారు. హెచ్‌టీని శోభన తాతయ్య ఘన్‌శ్యామ్ దాస్ బిర్లా స్థాపించారు. దీనిని మహాత్మ గాంధీ 1924లో ప్రారంభించారు.
తన తండ్రి మీడియా బిజినెస్‌లో కొనసాగారు. ఈమె వివాహం అనంతరం 1985లో పదవిలో చేరారు. భర్త శ్యామ్ భార్టియా ఈ ఫోర్బ్‌స జాబితాలో 54వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక్కడ పత్రికలే కాకుండా వాల్ స్ట్రీట్ జర్నల్‌ని 2007లో భాగస్వామి తీసుకున్నారు. అలాగే పబ్లిస్ మింట్, డెయిలీ బిజినెస్ న్యూస్ పేపర్. ఎఫ్ రేడియో చానల్‌ను నడిపించేందుకు వర్జిన్ రేడియోతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమె ఇద్దరూ కొడుకులు తనతో పాటే కలిసి పని చేస్తున్నారు. ఈమె శాఖాహారి. అయినా ఎంతో ఫిట్‌గా ఉంటారు.
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత 2005లో మొదటిసారి పద్మశ్రీ అవార్డుకు శోభన నామినేట్ అయ్యింది. ఈ అవార్డు జర్నలిజంలో పనిచేసిన వారి ఇస్తారు. కాని జర్నలిస్ట్ కంటే ఈమె పారిశ్రామిక వేత్తగానే ఎక్కువగా ఉందని కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు, రాజ్యసభ నామినేషన్ రెండూ యూపీఏ ప్రభుత్వం పరిపాలన కాలంలో జరిగాయి.