
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపు
ఆరోగ్యం సహకరించకున్నా బరిలోకి దిగేది
పలు రివార్డులు, అవార్డులు సొంతం
పరుగు పెట్టిందంటే ఆమె చిరుతను గుర్తుకు తెస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఎన్నో పతకాలు సాధించిన క్రీడాకారిణి. విదేశాలకు వెళ్లినప్పుడు వాతావరణం పడక శరీరం సహకరించేది కాదు. అయినా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. పోరాట పటిమకు అవార్డులు, రివార్డులు ఎన్నో వరించాయి. పరుగుల చిరుతగా పేరుపొందిన అనురాధ బిశ్వాల్. గురించి....
భారతదేశంలో ఇండియన్ ట్రాక్ ఫిల్డ్ అథ్లెట్ క్రీడలో గుర్తింపు పొందిన క్రీడాకారిణి అనురాధ బిశ్వాల్. ఒడిశా నుంచి ప్రత్యేకంగా 100 మీటర్స్ హర్డిల్స్ క్రీడలో రాణించారు. ఇప్పటి వరకు 100 మీటర్స్ హర్డిల్స్‌లో ఆమె రికార్డు జాతీయంగా 13.38 సెకెండ్స్ రావడంతో చరిత్ర సృష్టించారు. ఈ రికార్డును బిశ్వాల్ అగస్టు 26, 2002లో డిల్లీలో నెహ్ర స్టేడియంలో జరిగిన డిడిఎ రాజా భాలేంద్ర సింగ్ జాతీయ సర్క్యూట్‌లో ఈ ఘనత సాధించారు.అనురాధ బిశ్వాల్ 2000 సంవత్సరంలో జర్తాలో జరిగిన ఏషియన్ చాంపియన్ షిప్‌లో 13.40 సెకెండ్స్‌లో 100 మీటర్లు పూర్తి చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. జకర్తాలో బిశ్వాల్ అత్యుత్తమ ప్రదర్శనకు బ్రోంజ పతకాన్ని అందుకున్నారు. అంతేకాకుండా ఒడిశాలోని భువనేశ్వర్‌లో నాల్కో(ఎన్‌ఎఎల్‌సిఒ)లో జూనియర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
ఎంబిఎ, యంఎలో ఎల్‌ఎల్‌బి కూడా పూర్తి చేశారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే సమయంలో అనేక సమయల్లో సమస్యలు వచ్చేవి, కానీ వాటిని లెక్కచేయకుండా లక్ష్యం కోసం ముందుకు సాగేది. ఇతర దేశాల్లో క్రీడల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు శరీరం సహకరించేది కాదు అయినా పట్టు వదలకుండా పోరాట పటిమను కనబరిచేది. చిన్న వయస్సు నుంచి కోచింగ్‌లో మంచి నైపుణ్యంతో ముందుకు సాగడంతో పలు పతకాలు ఆమెకు అందివచ్చాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే లేచి గ్రౌండ్‌లో ఉండేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా శిక్షణకు మాత్రం దూరం కాలేదు. ఎందుకంటే ప్రతి విజయం వెనుక ఎంతో కష్టం ఉంటే తప్ప సొంతం కాదని ఆమె నమ్మేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో కష్టపడేవారు. ప్రతి విజయం వెనుక తల్లిదండ్రులు రవీంద్రనాథ్, నిబేధిత పాత్ర కీలకం. వారు సహకరించకుంటే ఇంతటి విజయాలు నా పేరిట ఉండేవి కాదంటున్నారు
అనురాధ బిశ్వాల్. మనదేశంలో ఎక్కడ ఈవెంట్ జరిగినా తనను ప్రేక్షకులు ఎంతో ఆదరించేవారని చెబుతారు. శిక్షణ ఇచ్చిన శిక్షకులు ‘ముందుగానే నీలో విజయం కనిపిస్తుంది’ అని ప్రోత్సహించేవారు.రెట్టించిన ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొనేవారు. పంచాయన్ గంటయాత్, అరుణ్‌కుమార్ దాస్, యూరి అలెక్సండర్ వంటి వారి వద్ద పరుగులో మెళకువలు నేర్చుకున్నారు.
శిక్షణలో భాగంగా మొదట రూర్కేలాలోని పంచాయత్ గంటయాత్ దగ్గర కోచింగ్ తీసుకున్నారు. దగ్గరలో సాయి హోటల్‌ల్లో నివాసం ఉంటూ చాలా సంవత్సరాలు అక్కడే గడిపారు.
అవార్డులు
2000లో ఏషియన్ చాంపియన్ షిప్ జకర్తాలో మూడవ స్థానం సాధించారు.
2006లో శాఫ్ గెమ్స్ శ్రీలంకలో జరిగిన క్రీడలో మొదటి స్థానం సాధించారు.
అంతేకాకుండా బింజు పట్నాయాక్ స్పోర్ట్‌సపర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు.
80 బంగారు పతకాలు, 50 సిల్వర్ పతకాలు, 37 బ్రోంజ పతకాలను సొంతం చేసుకున్నారు.
పతకాల వివరాలు
1987లో జలందర్‌లో జరిగిన 15 మంది మహిళ 100 మిటర్స్ హర్డిల్స్‌లో బంగారు పతకం సాధించారు. ఆ తరువాత 1995లో ఇతర గ్రూప్‌లతో పోటిపడి జాతీయ ఛాంపియన్ షిప్‌ను గెలుపొందారు.
1998లో కలకత్తాలో జరిగిన 100 మీటర్స్ హర్డిల్స్‌లో సిల్వర్ పతకాన్ని సాధించారు.
1999లో మూడు రాష్ట్రాల్లో జరిగిన 100మీటర్స్ హర్డిల్స్ ఈవెంట్‌లలో మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్‌లలో జరిగిన అన్ని ఈవెలంట్‌లలో బంగారు పతకాలు సాధించడం గమనార్హం.
2000లో చెనై్న, లక్నోలో జరిగిన ఈవెంట్‌లలో బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు.
2001లో లూదియానా, చెనై్నలలో జరిగిన 100 మీటర్స్ హర్డిల్స్‌లో బంగారు పతకాలు సాధించారు.
2002లో హైదరాబాద్, న్యూఢిల్లీలో జరిగిన 100 మీటర్స్ ఈవెంట్‌లలో రికార్డ్ స్థాయిలో బంగారు పతకాలు సాధించారు.
2005, 2006 ,2007, 2008, 2009,2010 సంవత్సరాలలో పలు బంగారు, వెండి పతకాలు సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయస్సులో చాలా ఎక్కువ పతకాలు సాధిచండం విశేషం.
అంతర్జాతీయంగా కూడా అనేక మ్యాచ్‌లలో రాణించి పలు పతకాలు సాధించండం గమనర్హం.
మూలం : సూర్య దినపత్రిక