telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ఆదివాసి ఆడపడుచు తీజన్‌ బాయి

6/21/2013

0 Comments

 
Picture
             ఏకబిగిన ఆదిపర్వం మొదలుకొని మొత్తం పద్దెనిమిది పర్వాలు పాడగలిగిన అద్భుత అధ్యయనం అది. ఎలా సాధ్యం అనడిగితే ఆ కథ మీది అపా రమైన ప్రేమ అని సమాధానం. ఈ కళ ఆ పాండవ కథ ఎలా ఇన్నేళ్లుగా సాగుతూ వస్తున్నా యని అడిగితే ఆమె వివరించే ప్రవా హం ఏ కథ ఫ్లాట్‌, స్ట్రక్చర్‌కై నా ధీటుగా ఉంటుం ది. పాండవుల కథని పుక్కిట పట్టాక, తన జీవితాన్ని వినిపించడం ఒక పనా అంటుంది ఆమె. అక్షర విద్వత్తుకి ఆవలివైపు, చేతిమీద పచ్చబొట్టుగా పొడిపించుకున్న తన అయిదు అక్షరాల పేరును రాయడానికి పది నిమిషాలు తీసుకుంటానని కించిత్తు అభిమానంగా చెప్పే తీజన్‌బాయి- పద్మశ్రీ, పద్మభూషణ్‌, డి.లిట్‌, మూడు డాక్టరేట్‌లు పోటీపడి వరించాయి. ఆమె పారిస్‌ ఫెస్టివల్‌- సంగీత నాటక అకా డమీ అవార్డు- వీటితోపాటుగా మరిన్ని రివార్డులు అందుకున్నారు. 


                 ఆమె జీవితపు ప్రతి కోణం ఒక పాఠం నేర్పే రీతిలో ఉంటుంది. ఒక ఆదివాసీ సమాజపు నేపథ్యం నుండి దేశ అత్యున్నత పురస్కారాలకు ఎదగడం మధ్య జరిగిన జీవిత అనుభవాలు ఎలాంటివో అవి తెలిస్తే నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పురుషులు చెప్పే పండ్వానీ కథని పోట్లాడి మరీ పాడిన మొదటి మహిళ ఘనత తీజన్‌బాయిది. ఇది సాహిత్యంలో గుర్తింపు పొందగలగాలి. ఆ కథ, దాని ఔన్నత్యం, ఆ కథనరీతి, శైలి... అది భారతీయ కథనరీతులను ప్రభావం చేసిన తీరు సవిస్తార పాఠ్యాంశంగా ఉండగలగాలి. పాడేవాళ్ళు పాడుకుని సంతోషిస్తే, చదువరులు దాన్ని చదువుకుని తమ తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.ఎరుపు, నలుపు రంగులు కలిసిన తన ప్రాంతపు కట్టుబొట్టతోకఢా, కాక్‌నీ, బిందీ లాంటి నగలతో తన (ఆహార్యాన్ని) దుస్తులని తానే ఎంచుకున్నానని చెబుతారామె. అన్నీకలిసి ఎనిమిది కిలోల బరువుంటాయట. మోస్తూ కథ చెప్పడం కష్టం కదా అంటే చెప్పేది భీముడు, సుయోధనుడు, ద్రౌపదిల గురించి కదా అని చమత్కరించింది. భీముడు ఆవిడకి ఇష్టుడు. కల్లాకపటం లేనివాడు కాబట్టి. ఒక్క భారతమే ఎందుకు రామాయణం కూడా చెప్పవచ్చు కదా అంటే భారతంతో మనసు అంటారు.

                    అలా హృదయపు లోతుల్లో నుండి రాలేని కళ జనంలోనికెళ్ళలేదు, వాళ్ళ మనసులని తాకలేదు అని ఆమె భావన.అలా జనాల్లోకి వెళ్ళిన తన కళని ఇప్పటికి రెండు వందలపైగా ఔత్సాహికులకి ఆమె నేర్పారు. వాళ్ళలో ఉపాబాలా, మీనా సాహు, రీతూ వర్మ, సీమాఘోష్‌ లాంటి విద్యార్థులని గుర్తుచేసుకుంటారు తీజన్‌బాయి. తన దగ్గరకొచ్చి తర్ఫీదయే విద్యార్థులు కాకుండా తన గాన రీతిని సొంతం చేసుకొని పాడేవాళ్ళని ఆమె ఆక్షేపించరు. మీ సలహాలేకుండా మీ శైలిలో పాడుతున్నారు కదా అంటే విశ్వవ్యాప్త కళ ఇది. పరిధులు, సీమలు ఎందుకంటారు. రామ్‌పూర్‌ విశ్వవిద్యాలయం ఈ కళని పాఠ్యాంశంగా ఇంకా గుర్తించనప్పటికీ, ఈ కళారూపం గానరీతి పద్ధతులపై వర్క్‌షాపులవీ నిర్వహిస్తుంటారని తీజన్‌బాయి సెక్రటరీ చెప్తారు. ఆ పరంగా తన కళని ఆగకుండా ముందుకు తీసుకెళ్తున్నారామె. వయసెంతని అడిగితే మనమల పిల్లల్ని ఆడించుకుంటానని జవాబు. ఇన్నేళ్ళ ఎగుడు దిగుడు జీవితం ఒకవైపు, ఎలాంటి ఎగుడుదిగుడుల్లోనైనా మొక్కవోని తన పండ్వాని కథ మరోవైపు. కథని జీవితం చేసుకున్నాక జీవితం తనని బాధించలేదు.

                   ఆ కళలో ఏకలీనం అవుతుందామె. ఇక తీజన్‌బాయిలో గుర్తించాల్సిన మరో కోణం ఏమిటంటే ఈ సాద్‌గీని భద్రంగా పెట్టుకోవడం కూడా తన కళలో భాగమైంది. దేశ విదేశాలు అఖండ ఖ్యాతి, పేరు ప్రతిష్ఠలు, కొద్దిపాటి డబ్బు, ఆ పరంగా వచ్చే మార్పులు ఇవేవీ కళని తాకనివ్వకుండా తనని తాను సంభాళించుకోవడం కూడా ఒక కళనే. ఒక సెక్రటరీ, అపాయింట్‌మెంట్స్‌ ఆ హంగుల్లో ఉంటూ కూడా అతి సాదాసీదాగా తనని తాను ఉంచుకోవడంలో సఫలీకృతులయ్యారు తీజన్‌బాయి.

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

'డయల్ కాశ్మీర్'

6/19/2013

0 Comments

 
Picture
                రెండు వారాల్లో 'డయల్ కాశ్మీర్' అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ తయారుచేసింది ఓ కాశ్మీరీ అమ్మాయి. 23 యేళ్ల ఆ యువతి పేరు ఆయేషా ఫరూక్. ఈమె రూపొందించిన అప్లికేషన్‌ను మెచ్చుకుంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సందేశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. స్వయానా జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాంప్లిమెంటరీ ట్వీట్ చేసి మెచ్చుకున్నారు కూడా.

                "డయల్ కాశ్మీర్ అప్లికేషన్ కాశ్మీర్ వాళ్లకే కాకుండా కాశ్మీర్‌కి వచ్చే పర్యాటకులకి కూడా ఉపయోగపడుతుంది. కాశ్మీర్ ప్రజల అవసరానికి ఉపయోగపడే ఒక పనిచేయగలగడం నాకెంతో సంతోషంగా ఉంది''అని చెప్పింది ఆయేషా.

                'డయల్ కాశ్మీర్ అప్లికేషన్' సమాచారాన్ని అందివ్వడమే కాకుండా 500కి పైగా ఫోను నెంబర్లను అందిస్తుంది. వివిధ ప్రభుత్వ విభాగాల, అధికారుల, ప్రజావసరాలకు సంబంధించిన నెంబర్లన్నీ ఉంటాయి ఇందులో. ఈ అప్లికేషన్‌కు వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని, గూగుల్ మ్యాప్స్‌ను కూడా జత చేయాలనుకుంటోందామె. "పర్యాటకులకి గూగుల్ మ్యాప్స్ చాలా ముఖ్యం. అందుకని అప్లికేషన్‌లో వాటిని కూడా చేర్చాలి. వీటి ద్వారా పర్యాటకులు తాము సందర్శించాలనుకున్న ప్రదేశాల మధ్య గల దూరాలను తెలుసుకుని టూర్‌ని బాగా ప్లాన్ చేసుకోగలుగుతారు'' అంటోందామె.

                       ఆయేషా తయారుచేసిన ఈ అప్లికేషన్ గురించి మీడియాలో బాగా ప్రాచుర్యం లభించడంతో బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ ఆమెకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగావకాశం కూడా ఇచ్చింది. దీన్ని వినియోగిస్తున్న వాళ్లు 'డయల్ కాశ్మీర్'కు గొప్ప కితాబులిస్తున్నారు. ముఖ్యంగా అటుఇటు వెతుక్కోకుండా సమయాన్ని ఆదా చేసుకుంటున్నాం అంటున్నారు వాళ్లు "ఇది లేకముందు ప్రభుత్వాధికారుల చిరునామాలు, ఫోన్ నంబర్లు తెలుసుకోవడం కోసం పలు వెబ్‌సైట్లు వెతకాల్సి వచ్చేది. దాంతో ఎంతో సమయం వృథా అయ్యేది. ఇప్పుడీ అప్లికేషన్ వేసుకున్న తరువాత ఆ ఇబ్బంది నుండి తప్పించుకున్నాం'' అని శ్రీనగర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న షఫత్ అహ్మద్ చెప్పారు. ఐదువేలమంది పైగా ఈ అప్లికేషన్‌ను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నారు.

                         ఇంత మంచి అప్లికేషన్ డెవలప్ చేసిందంటే ఆమె పెద్ద చదువులే చదివి ఉండాలనుకుంటాం. కాని 'శ్రీనగర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్'లో కంప్యూటర్ సైన్సులో గ్రాడ్యుయేషన్‌ను పోయిన ఏడాదే పూర్తిచేసింది ఆయేషా. ఆ తరువాత ఒక నెల రోజుల పాటు ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైనింగ్ కోర్సు చేసిందంతే. "నాకు అప్లికేషన్ డెవలప్ చేయడమంటే చాలా ఆసక్తి. ఈ అప్లికేషన్ పూర్తి చేయడానికి రోజకి ఎనిమిది గంటలు పనిచేశాను'' అందామె. ఈమె తండ్రి అటవీశాఖాధికారిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన మాట్లాడుతూ "ఏ విషయాన్ని అయినా చాలా త్వరగా ఆకళింపు చేసుకుంటుంది ఆయేషా. ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంది. డయల్ కాశ్మీర్ అప్లికేషన్ తయారీలో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బాగా శ్రమించింది. చివరికి సాధించింది. నా కూతుర్ని చూస్తే నాకెంతో గర్వంగా ఉంది'' అన్నారు.

మూలం : ఆంధ్రజ్యోతి 

0 Comments

చరఖా వీడని ‘చదువుల తల్లి’!

6/19/2013

0 Comments

 
Picture
              మనం స్వయం సమృ ద్ధి సాధించాలన్నా, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా అధిగమించాలన్నా ‘చరఖా’ మాదిరి అనునిత్యం పని చేస్తూనే ఉండాలని జాతిపిత మ హాత్మా గాంధీ అలనాడు స్వాతంత్య్రోద్యమ కాలం లో దేశ ప్రజలను చైతన్యవంతం చేసేవారు. భారతీయ సంస్కృతికి చరఖాతో అనుబంధం ఈనాటిది కాదు. అయితే, కాలగమనంలో గాంధీ ఆశలు, ఆకాంక్షలన్నీ తలకిందులై, నేటి తరం పిల్లలకు ‘చరఖా’ అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో జాతి జనులకు స్ఫూర్తినిచ్చిన ‘చరఖా’ జన జీవనం నుంచి దాదాపు అదృశ్యమైంది. ఇందుకు భిన్నంగా చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓ యువతి చదువులో ఉత్తమ ప్రతిభ కనపరచినప్పటికీ ‘చరఖా’ను మాత్రం వదిలేది లేదంటూ స్పష్టం చేస్తోంది. తమిళనాడులోని దిండిగుల్ జిల్లా చిన్నల్‌పట్టికి చెందిన నిత్య (16) ఇటీవల ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో 491 మార్కులు ( 500 మార్కులకు) సాధించి అందరినీ అబ్బురపరిచింది. సాంఘిక శాస్త్రంలో నూరు శాతం మార్కులను, గణితం, సైన్స్‌ల్లో 97 మార్కులు సాధించింది. తన తండ్రి నేత కార్మికుడిగా పనిచేస్తుండగా, ఇంట్లో చరఖా ఒడుకుతూ నిత్య ఎంతో కొంత సంపాదిస్తోంది. విద్యుత్ కోత, నీటి కొరత కారణంగా చేనేత పరిశ్రమ ఇక్కట్ల పాలవగా, నిత్య తండ్రి ముత్తుసామి రోజుకూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. నిత్య అక్కచెల్లెళ్లలో ఒకరు చాక్లెట్ల కంపెనీలో పని చేస్తుండగా, ఇంకో సోదరి బిఎస్సీ చదివింది. కుటుంబ సభ్యులు, టీచర్ల ప్రోత్సాహం కారణంగా తాను చదువుపై దృష్టి పెట్టినా, కుటుంబ పోషణ కోసం రోజూ కనీసం నాలుగు గంటల సేపు చరఖాపై పనిచేసి చీరలు నేస్తుంటానని నిత్య చెబుతోంది. చదువుకు కేవలం నాలుగు గంటలు కేటాయిస్తానని చెబుతున్న ఈమె తాను ఇప్పటి వరకూ సుమారు 300 చీరలను నేసినట్లు తెలిపింది. ఖర్చులన్నీ పోను వారానికి కనీసం 700 రూపాయల ఆదాయం వస్తోందని ఆమె సంబర పడుతోంది. చదువులో మరింతగా రాణించి, ఐఎఎస్ ఆఫీసర్ కావాలన్నదే తన జీవితాశయం అని ఆమె తన మనసులోని మాట చెప్పింది. అన్ని విధాలా నిరాదరణకు గురవుతున్న పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసేందుకు తాను ఐఎఎస్‌లో ఉత్తీర్ణత సాధించి తీరతానని ఆమె ధీమాగా చెబుతోంది. చేతివృత్తులను ఆదరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. 


మూలం : ఆంద్రభూమి 

0 Comments

పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్ 

6/19/2013

0 Comments

 
Picture
      పాకిస్తాన్‌లోని నిర్బంధాలు, కట్టుబాట్ల మధ్య మహిళలు బయటికి వెళ్లి స్వేచ్ఛగా చదువుకోలేని పరిస్థితి. అలాంటి చోట అందరిలా సాధారణంగా చదువుకొని, ఉద్యోగం చేయడమంటే మాటలా! అలా పురుషా ధిక్యత ప్రబలంగా ఉన్న పాక్‌ సైన్యంలో ఒక మహిళ ఫైటర్‌ పైలట్‌గా మారిందంటే మీరు నమ్ముతారా? పురుషు లకు తామేమీ తీసిపోమంటూ పట్టుదలతో మహిళా ఫైటర్‌ పైలటయ్యారు ఆయేషా ఫారుక్‌..


            పాకిస్తాన్‌ 'సైన్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒకే ఒక మహిళా ఫైటర్‌ పైలట్‌ మీరే' అని అంటే ఆలివ్‌గ్రీన్‌ స్కార్ఫ్‌ చుట్టుకున్న హెల్మెట్‌ ధరించిన ఆయేషా చిరునవ్వులు చిందిస్తారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని చారిత్రక నగరం భవల్పూర్‌కు చెందిన ఆయేషా గత పదేళ్లుగా పాకిస్తాన్‌ వైమానిక దళం లోని 19 మంది మహిళా పైలట్లలో ఒకరు. ఆయే షాయే కాక ఇంకా ఐదురుగు మహిళా ఫైటర్‌ పైలట్లు కూడా ఉన్నారు. కానీ వీరంతా యుద్ధ రంగంలో పోరాడడానికి అర్హత సాధించే ఆఖరి పరీక్షల్లో ఇంకా పాల్గొన లేదు.

                  ఆయేషా మాత్రం 'నేను ఎలాంటి తేడానూ గమనించలేదు. మేం అందరి లాగే ఒకే పనులు చేస్తాం. నిర్దేశిత ప్రదేశంలో కచ్చితంగా బాంబులు వేస్తాం' అని తన పురుష సహచరులతో మృదువుగా అంటారు. వీళ్ల స్థావరం ఉత్తర పాకిస్తాన్‌లోని ముషఫ్‌ బేస్‌. ఇక్కడ 50 డిగ్రీల సెల్సి యస్‌ ఉష్ణోగ్రతలో చక్కగా పేర్చిన యుద్ధ అస్త్రా లున్న చోట కూర్చొని ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్‌ మహిళల వైఖరిలో మార్పు వస్తోందనడానికి ఆయేషాయే ప్రత్యక్ష ఉదాహరణ. కొన్నేళ్లుగా పాకిస్తాన్‌ రక్షణ బలగాల్లో మహిళలు చేరడం పెరుగుతోంది. 'తీవ్రవాదం, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మా కాళ్లపై మేము నిలబడటం ముఖ్యం ' అని ఆయేషా చెప్పారు. తాలిబాన్‌ తీవ్రవాదులను, పెరుగుతున్న మత హింసను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ వ్యాఖ్య చేశారు. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రత క్షీణిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇక్కడున్న అమెరికా సైనిక దళాలు వెనక్కు వెళతాయి. మరోవైపు భారత్‌తో అసౌకర్యమైన సంబంధం దీనికి తోడైందని అంటారు.

                    నిరక్షరాస్యురాలైన తన వితంతు తల్లితో విభేదించి ఏడేళ్ల క్రితం ఆయేషా ఎయిర్‌ ఫోర్స్‌లో చేరారు. 'మా సమాజంలో చాలా మంది అమ్మాయిలు విమానంలో ప్రయా ణించడమనే ఆలోచన చేయరు' అని చెప్పారు. కుటుంబ ఒత్తిడి ఎదుర్కొని సైన్యంలో చేరినా, ఇక్కడ సాంప్రదా యిక పురుషాధిక్యత వల్ల యుద్ధానికి సిధ్దమయ్యే చివరి దశకు వెళ్లడం మానుకుంటున్నారని ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. ఈ దశకు చేరుకోలేని వారు దళాలకు సామగ్రి తరలించే, నెమ్మదిగా నడిచే విమానాలను నడుపుతున్నారు.

                     ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దున ఉన్న గిరిజన ప్రాంతంలో అత్యాచారాలు, అవయవాలు తొలగించడం, మహిళల్ని చంపడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. మహిళల హక్కులను రక్షించడంలో పాకిస్తాన్‌ విఫలమైంది. కానీ ఇప్పుడు మహిళలు తమ హక్కులను తెలుసుకుంటున్నారు. వైమానిక దళంలో చేరి సాధికారత సాధించడానికి సిద్ధమవు తున్నారు. 'చాలా మంది మహిళలు ఎయిర్‌ ఫోర్స్‌లో చేరుతు న్నార'ని వింగ్‌ కమాండర్‌ ఆఫ్‌ స్క్వార్డ్రన్‌ నసీమ్‌ అబ్బాస్‌ తెలిపారు. ఆయేషాతో సహా 20 మంది మహిళలను పైలట్లుగా అబ్బాస్‌ తయారు చేశారు.

                ఆయేషా చైనా తయారు చేసిన ఎఫ్‌-7పిజి ఫైటర్‌ జెట్‌లో ప్రయాణిస్తున్నారు. 'తీవ్రవాదం నుండి పాకిస్తాన్‌ను రక్షించడం చాలా ముఖ్యం. ఇందులో ప్రతీ ఒక్కరూ భాగ స్వాములవడం కూడా చాలా ముఖ్యం' అని 24 ఏళ్ల ఎవియా నిక్స్‌ ఇంజనీర్‌ ఆనం హసన్‌ అన్నారు. హసన్‌ ఎఫ్‌-16 ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పనిచేస్తారు. ఆ మాటలకు తగ్గట్లే పాకిస్తాన్‌ సాయుధ దళాల్లో ప్రస్తుతం 4000 మంది మహిళలున్నారు. ఇందులో చాలా మంది డెస్క్‌ ఉద్యోగాలు, వైద్యం సంబంధ పనులు చేస్తున్నారు. గత దశాబ్దంలో మహి ళలు స్కై మార్షల్స్‌ అయ్యారు. ఎంపిక చేసిన కొంత మంది మహిళలు ఎలైట్‌ యాంటి-టెర్రరిస్టు ఫోర్సులో ఉన్నారు. ఐదేళ్ల కిందట ఎయిర్‌ఫోర్స్‌లో 100 మంది మహిళలుం డగా, ఇప్పుడు 316 మంది ఉన్నారని అబ్బాస్‌ తెలిపారు. ఆయేషా లాంటి మహిళా ఫైటర్‌ పైలట్ల రాకతో, వివక్ష క్రమంగా కనుమరుగవుతుందనే ఆశ కలుగుతోంది. 

మూలం : ఆంధ్రజ్యోతి 

0 Comments

అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి 

6/17/2013

0 Comments

 
Picture
తెలుగు వారు గర్వించే విధంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించడమే కాకుండా, తొలి గవర్నర్ గానే కాకుండా, న్యాయవాదిగా, కలెక్టర్ గా , తొలి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పదవులను అధిరోహించి, తన సొంత జిల్లా పై ఎనలేని మమకారాన్ని కురిపించిన తెలుగింటి ఆడపడచు రమాదేవి గారి గురించి.....

                 రమాదేవి పశ్చిమ గోదావరి జిల్లాలోని చేబ్రోలులోని ఉంగుటూరు మండలంలో జనవరి 15 , 1934లో జన్మించారు. రమాదేవి తల్లితండ్రులు వి. సుబ్బయ్య,  వి వెంకట రత్నమ్మ. విద్య అంత ఏలూరు, హైదరాబాద్‌లోనే సాగింది. రమాదేవి విఎస్‌ రామావతార్‌ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మెట్టినిల్లు చేబ్రోలుకు ఆరు కిలోమీటర్ల దూరంలో కాగుపాడు. తన విద్య ఏలూరులోని సెయింట్‌ థెరిసా, సీఆర్‌ ఆర్‌ కాళాశాలల్లో ఇంటర్‌ దాక చదివారు. తరువాత హైదరాబాద్‌కు వచ్చి ఎమ్‌ఎ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు.విద్యానంతరం 1959లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాధిగా పనిచేశారు. ఇండియన్‌ లీగల్‌ సర్వీస్‌లో చేరి వివిధ హోదాల్లో పని చేశారు. అంతేకాకుండా ప్రత్యేక లెజిస్లేటివ్‌ శాఖ కార్యదర్శిగా, లా మిషన్‌ మెంబర్‌గా విధులు నిర్వర్తించారు. వాటితో పాటు కస్టమ్స్‌ ఎకై్సజ్‌ అప్పీళ్ల ట్రీబ్యునల్‌ సభ్యులుగా కూడా పని చేశారు.

                                    1999 నుంచి కర్ణాటక గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి 2002 వరకు విధులు నిర్వహించారు.
అంతేకాకుండా రమాదేవి కామన్‌ వెల్త్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి ఆసియా దేశస్తురాలిగా, అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈమె పదవి బాధ్యతలతో పాటు రచయిత్రిగా కవిత్వాలు రచనలు రాశారు. దాదాపు తెలుగు భాషలో ఇరవైకి పైగా గ్రంథాలు, నవలలు, కథానికలు, వ్యాసాలు, నాటకాలు రచించారు. అమె రాసిన గ్రంథాలు, రచనలు అఖిల భారత రచయితల సదస్సులో ఉంచారు. ఢిల్లీలోని ఆంధ్ర వనితా మండలి అధ్యక్షురాలిగా పని చేశారు. రమాదేవిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
                               
                              తన రచనతలతో అందర్ని రంజింప చేసిన రమాదేవి గొప్పతనం అంతా రాజదాని నుంచే ప్రారంభమైనది. తన మొదటిగా రాజధానిలో ఉన్న అకాశవాణిలో పిల్లల కార్యక్రమంతో అందరిని అకట్టుకుంది. అనేక పత్రికల్లోను రమాదేవి వ్యాసాలు ప్రచురమయ్యేవి. దాదాపు 19 పుస్తకాల పై గానే రమాదేవి రాశారు. అమె రాసిన రచనలు ప్రజలలో ఆసక్తిని రెపాయి. రచనల ద్వారా ప్రజలలో మార్పు వస్తుందని భావించి అనేక పుస్తకాలను రాశారు.మహిళలు, చిన్నారులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై, చట్టాలపై ఆమె పలు పుస్తకాలు రాశారు. 

                               పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు.  సమాజంలో జరుగుతున్న రుగ్మతులను తన పాఠ్యంశాలలో పొందుపరిచింది. ఒక్క మన రాష్ట్రానికి కాకుండా పలు రాష్ట్రాలకు ఆదర్శ మహిళగా కీర్తించబడ్డారు. మహిళా లోకానికి స్ఫూర్తిగా వెలుగొందారు. ఇతర రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన మన రాష్ట్రంలో జరిగే అనేక సాంకేతిక, సాహిత్యా కార్యక్రమాలకు ఆహ్వానం అందిన వెంటనే ఎన్ని కార్యక్రమాలున్న హాజరయేవారు. కామన్‌ వెల్త్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పదవి చేపట్టినప్పుడు భాగ్యనగరమంతా సంబరాలతో నిండిపోయింది. 

                               తాను ఎంత ఉన్నత పదవులు చేపట్టినా కూడా పశ్చిమ గోదావరి జిల్లాపై ఎంతో ప్రేమ ఉండేది. ఏదైనా శుభకార్యాలకుగాని ఇతర బంధు మిత్రులను కలుసుకోవాడానికి తరచుగా వెళ్తుండేవారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేవారు. అవసరమున్న ప్రతిసారి తన సొంత జిల్లాను సందర్శించేవారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల మిషనర్‌గా నవంబర్‌ 1993 సంవత్సరంలో కొంతకాలం పని చేశారు. 1993 జూలైలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా నియమితులై 1997 వరకు పదవిలో కొనసాగారు. రమాదేవి సేవలు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాలకు తన సేవ చేశారు. 1997 హిమచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా 1999 వరకు ఆ రాష్ట్రానికి సేవలందిచారు. 

                             ఆంధ్రభూమితో రమాదేవికి సుమారు ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది. గోరా శాస్ర్తీ సంపాదకత్వంలో ప్రారంభించిన విపులాచపృథ్వీ కాలమ్‌ను దీర్ఘవిరామం తరవాత ఆమె మళ్లీ కొనసాగించి అనేక సంవత్సరాలు నిర్వహించారు. అందులో సమకాలిక రాజకీయ, సామాజిక పరిణామాలపై ఆమె తనదైన శైలిలో విశ్లేషించిన తీరు పాఠక లోకం మన్నన పొందింది. ఆంధ్రభూమి వార, మాస పత్రికలలో కూడా ఆమె చాలా కాలం కాలమిస్టుగా ఉన్నారు.

మూలం : తెలుగు విశేష్ 

0 Comments

ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది 

6/17/2013

0 Comments

 
Picture
దేవుడు చేసిన బొమ్మలం మనమంతా...
మనుషూలలో తేడాలు ఉన్నా... 
మన మనసులలో మాత్రం ఉండకూడదు...
ఆత్మవిశ్వాసంతో అవిటితనాన్ని కూడా ఆమడదూరం పరిగెత్తించగల సత్తా ఉన్న నేటి తరానికి ప్రతినిధి ఆమె. 
ఆమె నవ్వితే గలగల...
పాడితే జరజర...
ఎవరెన్ని కామెంట్లు వెనుకనుంచి చేసినా... 
ముందునుంచి నవ్వినా...
తేలిగ్గా తీసుకుంటుంది...
నిండా రెండడుగులు కూడా పెరగని దేహంతో కనిపించినా...
ఆత్మవిశ్వాసం, పట్టుదలలలో నేటి యువతులకు ఈమె ఏ మాత్రం తీసిపోదు. అందంగా పాలరాతి శిల్పంలా ఎప్పుడూ నవ్వుతూ...తుళ్లుతూ కనిపించే జ్యోతి అంజె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ...

                    ప్రపంచంలోనే అత్యంత పొట్టి అమ్మాయిగా రికార్డును సాధించిన జ్యోతి పూర్తి పేరు జ్యోతి అంజె. నాగపూర్‌లో తన తల్లిదండ్రులతో ఉంటోంది. ఆమె ఎత్తు 1.11 అడుగులు అంటే సుమారు62.8 సెం.మీ. బరువు కేవలం 5 కిలోలు. వయసు 18 సంవత్సరాలు. ప్రస్తుతం 10వ తరగతి పూర్తి చేసుకొని కాలేజి విద్య అభ్యసించడానికి సిద్ధం అవుతోంది.

అన్నీ ప్రత్యేకతలే...
                    18 సంవత్సరాల జ్యోతి ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకోబోయేదాకా అన్నీ ఆశ్చర్యం గొలిపేవిధంగా ఉంటాయి. ఆమె ఉపయోగించే బ్రష్‌ చిన్నపిల్లలకోసం ప్రత్యేకంగా వాడేది. వేసుకునే డ్రెస్‌ అంటే ప్రత్యేకంగా కుట్టించాల్సిందే మరి. ఆ సైజ్‌ ఎక్కడా రెడీమేడ్‌లో దొరకదు. ఇక షూస్‌, మెడలో వేసుకునే గొలుసులు ఇవన్నీ కూడా ఆమె కోసం ప్రత్యేకంగా తయారుచేయించినవే.జ్యోతి చదువుల రాణి కూడా. స్కూల్‌ యాజమాన్యం ఈ బుల్లి జ్యోతి కోసం ప్రత్యేకంగా తయారుచేయించిన కుర్చీ, బెంచీలో కూర్చోవడానికి సదుపాయం కల్పించారు.. క్లాసులో అంతా జ్యోతి కన్నా పొడవైన వాళ్లే. అయినా వాళ్లంతా జ్యోతిని విపరీతంగా ప్రేమిస్తారు. జ్యోతి ఒక్కరోజు స్కూలుకు రాలేదంటే వాళ్లంతా ఆమెకోసం వాకబుచేస్తారు. ఆమెకు ఏమయిందోనని ఆందోళనపడతారు.

భగవంతునికి కృతజ్ఞతలు...
                        చిన్నగా ఉన్నాననే ఫీలింగ్‌ తనకు ఏనాడూ ఉండదని...తన మనసులో అసలు ఎప్పుడూ అటువంటి ఆలోచనే రానివ్వనని అంటుంది జ్యోతి. ఆ భగవంతుడు నాకు అన్ని అవయవాలు ఇచ్చాడు. చదువుకునే తెలివితేటలు ఇచ్చాడు. ఇంత అందమైన మొహాన్ని ఇచ్చాడు. మానసిక ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. సమాజంలో ఇంతమందిలో నన్ను ప్రత్యేకంగా గుర్తుంచుకునేలా చేసినందుకు నేనే ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నన్ను చూడటానికి ఎందరో వస్తుంటారు. కొందరు దీవిస్తుం టారు. మరికొందరు నన్ను వాళ్ల తెగ దేవతగా కొలిచివెళుతుంటారు. అదే కాస్త ఇబ్బంది అనిపిస్తూంటుంది. కాలక్షేపానికి ఇంట్లో చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు పక్కింటి ఆంటీ వాళ్ల రెండు సంవత్సరాల పిల్లవాడిని నాకు అప్పజెప్పి ఆంటీ బజారుకు వెళ్లివస్తుంది. విచిత్రం ఏమిటంటే ఆ కుర్రాడే నాకన్నా పొడుగ్గా ఉంటాడు అని నవ్వుమోముతో చెబుతుంది జ్యోతి. 

తల్లిదండ్రులు ఏమంటున్నారంటే...
                       ఆమె పుట్టడం అందరిలానే పుట్టింది. మామూలుగానే పెరిగింది. ఐదు సంవత్సరాలు వచ్చే దాకా తెలియలేదు. ఐదవ సంవత్సరం తర్వాత ఆమె ఎదుగుదలలో మార్పు గ్రహించి వైద్యులను సంప్రదించాము. ఆమెకు ఎకండ్రోప్లాసియా అని వైద్యులు ధ్రువీకరించారు. ఇకపై ఆమె ఎంతమాత్రం ఎదగ దు. మానసికంగా ఆమె ఎదిగినా...శారీరకంగా జీవితకాలం ఆమె ఇలానే ఉంటుందని వైద్యులు చెప్పారు. అయినా ఒక కన్న తల్లిగా జ్యోతి అంటే ప్రాణం. ఆమెను అందంగా ఓ చిన్నసైజ్‌ బొమ్మలా ముస్తాబు చేయడంలో తల్లి పాత్రే ఎక్కువ. ఇప్పటికీ ఇంటికి రాగానే జ్యోతికి దిష్టితీయడం అలవాటు అంటుం ది 45 సంవత్సరాల రంజన అంజె (జ్యోతి తల్లి).

అల్లరి పిల్ల...
                        ఇంటిదగ్గర ఉన్నంత సేపూ జ్యోతి అల్లరి అంతా ఇంతా కాదు. చెవులకు వాక్‌మాన్‌ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదిస్తుంది. హిందీ పాటలంటే జ్యోతికి ప్రాణం. ఇంట్లో జ్యోతి భోజనం చేసే పద్ధతి కూడా తమాషాగా ఉంటుంది. బుల్లి కంచంలో...బుల్లి చెంచాతో ఆమె తింటుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఊరిలోనే ఇప్పుడు జ్యోతి ఓ పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది. ఆమెను చూడటానికి వచ్చే సందర్శకులతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. 

ఆశయం...
                        చిన్ని జ్యోతికి కూడా పెద్ద ఆశయమే ఉంది. ఏనాటికైనా బాలీవుడ్‌ చిత్రాలలో నటించాలని తెరపై తనని తాను చూసుకోవాలని...అవకాశం వస్తే అమెరికా...లండన్‌ పట్టణాలను సందర్శించాలని...అక్కడ ఏమైనా ప్రదర్శనలు సైతం ఇవ్వాలని జ్యోతి ఆశయం. అందుకే జ్యోతి ఇప్పుడు డాన్స్‌ కూడా నేర్చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమెకు ఒక కన్నడ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తొందరలోనే కెమారాలో రాక్‌ చేయనుంది. 

గిఫ్ట్‌ ఆఫ్‌ గిన్నిస్‌ బుక్‌..
                   ఇటీవలే జ్యోతి తన 18వ జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు అధికారులు ఆమెకు ఏకంగా ఒక రికార్డునే బహుమతిగా ఇచ్చా రు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుసృష్టించిన జ్యోతి హైట్‌ 62.2 సెంటీమీటర్లు. ఇంతకు ముం దు ఈ రికార్డు అమెరికాకు చెందిన జొర్డాన్‌ పేరిట ఉంది. 

అందరిలానే...
                        నేటి యువతకున్న కోరికలు, సరదాలు జ్యోతిలోనూ ఉన్నాయి. అందరిలానే తాను కూడా నలుగురిలో ఆడుతూ పాడుతూ సరదాగా గడపాలని ఉంటాయంటుంది. ఒక్కోసారి మేటి ఫ్యాషన్‌ మోడల్‌లా తయారవుతుంది. ఒక్కోసారి ప్రత్యేకంగా కుట్టించుకున్న జీన్స్‌, టీషర్ట్‌లు వేసుకుంటుంది. విశేషం ఏమిటంటే జ్యోతి అందమైన మొహానికి ఏ డ్రెస్‌ వేసుకున్నా ఆ డ్రెస్‌కే ఒక కళ వస్తుంది. ఇంట్లో హోమ్‌ థియేటర్‌, డివిడి ప్లేయర్‌ పెట్టుకుని సరదాగా సినిమాలు చూస్తుంది. ఏం కావాలంటే అది చేసిపెట్టే తల్లిదండ్రులు ఉంటే తనకు లేనిది ఏముంటుందని జ్యోతి గర్వంగా చెబుతుంది.

మూలం : తెలుగు విశేష్

Picture
0 Comments

పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా 

6/17/2013

0 Comments

 
Picture
విద్యా హక్కుల కోసం పోరాడుతున్న మహిళ - మలాలా                
             
                 మలాలా యూసఫ్‌జాయ్ మొన్నామధ్య వరకు ఈ పేరు అంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈమె పేరు తెలియని ప్రపంచ దేశాలు ఉండవు. ఉర్దూలో ‘గుల్ మకాయి’ అంటే మొక్కజొన్న పువ్వని అర్థమట. ‘మలాలా’ అనే పేరు ప్రపంచానికి తెలియకముందు, ఆ కలంపేరుతో తమ ప్రాంతపు వెదను ప్రపంచానికి వెల్లడించింది మలాలా యూసఫ్‌జాయ్. అప్పుడు తన వయసు పదకొండేళ్లు. ఏడో క్లాసు చదువుతోంది. ఇంత చిన్నమ్మాయి ఇదంతా చేసిందంటే అబ్బురమనిపించొచ్చు. కానీ పరిస్థితులు ఎవరినైనా అలా తీర్చిదిద్దుతాయంటుంది తను, పెద్ద ఆరిందలా. తాలిబాన్ల ప్రాబల్యం ఉన్న పాకిస్తాన్‌లోని స్వాత్ ప్రాంతంలో, బాలికల చదువు మీద నిషేధాజ్ఞలున్న విపత్కర ప్రదేశంలో దానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2009 నుంచీ ప్రసార మాధ్యమాల్లో స్పందించింది. పిన్న వయసు విద్యాహక్కుల కార్యకర్తగా మన్ననలందుకుంది. దీన్ని సహించలేని తాలిబాన్లు మొన్న అక్టోబర్ 9న ఆమె మీద కాల్పులు జరిపారు. ఒక దశలో అంతిమసంస్కారాలకు ఏర్పాట్లు చేయడం గురించి ఆలోచించారామె తల్లిదండ్రులు. కానీ క్రమంగా కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి నవంబర్ 10ని ‘మలాలా  డే’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ మొక్కజొన్న పువ్వు ’ గురించి కొన్ని విషయాలు.


స్వాత్ నుంచి సమితి వరకు...

                    పాకిస్తాన్ స్వాత్ జిల్లాలోని ఒక పట్టణం మింగోరా. 1,75,000 జనాభా ఉన్న మింగోరా... స్వాత్ నదికి దగ్గరగా ఉన్న అందమైన పర్యాటక ప్రదేశం. అందుకే దాన్ని ‘స్విట్జర్లాండ్’గా అభివర్ణించారు రెండో ఎలిజబెత్ రాణి. మింగోరాతో సహా స్వాత్ జిల్లాలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. పాకిస్తాన్ సైన్యానికీ వారికీ మధ్య తీవ్రమైన కాల్పుల తర్వాత ప్రస్తుతం ఈ ప్రాంతం సైన్యం అధీనంలో ఉంది. ఈ మింగోరా పట్టణంలోనే మలాలా 1997 జూలై 12న జన్మించింది. పష్తూన్ కవయిత్రి, ఆంగ్లేయులతో పోరాడిన వీరనారి మలాలాయి పేరుమీదుగా తన కూతురికి మలాలా అని నామకరణం చేశారు జియావుద్దీన్. ఈయన కవి, విద్యాసంస్థల యజమాని.
                         2009లో తాలిబాన్లు స్వాత్ జిల్లాను ఆక్రమించుకున్నప్పుడు జనవరి 14 నుంచీ బాలికల చదువును పూర్తిగా నిషేధించారు. దీనిమీద ఒక కార్యక్రమం రూపొందించడానికి ‘బీబీసీ’ ప్రయత్నించినప్పుడు, ప్రాణభయంతో గొంతు విప్పడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో మలాలా ధైర్యం చేసింది. తర్వాత ‘గుల్ మకాయ్’ పేరుతో అదే బీబీసీ ఉర్దూ బ్లాగులో డైరీ రాసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణకు నోచుకుంది. సొంతపేరుతో వెలుగులోకి వచ్చాక మలాలా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు సహా ఎన్నో ఇంటర్వ్యూలిచ్చింది. అంతర్జాతీయ సమాజం ఆమెతో గొంతు కలిపింది. ఇదే తాలిబాన్లకు కంటగింపుగా మారింది.
                            9 అక్టోబర్ 2012న మలాలా పరీక్ష రాసి స్కూలు బస్సులో ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు, ముసుగు ధరించిన ఒక  తుపాకీ వ్యక్తి లోపలికి ప్రవేశించి, ‘ఇందులో మలాలా ఎవరు? లేదంటే అందరినీ కాల్చిపారేస్తాను,’ అని బెదిరించాడు. మలాలాను గుర్తించిన తర్వాత తలమీద, మెడ మీద రెండుసార్లు కాల్చాడు. తీవ్రంగా రక్తమోడిన ఆమెను వెంటనే పెషావర్‌లోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత రావల్పిండిలోనూ చికిత్స జరిగింది. అటుపై కేసు తీవ్రత దృష్ట్యా బర్మింగ్‌హామ్ తీసుకెళ్లారు. ఇప్పుడామె క్రమంగా కోలుకుంటోంది. ఈ దాడిలో మలాలాతో పాటు గాయపడిన మరో ఇద్దరు బాలికలు కైనాత్ రియాజ్, షాజియా రంజాన్ పరిస్థితి కూడా నిలకడగా ఉంది. అసభ్యతకు, అవిశ్వాసానికి ప్రతీకగా మలాలాను చూస్తున్నట్టుగా తాలిబాన్ పేర్కొంది. ఆమెతోపాటు, ఆమె తండ్రి జియావుద్దీన్‌ను కూడా ఎప్పటికైనా చంపేస్తామని ప్రకటించింది. అయితే, మలాలా మీద జరిగిన దాడిని నిరసిస్తూ, ఆమె మీద కాల్పులు జరిపిన వారికి వ్యతిరేకంగా సుమారు 50 మంది పాకిస్తాన్ మతగురువుల బృందం ఫత్వా జారీ చేసింది.


‘మలాలా యూసఫ్‌జాయ్ ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాల’

             చిన్న వయసులోనే బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలా 2011 సంవత్సరానికిగానూ ‘అంతర్జాతీయ శాంతి బహుమతి’కి నామినేట్ అయి, రన్నరప్‌గా నిలిచింది.
  • 2011 డిసెంబరులో పాకిస్తాన్ తన మొట్టమొదటి ‘నేషనల్ యూత్ పీస్ ప్రైజ్’ను మలాలాకు బహూకరించింది.
  • 2012 జనవరిలో స్వాత్‌లోని ఒక ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాలకు ఆమె పేరు పెట్టారు.
  • దాడి జరిగిన తర్వాత, అక్టోబర్ 15న ఆమె ధైర్యసాహసాలను గౌరవిస్తూ పాకిస్తాన్ అక్కడి మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘సితారా ఎ షుజాత్’ను ప్రకటించింది.

మూలం : తెలుగు విశేష్

0 Comments
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.