కోకాకోల నుంచి గోల్డెన్ స్ఫూన్ అవార్డు
ప్రస్తుతం ెకల్లోగ్ ప్రైవేట్ లిమిటెడ్గలో డైరెక్టర్
హెచ్‌ఎస్‌బిలో చిఫ్ మార్కెటింగ్ ఆఫీసర్
వ్యాపార రంగంలో తనకు సాటి లేరు అన్నంతగా శ్రమపడుతూ ముందుకు సాగతున్న సంగీత కల్లోగ్‌లో డైరెక్టర్‌గా ఉంటూ పలువురు మహిళలక ఆదర్శ మహిళగా నిలుస్తున్నారు. 2011 లో లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా కోకాకోల కంపెని నుంచి కూడా అవార్డున అందుకున్నా సంగీత నేటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
జీవితం:
భారతదేశంలో మేనేజింగ్ ఆఫ్ కెల్లోగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సంగీత పండూర్కర్. మార్చి 3, 2009లో కోకా-కోల ప్రైవేట్ కంపెనీకి ఉపాధ్యాక్షురాలిగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాపార రంగంలో ఎంతో వ్యూహాత్మకంగా బాధ్యతలు వ్యవహరించేవారు. అంతేకాకుండా వ్యాపార రంగంలో అనేక లోటు పాట్లు ఉన్న వాటిని అధిగమిస్తూ కంపెనీని ముందుకు నడిపించడం మామూలు విషయం కాదు. కోకా కోల కంపెనీలో ఉపాధ్యాక్షురాలిగా దాదాపు 18 నెలలు సేవలందించడం జరిగింది. వ్యాపార రంగంలో ఎక్కువగా అభివృద్ధి చేందేందుకు అనేక ఆలోచనలతో ముందుకు సాగేవారు. జార్టీయా టీ, కాఫీలతో వ్యాపారాన్ని వృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించారు.
అంతేకాకుండా వ్యాపార రంగాన్ని బలోపెతం చేయాటానికి జ్యూస్‌లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి నింబు పాని అను పేరుతో పిలిచేవారు తరువాత దానిని పేరు మార్చి నింబు ఫ్రెష్ అని పిలవడం జరుగుతోంది. భారతదేశంలోని హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కొ ఆపరేషన్ లిమిటెడ్‌లో ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా సేవలందిచడం జరిగింది. ఆమె హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్‌లోనూ, హిందూస్థాన్ యూనిలివర్‌లోనూ, కింబర్లీ క్లర్క్‌లల్లోనూ విధులు నిర్వహించారు. మొదటగా ఆమె జీవితంలో ఇక్కడే సాగడం గమనార్హం. అంతేకాకుండా 20 సంవత్సరాలుగా మార్కెటింగ్ సెల్స్‌లలో పని చేశారు. హిందూస్థాన్ సిబ-జ్యిజి (ప్రస్తుతం నోవార్టిస్) లో మొదటి సారిగా సేవలందించడం జరిగింది.
బ్రేక్‌ఫాస్ట్‌క్లబ్:
మూడు విభిన్న రంగాలలో అనుభవం ఉన్న 44 సంవత్సరాల సంగీత ఇప్పటికి పలు అంశాలపైనా కానీ, వ్యాపార రంగంలో కానీ గురి తప్పకుండా ముందుకు సాగడం ఆమె విజయం వెనుక ఉన్న రహస్యం. ఫార్మస్యూటికల్, ఫైనాన్షియల్, ఫాస్ట్ మూవీంగ్ కన్జుమర్ గూడ్స్ (ఎఫ్‌ఎమ్‌సీజీ) వంటి రంగాలలో ఆరితేరారు. ముంబాయిలో దీర్ఘకాలంగా వ్యాపార రంగంలో కొనసాగడానికి విలువగల మార్పులను తెలుసుకోవచ్చు. కొల్లెగోలో చేరిన తరువాత బాధ్యతగల ఉద్యోగిగా అనేక బాధ్యతలు చేపట్టి కంపెనిలో ఎన్నడు లేనంత సరికొత్త రికార్డును నెలకోల్పారు. దాదాపు 400 కోట్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో మార్కెటింగ్ విలువలలో 65 శాతం వృద్ధి శాతంను పెంచారు.
భవిష్యత్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా కొన్ని విలువలు అవసరం డ్రైవింగ్‌లో వృద్ధి చెందడం, పైప్లెన్ నిర్మాణం, ఆస్తులు, ప్రతిభను కనబరచాటానికి ఇలాంటి అనేక నైపుణ్యం కలిగిన నైతిక విలువలు అవసరం. వ్యాపారం చేసేటప్పుడు కంపెని నుంచి టార్గెట్ చేయవలసి వచ్చిన సమయంలోనూ ఎలాంటి మార్పులు లేకుండా చేసేవారు. చేయకపోయిన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు.
2011లో ముంబాయిలో ఫుడ్‌ఫెస్టివల్‌లో లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును సొంతం చేసుకున్నారు. ది ఈవినీంగ్ ఆఫ్ ఫుడ్ టైటాన్స్ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా కోకాకోల నుంచి గోల్డెన్ స్ఫూన్ అవార్డుతో పాటు, 2010లో వ్యాపార రంగంలో అవార్డులను అందుకున్నారు. 14 రకాల కార్యక్రమాకు సంబంధించిన జరిగిన ఫెస్టివల్‌లో అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది.
కుటుంబం:
మధ్యతరగతి కుటుంబంలో సబర్బన్ గృహంలో జన్మించిన సంగీతకు ఐదుగురు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి కుటుంబాన్ని కట్టదిట్టమైన పద్దతులతో నడిపించేవారు. పిల్లల ఆలోచన విధానాన్ని పసిగట్టి అప్పట్లోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోనేవారు. ఔషధ శాస్త్రంలో అనేక విలువలను ఆమెకు నేర్పించేవారు. తండ్రి మెడిసిన్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు. చిన్నప్పటి నుంచి చదువుతున్న సమయంలో ఎప్పుడు కూడా ఎలాంటి జీవితం కావాలో ఆమెకు తోచేదికాదు. గ్రాడ్యూయేషన్ అనంతరం కూడా జీవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక, అనుకోకుండా మార్కెటింగ్‌లోకి రావడం జరిగింది.
ఏ రంగంలో వెనకబడకుండా ముందుకుసాగాలనే నిర్ణయంతో వ్యాపార రంగంలో అనేక మేలకువలు నేర్చుకున్నారు. దేశంలోని వ్యాపార రంగంలోని మహిళ శక్తివంతుల జాబితాలో నిలవడం గమనార్హం. ఎంబీఎ పూర్తి చేసిన తరువాత వారి దగ్గరి స్నేహితులతో కలిసి అంతేకాకుండా ఆమె పని చేస్తున్న పరిశ్రమలోనే వారి స్నేహితులతో మాట్లాడంలో నైతిక విలువలు నేర్చుకుని దీనిలో రాణించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎంపిక విషయoలో రెండు పోస్ట్ గ్రాడ్యూయేషన్‌లు చేయడం జరిగింది. ఇదే రంగంలో కొంతమంది స్నేహితులు కూడా రాణించడం గమనార్హం. వ్యాపార రంగంలోనే ఆమెకు సరైన జీవితం ఇందులోనే ఉందని భావించారు.
మూలం : సూర్య దినపత్రిక