ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అరుదైన అమెరికాలోని హార్వాడ్గ యూనివర్శిటీలో భారతీయ సంతతి మహిళకు తొలిసారిగా ప్రొఫెసర్ హోదా లభించింది. గోపినాథ్ భారత్‌లోని కోల్‌కతాలో జన్మించారు. తొలుత ఢిల్లీయూనివర్సిటీలో విద్యనభ్యసించారు. హార్వాడ్గ విశ్వవిద్యాలయాలలో ఆర్ధిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించడం గీతా గోపినాథ్ కి దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. గీతా గోపినాథ్ తన ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ లోని లేడి శ్రీరామ్ కాలేజీలో, మాస్టర్ డిగ్రీని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేశారు. ఆ తర్వాత 2001లో ప్రిన్సటన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొందారు.2005లో హార్వార్డ్ యూనివర్సిటీలో చేరక ముందు వరకు చికాగోభూత్‌స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పని చేశారు.‘ఆమె బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ యూనివర్సిటీలో చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని భారత్ 1990-91లోనే చవిచూసింది. అసలు సంక్షోభం ఎందుకు సంబవిస్తుందో తెలుసుకోవాలన్న ఆకాంక్షే అంతర్జాతీయ ఆర్థికశాస్త్ర అధ్యయనానికి కారణమైందన్నారు.
మాక్రో ఎకనామిక్స్ బోధించడంతో పాటు అంతర్జాతీయ ధరల నియంత్రణ, మార్పిడి ధరల నిర్ణయం, అత్యవసర మార్కెట్ వ్యాపారం, ఆర్థికమాంధ్యం తదితర అంశాలపై రిచర్చ్ చేశారు. గీత రాసిన అనేక ఆర్థిక సంబంధ కథనాలు అమెరి కన్ ఎకానమిక్ రివ్యూ, త్రైమాసిక ఎకానమిక్ జర్నల్, రాజకీయ ఆర్థిక జర్నల్, రివ్యూ ఆఫ్ ఎకానమిక్ స్టడీస్, ఇంటర్నేషనల్ ఎకానమిక్ తదితర పుస్తకాలలో ప్రచురితమయ్యాయి.గీతా గోపినాథ్ ఎకనామిస్ట్‌గా అర్థికసంక్షోభం సమయంలో గ్రీస్, ఐస్లాండ్లలో పరిశోధనలు చేశారు. ఆ అనుభవమే ఆమెకు ప్రొఫెసర్‌గా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడింది. హర్వార్డ్ యూనివర్సిటీలో అతి పెద్ద విభాగమైన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కు ఎంపిక కావడం ఒక ఎత్తయితే ఇప్పటివరకు ఆ హోదాను పొందిన మహిళల్లో మూడవ మహిళ కావడం అందులోనూ భారతదేశం నుంచి తొలి మహిళా కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.
గ్రీస్‌లో జరిగిన దేశాలు-ఆర్థికసంక్షోభం అనే అంశం మీదా జరిగిన ప్రత్యేక సదస్సులో పాల్గొన్న భారత ప్రణాళిక సంఘం సభ్యులకు గోపినాథ్ పలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రణాళికలో ఉన్న లోపాలను సవరించాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉందని కూడా సూచిచారు. ఒక భారతీయ వనిత అతి చిన్న వయస్సులో అత్యున్నత స్థానంలో నిలవడంతో పాటు ఈ పదవిని అలంకరించిన తొలి భారతీయు రాలుగా కీర్తిని గడించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
మూలం : తెలుగు విశేష్