telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

లండన్ లో తండ డిజైనర్ వేర్

7/18/2013

0 Comments

 
Picture
                ఇరవైఏళ్లక్రితం ఓ తండా అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేసిన లక్ష్మి ఈ రోజు దేశ, విదేశాల్లో డిజైనర్వేర్ సేల్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మంచ్యాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన లక్ష్మి విజయం వెనుక ఉన్న విశేషాలు ఆమె మాటల్లో...

మగవాళ్లు కూడా...
               ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి రెండేళ్ల క్రితం లండన్ వెళ్లాను. నాతోపాటు మరో నలుగురు మహిళలు వచ్చారు. మేమంతా ఎగ్జిబిషన్కి లంబాడా డ్రస్సులు వేసుకుని వెళ్లాం. మేం తయారుచేసిన బ్లౌజ్పీసులు, పౌచ్లు, హ్యాండ్బ్యాగులు.. స్టాల్స్లో పెట్టి కూర్చునుండేవాళ్లం. కొందరైతే మా గాజుల్ని, జడలకు పెట్టుకునే జుంఖాలను చూసి, వీటిని కూడా అమ్ముతారా అనేవారు... మగవాళ్లు కూడా..! అని ఈ రంగంలోకి అడుగుపెట్టిన తొలిరోజులను గుర్తుచేసుకున్నారు లక్ష్మి.

ఆమె పుణ్యమే...
                       నేను అంగన్వాడీలో పిల్లలకు అన్నం తినిపిస్తుంటే ఒకసారొచ్చిండు. బట్సార్ అని ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసరు. నేను అప్పట్లో మా లంబాడా డ్రస్సే వేసుకునేదాన్ని. ఒకరోజు ఆ సారు నా దగ్గరికొచ్చి ‘ఈ డ్రస్సు ఎవరు కుట్టారు?’ అని అడిగారు. నేనే కుట్టుకున్నానని చెబితే నమ్మలేదు. మా ఇండ్లల్లో పెండ్లి సమయానికి ఈ డ్రస్సు కుట్టడం రావాలి. లేదంటే అది పెద్ద తప్పు... అనేసరికి మారుమాట్లాడకుండా వెళ్లిపోయాడు. 

                     మూడు రోజుల తర్వాత సత్యవతి అని ఒక మేడమ్ని తీసుకుని వచ్చాడు. ఆమె తండాలోని తోటి మహిళలందరినీ తీసుకురమ్మంది. మేము వేసుకునే డ్రస్సుల మాదిరి వర్కు చేసి పట్టణాల్లో అమ్మితే బోలెడు డబ్బులొస్తాయని చెప్పింది ఆమె. మర్నాడు... కొత్తరకం కుట్లు నేర్పే టీచర్ అని జెప్పి ఇంకొకామెను తీసుకొచ్చింది. 

                      ఆమె మూడునెలలపాటు రకరకాల కుట్లు, అల్లికలు నేర్పింది. మేం వాడే పూసలు, గవ్వలు, రాళ్లు, అద్దాలనే అన్నింటికీ వాడింది. అవి ఎక్కడ అమ్మాలో కూడా చెప్పింది. ఆ తర్వాత విజయలక్ష్మి మేడమ్ అని మాకు చాలా అండగా నిలబడ్డారు...’’ అంటూ వివరించింది లక్ష్మి. 

విదేశాల్లో అమ్మకాలు... 
                      మొదట్లో వీరు తయారుచేసిన వస్త్రాలు హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లోని ఎగ్జిబిషన్లలో అమ్మారు. లక్ష్మి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇరాన్ వెళ్లింది. తర్వాత లండన్ వెళ్లింది. ప్రస్తుతం తండాలో తోటిమహిళలతో రకరకాల కుట్లు, అల్లికలు చేయిస్తోంది. ఎగ్జిబిషన్లో అమ్మడానికి సరిపడా మెటీరియల్ రెడీ అయ్యాక దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆహ్వానాలలో తనకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్లడానికి ఏర్పాటు చేసుకుంటోంది. 

                  ‘సత్యవతి’ అంటూ లక్ష్మి మనకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు పెద్దకూతురు. తండాల్లో ఉన్న మహిళల జీవనోపాధిని అభివృద్ధి చేయడానికి అప్పట్లో ఆమె కృషి చేశారు. అందులో భాగంగానే ఎల్లమ్మతండాలోని మహిళలను డిజైనర్వేర్ రంగంలోకి దించారు.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి

7/17/2013

0 Comments

 
Picture
                    సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఓ మధ్యాహ్నం... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు అరవై కిలోమీటర్ల దూరంలోని విదిశ అనే చిన్న పట్టణంలో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై ఒంటరిగా కూర్చుని ఉంది ఆ పద్దెనిమిదేళ్ల అమ్మాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు, రెండు జతల బట్టలు తప్ప వెంట వేరే లగేజి కూడా లేదు. కొన్ని నిమిషాల తర్వాత ఓ ట్రైన్ రాగానే అది ఎక్కడికి వెళ్తుందని కూడా చూడకుండా ఎక్కేసింది. అంతే! మళ్లీ ఇంటిముఖం చూడలేదు.. ఇప్పుడామె ముంబయిలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్! పేరు వైశాలి షదన్గులే.

                    జీవితంలో ఎంతో సాధించాలని, ఏదేదో చేయాలని వైశాలి కలలు కంది. అయితే ఆమె తల్లిదండ్రులు వైశాలి ఎనిమిదో తరగతి చదువుతుండగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కనీసం పదో తరగతైనా చదవనివ్వండని పట్టుబట్టి ఒప్పించింది వైశాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదివింది. మళ్లీ పెళ్లి ఒత్తిడి మొదలైంది. ఈసారి మాత్రం తల్లిదండ్రులు ఆమె మాటను మన్నించే స్థితిలో లేరు. ఇక లాభం లేదనుకుని ఒకరోజు మధ్యాహ్నం చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి బయటికొచ్చేసిన వైశాలి నేరుగా రైల్వే స్టేషన్కు వచ్చి దొరికిన రైలు ఎక్కేసింది... టికెట్ కూడా తీసుకోకుండా! ఆ రైలు భోపాల్కు వెళ్లింది. దిగాక, స్నేహితులకు ఫోన్ చేద్దామంటే డబ్బుల్లేవు. 

                     ఓ ఎస్టీడీ బూత్ యజమానిని బతిమాలి.. కొంతమందికి ఫోన్ చేసింది. చివరికి ఓ స్నేహితురాలు ఆమె ఉన్న చోటికి వచ్చి తనుంటున్న హాస్టల్కు తీసుకెళ్లింది. కొన్ని రోజులు తనే వైశాలి ఖర్చులు భరించింది. ఈ సమయంలోనే వైశాలి ఓ చిన్న కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్గా పనికి కుదిరింది. కొన్ని నెలలు అక్కడే పనిచేశాక మరో ఉద్యోగం చూసుకుంది వైశాలి. అక్కడ జీతం రూ.1500. కొంతలో కొంత నయం. కానీ ఇది సాధించడానికేనా తను ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వచ్చేసింది! వైశాలికి దుస్తుల విషయంలో, డిజైన్ల విషయంలో మంచి అవగాహన ఉందని స్నేహితులు అంటుండేవారు. 

                     అది గుర్తొచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకుంది వైశాలి. అక్కడే ఒక యూనివర్శిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు సిలబస్ మెటీరియల్ తెచ్చుకుని సొంతంగా పాఠాలు నేర్చుకుంది. ఆ అవగాహనతో గుజరాత్లోని ఓ ఇన్స్టిట్యూట్కు ఇంటర్వ్యూకు వెళ్లింది. వారికి ఈమె ప్రతిభ నచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ టీచర్గా అవకాశమిచ్చారు. అక్కడ కొన్ని నెలలు పనిచేశాక.. ఆ అనుభవంతో ముంబయిలో ఓ సంస్థలో ఉద్యోగం తెచ్చుకుంది. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది.

                      ముంబయిలో ఓ లేడీస్ జిమ్లో ఆమెకు ఒక బ్యాంకర్ పరిచయమై లోన్ ఏర్పాటు చేశారు. రూ.50 వేల పెట్టుబడితో చిన్న డిజైనర్ డ్రెస్ దుకాణం ప్రారంభించింది. ఇద్దరు టైలర్లను కూడా పెట్టుకుంది. ఆమె డిజైన్ చేసిన దుస్తుల్లో నవ్యత వల్ల కస్టమర్లు బాగా ఆకర్షితులయ్యారు.

                            వైశాలి ముంబయి వచ్చే సమయానికే తనకు పూర్వపు స్నేహితుడైన ప్రదీప్ కూడా ముంబయికి చేరాడు. ఇద్దరి అభిరుచులు కలిసి పెళ్లి చేసుకున్నారు. ప్రదీప్ ప్రోత్సాహంతో తన వ్యాపారాన్ని విస్తరించింది వైశాలి. ఆ తర్వాత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల పరిచయంతో దుస్తుల డిజైనింగ్లో మరిన్ని మెళకువలు నేర్చుకున్న వైశాలి.. తన దుస్తుల్ని ఫ్యాషన్ వీక్లలో మోడల్స్తో ప్రదర్శన ఏర్పాటు చేసే స్థితికి చేరుకుంది. ఇలా ముంబయిలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ఎదిగిన వైశాలి షదన్గులే విజయగాథ ప్రతి మహిళకూ ఆదర్శం. 

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

బిడ్డ భవిత కోసం ఓ అమ్మ పోరాటం

7/16/2013

2 Comments

 
Picture
                         విజయవాడలోని ఓ హాస్పిటల్‌లో కల్పనను చేర్పించారు. అదేపనిగా నొప్పులు వస్తున్నా, ప్రసవం మాత్రం కావటం లేదు. కల్పన భర్తా, తల్లీ ఒకటే కంగారుపడుతున్నారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సమయం మించిపోతోంది. 'బలవంతంగా ప్రసవం చేయక తప్పదు' అన్నారు డాక్టర్లు. 'ఆమెకు ఏం కాదు కదా?'... కల్పన భర్త.... 'నా కూతురికి ఏ ముప్పూ రాదు కదా?' - కల్పన తల్లి... వాళ్లిద్దరూ అడుగుతూనే ఉన్నారు. కాసేపటికి 'ఆడపిల్ల మహాలక్ష్మిలా ఉందే! అచ్చు గుద్దినట్లు నీపోలికలే' తల్లి గొంతు విన్న కల్పనకు అంత నీరసంలోనూ ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. మరికొన్ని క్షణాలకే డాక్టర్‌ పసికందును కల్పన చేతుల్లో ఉంచుతూ... 'క్షమించండి, ప్రసవం సమయంలో పాప నుదుటి నరాలు బాగా నొక్కుకు పోయాయి' అని చెప్పారు. మూడు రోజుల తరవాత 'పాప, శారీరక వైకల్యానికి గురిచేసే సెరిబ్రల్‌ పాల్సీ బారిన పడే అవకాశం ఉంది' అని మిగతా వైద్యులు చెప్పడంతో కల్పన మాట్లాడలేకపోయింది.

                          పాపకి ఎనిమిది నెలలు నిండాయి. 'సరైన చికిత్స చేస్తే భావన పరిస్థితి మెరుగవుతుంది, చెన్నైలో అలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి' అని తెలుసుకుంది కల్పన. ఆ సమయానికే ఆమె భర్తకు విజయవాడ నుంచి కోల్‌కతాకు బదిలీ అయింది. 'మీరు అక్కడికి వెళ్లండి. నేను చెన్నై వెళతాను. భావనకు చికిత్స చేయిస్తాను'... భర్తతో చెప్పింది. భావనను తీసుకుని చెన్నై బయల్దేరింది. చెన్నైలో ఆస్పత్రికి దగ్గరగా చిన్న ఇల్లు తీసుకుంది. భావనను ఆస్పత్రికి తీసుకెళ్లడం... వ్యాయామాలు చేయించడం... కల్పనకు మరో ప్రపంచం లేదు. మరో ఆలోచనా లేదు. ఇల్లు, ఆస్పత్రి... ఈ రెండింటి మధ్యే పరుగులు... ఫలితం కోసం ఎదురుచూపులు. అలా రెండేళ్లు గడిచాయి. ఒకవైపు వైద్య చికిత్సలు... మరోవైపు ఫిజియోథెరపీలో భాగంగా వ్యాయామాలు. కొద్దికొద్దిగా సానుకూల ఫలితాలు కనిపించసాగాయి. అయినా 'పాప మాట్లాడలేదు. నడవలేదు. తన పనులు తాను చేసుకోలేదు. కానీ చూపూ, వినికిడీ వీటికి ఏ లోటూ లేదు. తెలివితేటల్లో ఎవరికీ తీసిపోదు' అన్నారు డాక్టర్లు. లోపాలను తలుచుకుంటూ దిగులు పడలేదు కల్పన. తన బిడ్డ తెలివైంది అని తెలుసుకుని కొండంత ధైర్యాన్ని తెచ్చుకుంది. కాలం గడిచింది.. కల్పనకు రెండోసారి ప్రసవం. ఏ ఇబ్బందీ లేకుండా మరో ఆడపిల్ల పుట్టింది.

                              భావనకు వూహ తెలుస్తున్న కొద్దీ తనకూ, మిగిలిన పిల్లలకూ తేడా తెలిసిరావడం మొదలైంది. లోపాలు తెలుస్తున్న కొద్దీ దిగులు కమ్ముకునేది. తన బాధను కంటిసైగల ద్వారా తల్లికి వ్యక్తం చేసేది. కొన్నిసార్లు ఏం చేయాలో తెలియక అసహనం వ్యక్తం చేసేది... తెగ ఏడ్చేది. అప్పుడు కల్పన చిట్టితల్లి బాధను అర్థం చేసుకుని ఓదార్చేది. తను మిగిలిన పిల్లల్లాగా ఎందుకు లేదో... అలా లేకపోయినా తెలివితేటల్లో ఆమె ఎవరికీ ఏ విధంగా తీసిపోదో... బడికి వెళ్లి చదువుకుంటే మిగిలిన వారితో ఎలా పోటీ పడగలదో అర్థమయ్యేట్లు చెప్పేది. దగ్గర్లో ఉన్న విద్యాసాగర్‌ వికలాంగుల స్కూల్‌లో భావనను చేర్పించింది. ఇక టీచర్లే తన బాధ్యత చూసుకుంటారులే అని వూర్కోలేదు. తనూ స్కూల్లో వలంటీరుగా చేరింది. వినికిడి లేని, మాట్లాడలేని వాళ్లకు స్కూల్లో 'ఆర్గ్యుమెంట్‌ అండ్‌ ఆల్టర్‌నేటివ్‌ కమ్యూనికేషన్‌' నేర్పిస్తారు. దాన్లో చేతులు కదుపుతూ సైగలు చేయాల్సి ఉంటుంది. భావన చేతులు కూడ కదపలేక ఇబ్బందిపడుతుంటే కల్పన కదిలిపోయింది. బిడ్డ కోసం ఆ శిక్షణలో తాను తర్ఫీదు పొందింది. కంటి సైగల భాషలో భావన నిష్ణాతురాలయ్యేలా తీర్చిదిద్దింది. అక్కడి నుంచి భావన జీవన గమనమే మారిపోయింది.

                               అలా ఏడో తరగతి వరకూ చదువుకుని, ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది.ఒకరోజు 'పదో తరగతి పరీక్షలు రాస్తానమ్మా' అని సైగ చేసింది భావన. 'బంగారంలా చూసుకుంటాం నీకెందుకమ్మా అంత కష్టం' అందామనుకుని ఆగిపోయింది. కూతురిలో ఎలాగైనా చదవాలన్న పట్టుదలను గమనించింది. మరి ఎలా? ఆంగ్ల అక్షరాలు బోర్డు మీద పెద్దగా రాసి ఉంటే వాటిని కంటితో చూపిస్తూ తన భావాలను వ్యక్తం చేయడం గుర్తొచ్చింది. అదే పద్ధతిలో పరీక్ష రాయించాలనుకుంది. కానీ అందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. స్థానిక విద్యాశాఖకు ఉత్తరాలు రాసింది. భావన పరిస్థితీ, తెలివితేటల గురించి ప్రభుత్వానికి తెలియజేసి 'పరీక్ష రాసే అవకాశం కల్పించమని' కోరింది. మూడేళ్లు గడిచాక ప్రభుత్వం స్పందించింది.ఒక స్త్క్రెబ్‌ని ఎంపిక చేసుకుని, అతడికి ఐ టెక్నాలజీ లాంగ్వేజిలో కల్పన ఆర్నెల్లు శిక్షణ ఇచ్చింది. భావన అందరి సమక్షంలో కంటి సైగతో అక్షరాలు చూపిస్తే, స్త్క్రెబ్‌ ఆ వేగాన్ని అందుకుని రాయడంతో ప్రభుత్వం పరీక్షలు రాయడానికి అనుమతినిచ్చింది. కల్పన శ్రమ ఫలించింది. భావన ప్రతిభకు గుర్తింపు లభించింది. మొదట ఎనిమిదో తరగతి పూర్తిచేసి, ఆ అర్హతతో పదో తరగతి పరీక్షల్లో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు పొందింది. చదువుల యాత్ర అక్కడితో ఆగలేదు.

                                కాలేజీలు తెరిచే సమయంలో 'అమ్మా, ఇంటర్‌మీడియెట్‌ చదువుతా, భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్‌ని అయితే లెక్కలూ చూసుకోవద్దూ, సీఈసీ తీసుకుంటా' అంది. ఈ మాటలకు కల్పన షాక్‌ తింది. ప్లస్‌టూ చదవడం... వ్యాపారం చేయడం... తనకెలా సాధ్యం అనుకుంది. అలాగని వద్దనలేదు. ప్లస్‌టూలో చేర్పించి రోజూ తీసుకెళ్లి, తీసుకొచ్చేది. క్లాసులో స్నేహితులు రన్నింగ్‌ నోట్సు రాసుకునేప్పుడు కార్బన్‌ పేపరు పెట్టి రాసి, అడుగు కాపీ భావనకు ఇచ్చేవారు. ఇంటికొచ్చాక కల్పన దానిని నోట్సుగా రాసి, చదివించేది. భావనకు మెమరీ పవర్‌ ఎక్కువ. ఒక్కసారి విని గుర్తుపెట్టుకునేది. అమ్మసాయంతో చదువుకున్న భావన ఇంటర్‌లో 82 శాతం తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం 75 శాతం మార్కులతో బీకామ్‌ పాసయ్యింది. ప్రత్యేక డివైజ్‌ ఉపయోగించి కాలితో కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయడం నేర్చుకుంది.

                            తరవాత 'సొంతంగా వ్యాపారం చేస్తాను' అంటూ భావన తన భవిష్యత్తు ఆలోచన చెప్పింది. భావన కంప్యూటర్‌లో వెతికి సేంద్రియ పత్తితో తయారుచేసిన దుస్తులు అమ్మాలనుకుంది. దానికి సంబంధించిన వివరాలను సేకరించింది. స్థలం ఎంపిక, బ్యాంకు రుణం వంటి పనులూ చేసుకుంది. కన్నబిడ్డ ఎంత ఆత్మవిశ్వాసం కనబరిచినా కంటికిరెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తనకుంది అనుకుని... భావన షాపు పెట్టాలనుకున్న చోటుకి మకాం మార్చేసింది కల్పన. అక్కడే 'సహజిక' పేరుతో బొతిక్‌ని ప్రారంభించింది భావన. ఓ అమ్మాయి సాయంతో ఆర్డర్లు తీసుకోవడం, దుస్తులు అమ్ముతూ మొదటి ఏడాదే ఎనిమిది లక్షల టర్నోవరు సాధించింది.

                             'పాతికేళ్ల నా శ్రమ ఇప్పుడు ఫలించింది. తన కాళ్ల మీద తాను నిలబడటం అనే మాటల వెనుక అసలైన భావనను మా భావన రుజువు చేసింది. నా జీవితానికి ఇది చాలు, ఇంతకుమించిన ఆనందం లేదు' అంటున్న కల్పన ఒకప్పుడు భావన చదువుకున్న స్కూలుకి ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. కన్నబిడ్డ భవిష్యత్తు కోసం అనేక కఠిన పరిస్థితుల్నీ, పరీక్షల్నీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధించిన మాతృమూర్తిగా అభినందనలు అందుకుంటున్నారు.

మూలం : ఈనాడు దినపత్రిక

2 Comments

ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను

7/15/2013

1 Comment

 
Picture
నరకం నుంచి తప్పించుకున్నవారు ఏం చేస్తారు?
వెనక్కి తిరిగైనా చూడకుండా...
‘చాలు దేవుడా’ అని పారిపోతారు.
జయమ్మ మాత్రం అలా చేయలేదు.
నరకం నుంచి బయట పడగానే...
నరకద్వారం దగ్గరే నిలబడిపోయారు!!
లోపలున్న వాళ్లందర్నీ బైటికి రప్పిస్తూ...
కూపంలో పడబోతున్నవాళ్లని ఆపేస్తూ...
పదేళ్లకు పైగా అక్కడే ‘డ్యూటీ’ చేస్తున్నారు!
ఎందుకంత ప్రమాదకరమైన బాధ్యతను
తన భుజాలపై మోస్తున్నారు?
ఈ ప్రశ్నకు ఆవిడ సమాధానం ఒక్కటే:
‘నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు.
తెలిసీ నా అక్కచెల్లెళ్లను, ఆడబిడ్డల్ని ,ఆ బిడ్డల బిడ్డల్ని ఎలా వదిలి వెళ్లగలను?’ అని!
ఇంతకీ జయమ్మ చూసిన నరకం ఏమిటి?

                    జయమ్మ గురించి చాలామందికి తెలుసు. ‘మహిళా సమాఖ్య మండలి జయమ్మ’ చేస్తున్న సేవ గురించి బోలెడు వార్తాకథనాలొచ్చాయి. వ్యభిచార కూపంలో మగ్గుతున్న మహిళల సంక్షేమం గురించి ఆమె చేయని ప్రయత్నం లేదు. కొందరికి విముక్తి కల్పించారు. కొందరికి ఉపాధి కల్పించారు. ఇప్పుడు కొత్తగా.. పడుపు వృత్తిలో ఉన్నవారికి పుట్టిన పిల్లలకు ఆశ్రయం కూడా ఇస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్లి ఆ వృత్తినొదిలి రోడ్డున పడ్డ ముసలివాళ్లకి వృద్ధాశ్రమం కూడా కట్టిస్తానంటున్నారు. తన జీవితమంతా... పడుపువృత్తి మహిళల సంక్షేమానికే అంకితమంటోన్న జయమ్మ అంతరంగంలోకి వెళితే గుండె బద్దలయ్యే విషయాలు బయటపడతాయి. ‘పుస్తె కట్టినవాడే పడుపువృత్తిలోకి దింపితే... రోజుకెన్నిసార్లు సచ్చిబతకొచ్చో తెలుసు నాకు... నరకం నుండి బయటపడడం అందరూ చేసే పని. నేను దాని గుమ్మం దగ్గర నిలబడి అందులోకి దూకేవారిని చేతులడ్డుపెట్టి కాపాడే ప్రయత్నం చేస్తున్నాను’’ అంటున్న జయమ్మ ఆవేదనకు అక్షరరూపం ఇది.

                         ‘‘నల్గొండ జిల్లా నకిరేకల్ మా ఊరు. అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్ల అమ్మమ్మా తాతయ్యల దగ్గరే పెరిగాను. నేను పదోతరగతి చదువుతుండగా మా మేనమామ నాకు పెళ్లిసంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు. ఏవో తిప్పలు పడి ఇద్దరక్కలకు ముడిపెట్టి పంపించారు. నా వరకూ వచ్చేసరికి కట్నం ఇవ్వలేక రెండోపెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా ఇంటి పక్కన ఒక ఇంజినీరు దగ్గర పనిచేసే సాగర్‌తో నాకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మా ఇద్దరి విషయం ఇంట్లో తెలిసి గొడవ చేశారు. దాంతో మేమిద్దరం ఎవరికీ చెప్పకుండా పారిపోయి యాదగిరి గుట్టలో పెళ్లిచేసుకున్నాం. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి ఉప్పల్‌లో స్థిరపడ్డాం. పెళ్లి తర్వాత అతనికీ, నాకు పుట్టింటివాళ్లతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెండేళ్లపాటు బాగానే చూసుకున్నాడు. పాప పుట్టాక....తన అసలు రూపం బయటపడింది.

పాప కోసం...

                        రెండు నెలలపాటు ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఇంట్లోకి సరుకులు కూడా తేలేదు. ‘ఇలాగైతే ఎలా... మనం బతకడమెలా?’ అని నిలదీస్తే... ‘పట్టణంలో గొప్పగా బతకాలంటే నువ్వు వ్యభిచారం చేయాలి’ అన్నాడు. కట్టుకున్నవాడు అలా మాట్లాడితే ఏం చేయాలో అర్థం కాలేదు. నమ్మినవాడి చెయ్యి పట్టుకుని మోసపోయినందుకు బోరున ఏడ్చాను. నావాళ్లకు చెప్పుకుందామంటే వారిని కాదనుకుని వచ్చాను, పోనీ ఉన్నచోటే ఏదైనా పని చేసుకుని బతుకుదామంటే ఒంటరిగా బతికే ధైర్యం లేదు. కొన్నిరోజులపాటు అతనితో పోట్లాడి బతికాను... ఆ తర్వాత బిడ్డను బతకనివ్వనంటూ బెదిరించాడు. దాంతో చేసేదిలేక అతను చెప్పినట్టు విన్నాను. రెండేళ్లపాటు నన్ను ఇంట్లో బంధించి నాతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత సికింద్రాబాద్ దగ్గరున్న వ్యభిచారగృహాలకు తనే స్వయంగా తీసుకెళ్లేవాడు. అక్కడ సాగర్‌లాంటివారు చాలామంది కనిపించారు! ప్రేమ పేరుతో ఊరొదిలిన ఆడవాళ్లు కూడా కనిపించారు. ఉద్యోగం పేరుతో నమ్మివచ్చిన అభాగ్యులు కూడా ఉన్నారు. వాళ్లందరి మధ్యలో ఆరేళ్లు గడిచిపోయాయి. 

నాలాంటి వారి కోసం...

                     నేను వెళ్లిన వ్యభిచార గృహాల దగ్గర కనిపించిన ప్రతి ఒక్క మహిళ వెనకా ఓ విషాదగాథ వినిపించేది. ఆ కూపం నుంచి బయటపడడం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూసే నాలాంటి మహిళలెందరో... ఆ సమయంలో వచ్చింది హెచ్‌ఐవి నివారణ కార్యక్రమం. అప్పుడు నాకు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పరిచయం ఏర్పడింది. వ్యభిచార గృహాలకు వెళ్లి హెచ్‌ఐవి పట్ల అవగాహన పెంచే కార్యకర్తగా పనిచేస్తే నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. నా భర్త అంగీకరించకపోగా, ‘మూడు వేల రూపాయలా...’ అంటూ ఎగతాళి చేశాడు. బిడ్డను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగితే... పోలీసులకు చెబుతానని ఎదురుతిరిగాను. అలా నా భర్తను ఎదిరించి ఆ పనిలో చేరాను. కొన్నాళ్లు అలా పనిచేశాక 1999లో నాలాంటి తొమ్మిది మంది మహిళలతో ‘మహిళా సమాఖ్య మండలి’ ని స్థాపించాను. బలవంతంగా ఈ వృత్తిలో కొనసాగుతున్న 1500 మంది మహిళల్ని ఆ సంస్థ ద్వారా రక్షించాను. ట్రాఫికింగ్ ద్వారా వచ్చిన అమ్మాయిల్ని గుర్తించి వారివారి ఇళ్లకు పంపించాను. తిరిగి ఇంటికి వెళ్లలేమన్నవారికి ఉపాధిమార్గాలు చూపించాను. ప్రస్తుతం మా సంస్థలో మూడువేలమంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 600మంది హెచ్‌ఐవి నివారణ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. 

తండ్రిని వద్దనుకుంది...

                       తల్లిదండ్రులు లేని బిడ్డ పడే కష్టాలు నాకు తెలుసు. ఆ పరిస్థితి నా కూతురికి రాకూడదనే ఉద్దేశ్యంతో నా భర్త ఎన్ని బాధలు పెట్టినా అతడి నుంచి విడిపోలేదు. కొన్నాళ్లు భయపడ్డాను... ఇంకొన్నాళ్లు భరించాను... బతకడం నేర్చుకున్నాక ఎదిరించాను. తండ్రి ప్రవర్తన నచ్చక కొన్ని నా కూతురు ఒకరోజు నాతో ‘నాకు నాన్నొద్దమ్మా...’ అని చెప్పింది. కోపంలో అందనుకున్నాను. కాని చాలా సీరియస్‌గా చెప్పింది. ఏ బిడ్డకోసం నేను నా బాధల్ని దిగమింగుకుని... అతనితో కలిసి ఉంటున్నానో, ఆ బిడ్డే అతన్ని వద్దనుకుంది. అప్పటివరకూ నా పంటికింద దాచుకున్న దుఃఖం, కోపం ఒక్కసారిగా బయటకొచ్చాయి. బిడ్డపట్ల, నా పట్ల అతని ప్రవర్తన బాగోలేదని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. అక్కడితో అతనికి, మాకు సంబంధాలు తెగిపోయాయి. అప్పటినుంచి ఇంకొంచెం ఎక్కువ సమయం మా సంస్థకోసం పనిచేయగలుగుతున్నాను. 


రెండో తరం కూడా...

                 పదేళ్లక్రితం తల్లితో కనిపించిన ఏడేళల పసిపిల్ల ఇప్పుడు తల్లి నడిచిన దారిలోనే నడుస్తోంది. తమ కడుపున పుట్టిన పిల్లల్ని మంచి మార్గంలో పెంచే తల్లులు ఈ వృత్తిలో చాలా అరుదుగా ఉంటారు. చాలావరకూ వారసులుగానే భావిస్తుంటారు. ఏడాది కిందట వీరిపై నా దృష్టి పడింది. తల్లులందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లల్ని నాకప్పగించమని అడిగాను. కొందరు వెంటనే తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టారు. ఇంకొందరిని ఒప్పించి తీసుకొచ్చాను. అలా 35మంది ఆడపిల్లలకు నా ఇంట్లో ఆశ్రయం కల్పించాను. వీరిలో మూడేళ్ల వయసు పిల్లల నుంచి పన్నెండేళ్ల వరకూ ఉన్నారు. అందరినీ స్కూల్లో చేర్పించాను. తల్లులు అప్పుడప్పుడు వచ్చి తమ పిల్లల్ని చూసి వెళుతుంటారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఓ ఏడుగురు పిల్లల తల్లులు రావడం మానేశారు. అంటే వాళ్లు పిల్లల్ని వదిలేసుకున్నారన్నమాట. ఇలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు. నా స్థోమతని దృష్టిలో పెట్టుకుని సంఖ్యను పెంచుకోవడం లేదు. 

వృద్ధుల కోసం...

                  ఈ వృత్తిలో వయసుమళ్లినవారు అనాథలతో సమానం. రకరకాల జబ్బులతో వీధినపడి అడుక్కోవడం లేదంటే ప్రాణాలు వదలడం తప్ప గత్యంతరం లేదు వీరికి. ఇలాంటివారి కోసం ప్రభుత్వం తరపు నుంచి కాని, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎలాంటి సాయం ఉండదు. ఉన్నా... ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు. ఈ వృత్తిలో చాలామంది ముసలివాళ్లు దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నవారే. వారికోసం ప్రత్యేకంగా ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది నాకు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను’’ అని ముగించారు జయమ్మ. 

మూలం : సాక్షి దినపత్రిక 

1 Comment

ఆకాశవీధిలో సాహసం 

7/14/2013

0 Comments

 
Picture
నలభై ఏళ్లకీ, యాభై ఏళ్లకీ స్కూబా డైవింగ్ చేసిన వాళ్లున్నారు. కానీ ఊత కర్రతో నడిచే డెబ్భై తొమ్మిదేళ్ల వయసులో పదమూడు వేల ఐదొందల అడుగుల ఎత్తు నుంచి ఆ సాహసం చేసింది అమెరికాకు చెందిన కరోలిన్. ఈ వయసులో అంతటి సాహసం ఎందుకంటే... చిన్న నాటి కలను తీర్చుకోవాలన్న తపనే కారణం అని చెబుతుంది. ''చిన్నప్పట్నుంచీ నాకు స్కూబా డైవింగ్ అంటే ఆసక్తి. ఓసారి ప్యారాచూట్తో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాను. ఛాతి భాగంలో చిన్న దెబ్బ తగిలింది. వైద్యులు అలాంటి సాహసాలు వద్దని చెప్పారు. నేనూ భయపడి దూరంగా ఉన్నాను. తరవాత పెళ్లయ్యింది. నౌకాదళంలో ఆఫీసర్గా పని చేశాను. ఇంటి బాధ్యతలూ, ఉద్యోగం.. చూస్తుండగానే వృద్ధాప్యం వచ్చేసింది. అయినా మనసులో చిన్నప్పటి కోరిక తీరలేదన్న వెలితి ఉండిపోయింది. ఇదే విషయం మా అబ్బాయిలతో అంటే ఆ సాహసం ఇప్పుడు చెయ్యమన్నారు. దాంతో కొంతకాలం ప్రాక్టీస్ చేసి ఈ ఫీట్ సాధించగలిగాను' అని చెప్పింది. అప్పుడు భయపడ్డారు కదా, మరి ఇప్పుడెలా చేశారని అడిగితే 'ఇప్పుడూ కొన్ని క్షణాలు భయం వేసింది. ఆ కాసేపు గట్టిగా కళ్లు మూసుకున్నా' అని బదులిచ్చింది.


0 Comments

రచనే ప్రాణం

7/14/2013

0 Comments

 
Picture
అమెరికా రచయిత్రిగా గుర్తింపు
1988లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
దేశ, అంతర్జాతీయంగా పాపులారిటీ తెచ్చిన నవలలు
రచయిత్రిగా చెరగని ముద్ర
మహిళా రచయితలకు స్ఫూర్తి
జర్నలిజంలోనూ రాణింపు


                     వలస రచయిత్రిగా వెళ్లినా భారతీ ముఖర్జీ, అమెరికా రచయిత్రిగాగుర్తింపు పొంది, ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని పొందారు . దేశ, అంతర్జాతీయంగా పలు నవలలు, చిన్నకథలు, వ్యాసాలు రాయడంలో దిట్ట అనే ముద్ర వేయించుకున్నారు. చిన్న పిల్లలకు కథలు పలువురి ఎంతగానో అకట్టుకున్నాయి. దేశ విదేశాల్లో ఇప్పటికీ ఈమె పుస్తకాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారత రచయిత్రిగా కంటే అమెరిక రచయిత్రిగానే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నారు భారతీ.

                   ఇండియాలో పుట్టి, అమెరికా రచయిత్రిగా పేరొందిన భారతి ముఖర్జీ ప్రస్తుతం బెర్కెలిలో యూనివర్శిటీి ఆఫ్ కాలిఫొర్నియాలో ఇంగ్లిష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.
                    కలకత్తాలో జన్మించిన భారతి ముఖర్జీ స్వాతంత్య్రనంతరం తల్లిదండ్రులతో యూరప్కు వెళ్లిపోయారు. 1950 తిరిగి కలకత్తాకు రావడం జరిగింది. కలకత్తాలోని లోరిటో పాఠశాలలో విద్యనభ్యసించారు. 1959లో కలకత్తా విశ్వవిద్యాలయంలోని లోరిటో కళాశాలలో బిఎను పూర్తి చేశారు. 1961లో బరోడా విశ్వవిద్యాలయంలో యంఎను పూర్తి చేశారు. అ తదనంతరం పై చదువుల కోసం అమెరికా పయణం పట్టారు. అమెరికాలోని లోవా యూనివర్శిటీలో ఎంఎఫ్ఎను పూర్తి చేశారు. 1963లో అదే విశ్వవిద్యాలయంలో లోవా రైటర్స్ వర్క్షాప్ను చేశారు. అంతేకాకుండా 1969లో డిపార్ట్మెంట్ ఆఫ్ కంపారటివ్ లెక్చర్లో పిహెచ్డి కూడా చేశారు.

                     తరువాత కెనాడాలోని టోరోంటో పట్టణం,మోంట్రియల్లలో కొన్ని సంవత్సరాలు నివాసం అక్కడే భర్త క్లార్క్ బ్లేజ్తో పాటు ఉన్నారు. తిరిగి అమెరికా వచ్చిన తరువాత 1981లో ఆమె రాసిన యాన్ ఇన్విజబుల్ ఉమెన్ పబ్లిష్ కావడం జరిగింది. 1977లో భర్త బ్లేజ్తో కలిసి డేస్ అండ్ నైట్ ఇన్ కలకత్తా రాయడం జరిగింది. అంతేకాకుండా వారిద్దరూ కలిసి 1987లో ద శారో అండ్ ద టెర్రర్, ద హంటింగ్ లిగసి ఆఫ్ ద ఎయిర్ ఇండియా ట్రాజడీ ( ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182) రాశారు.

జీవితం
               భారతీ ముఖర్జీ బర్కిలేలో చేరకముందు ఇతర దేశాల కళాశాలలోనూ బోధించడం జరిగింది. ఎంసీ గిల్ యూనివర్శిటీ, స్కీడ్మోర్ కళాశాల, క్వీన్ కళాశాల, సిటి యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ లలో గెస్ట్ ప్రొఫెసర్గా బోధించడం జరిగింది. భారతీ ముఖర్జీ అమెరికా రచయిత్రిగా అనేక గొప్ప నవలలను రాయడంతో అటు అమెరికాలోనూ, ఇటు ఇండియాలోను పాపులారిటిని సంపాదించారు. 1989లో భారతీ ముఖర్జీని అమండా మీర్ ఇంటర్యూ చేయడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువగా అమెరిక రచయితగా ఉండటమే నాకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. ఆమె జీవితంలో ప్రయాణాలు చేసిన అనేక విషయాలను నవల రూపంలో పొందుపరచడం జరిగింది. చదువుకుంటున్న సమయంలోనే రచయిత్రిగా రాణించాలని పట్టుదలతో ఉండేవారు. వివాహనంతరం భర్త కూడా సపొర్టుగా నిలవడంతో ఇంకా అనేక నవలలు, చిన్న కథలు రాయడం జరిగింది.

                  అంతేకాకుండా భారత్ నుంచి అనేక మంది నవల రచయితలు వచ్చిన వారికంటే భారతి ముఖర్జీ అమెరికా రచయిత్రిగా గుర్తింపు పొందారు. భారత్ నుంచి వలస వచ్చిన రచయిత్రిగా గుర్తింపు ఉన్నా ఆమెకు, రాసిన నవలలో ఆమె హావాభాలను వ్యక్తపరుస్తూ, అమెరికా రచయిత్రిగానే ఎక్కువగా గుర్తింపు పొందడం జరిగింది. అమెరికాలో స్థిర పడిన తరువాత జర్నలిజం రంగంలోనూ రాణించారు. సామాజిక వేత్తగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ, ప్రజల్లో సామాజిక అవగాహనకు తోడ్పడేవారు.

నవలలు
 1971లో ద టైగర్స్ డాటర్స్
1975లో వైఫ్
1989లో జాస్మిన్
1993లో ద హోల్డర్ ఆఫ్ ద వరల్డ్
1997లో లీవ్ ఇట్ టూ మి
2002లో డిజైరబుల్ డాటర్స్
2004లో ద ట్రీ బ్రైడ్
2011లో మిస్ న్యూ ఇండియా
1991లో పొలిటికల్ కల్చర్ అండ్ లీడర్షిప్ ఇన్ ఇండియా
1992లో రిజైనాలిజం ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్

చిన్న కథలు
1985లో డార్క్నెస్
1988లో ద మిడిల్మెన్ అండ్ అదర్స్ స్టోరీస్
ఎ ఫాదర్

అవార్డు
1988లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు (ద మిడిల్మెన్ అండ్ అదర్ స్టోరిస్) నవలకు

మూలం : సూర్య దినపత్రిక

Picture
భారతీ ముఖర్జీ రచనలు
0 Comments

మారథాన్ విజేత నాలుగు నెలల గర్భిణి

7/13/2013

0 Comments

 
Picture
ఆమె వయస్సు నలబై నాలుగు.
ముగ్గురు పిల్లలకు తల్లి.
ఒక పాపకు అమ్మమ్మ.
ఇప్పుడు నాలుగు నెలల గర్భిణి.
నలబై రెండు కిలోమీటర్ల మారథాన్ లో విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది.

నేపాల్ కు చెందిన ఆంగ్ దామి మే నెలలో జరిగిన ఎవరెస్ట్ మారథాన్ లో ఆరు గంటల రెండు నిమిషాల్లో గమ్యం చేరుకొని ప్రశంసలందుకుంది. 2006 లో మొదటిసారి ఆంగ్ దామి ఈ మారథాన్ లో పాల్గొని విజయం సాదించింది. ఆ తరువాత ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో మానసికంగా కుంగిపోయింది. మళ్లీ మారథాన్ లో పాల్గొన్నా ఓడిపోయింది. క్రమంగా బాధ నుంచి తేరుకున్న ఆమె పోటీల్లో పాల్గొనాలనుకుంది. ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పారు. నలబై రెండు కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తితే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమవుతుందోనని భయపడ్డారు. అయిన వెనుదీయని ఆంగ్ దామి వైద్యుల సలహాలు తీసుకుంది. వాళ్ళ సమక్షంలో కొన్ని రోజులు శిక్షణ పొందింది. పరుగు పందెంలో పాల్గొంది. విజేతగా నిలిచి యాబై వేల బహుమతి అందుకుంది. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని తనకు, కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి సమస్య లేదని నిర్థారించుకుంది. 'ఆరేళ్ళ నుంచి వరుసగా ఓడిపోతున్నా. ఈసారి గెలవాలనే తపనతో పోటి చేశా. అందుకు కడుపులో ఉన్న నా బిడ్డ కూడా సహకరించింది. నా తదుపరి లక్ష్యం ఏంటో తెలుసా ఎవరెస్ట్ ఎక్కినా గర్భిణిగా పేరు తెచ్చుకోవడం' అంటోంది ఆంగ్ దామి.



0 Comments

తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'

7/13/2013

0 Comments

 
Picture
                     ఉత్తరాఖండ్‌లోని చావోస్ వరద బాధిత సహాయ శిబిరం. భారీ విధ్వంసం తర్వాత ఏర్పడిన బీభత్స వాతావరణాన్ని తలపిస్తోంది ఆ ప్రాంతం. సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సైనికులు, తిండిపొట్లాలను జారవిడుస్తున్న హెలికాప్టర్లు, వరదబాధితుల ఆర్తనాదాలతో.. 'ఇక్కడి నుంచి బతికి బట్టకడితే చాలురా దేవుడా' అనుకుంటున్నారంతా. ఒకప్పుడు విహారప్రదేశమైన ఈ ప్రాంతం.. వరదలొచ్చాక చెత్తకుప్పలా మారిపోయింది.

                    అలాంటి చోట-తిని పడేసిన ఎంగిలి ప్లేట్లు, తాగి విసిరేసిన టీ గ్లాసులు, ఖాళీ పొట్లాలు, ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకుంటూ అందరికంటా పడింది ఓ తెల్లమ్మాయి. అక్కడున్న వాళ్ల బాధ ఒకటైతే, ఆమె బాధ 'చెత్త' బాధ. కొండప్రాంతాల్లో ఇలా చెత్తంతా పేరుకుపోతే, భవిష్యత్తులో పరిసరాలన్నీ ఏమైపోతాయి..? మైదానాల్లో అయితే ఎవరో ఒకరు తీసేస్తారు. ఇలాంటి క్లిష్టమైనచోటికొచ్చి ఎవరు శుభ్రం చేస్తారు..? అంటున్న ఆ యువతి పేరు జోడీ అండర్‌హిల్. దేశం ఇంగ్లండ్. లండన్ నుంచి ఇండియాకు వచ్చి, కేవలం పర్వతసానువుల్లోని చెత్తను తొలగించే సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏ సేవకైనా ఒక పేరు కావాలి కాబట్టి.. తన బృందాన్ని 'వేస్ట్ వారియర్స్' అని పిలుస్తోందీ యువతి.


                                "నాకు పదిహేడేళ్లప్పుడు ఇంటి నుంచి వచ్చేశాను. రకరకాల దేశాలు తిరిగా. ఫండ్‌రైజింగ్ అసిస్టెంట్‌గా, ఛారిటీల్లో వాలంటీర్‌గా, లీగల్ ఎడిటర్‌గా.. ఇలా ఎన్నెన్నో ఉద్యోగాలు చేసి మానేశాను. ఎందులోనూ సంతృప్తి దొరకలేదు. ఉత్తరభారతంలో పర్వతాలు ఎక్కువ. వాటిలో దర్శనీయస్థలాలు, పర్యాటక ప్రదేశాలకు కొదవే లేదు. ఏటా ఇక్కడికొచ్చే భక్తులు, సందర్శకుల సంఖ్య పెరిగిపోతోంది. వాళ్లు పడేసిన చెత్త కూడా రెట్టింపవుతోంది. స్థానిక అధికారులు దీన్నొక సమస్యగా గుర్తించడం లేదు. అందుకని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నాం..'' అని వివరించారు అండర్‌హిల్. తొలిసారి - ఉత్తరాఖండ్‌లోని ధర్మశాలకు సమీపంలో ఉన్న చెత్తను తొలగించారు వేస్ట్‌వారియర్స్ సభ్యులు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు.

                             కొన్నాళ్లకు-'లండన్ నుంచి వచ్చిన అమ్మాయే మా ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంటే, మేము చూస్తూ ఊరుకోవడం ధర్మం కాదు'' అంటూ వందమంది స్థానికులు వేస్ట్‌వారియర్స్‌తో చేతులు కలిపారు. ఆ తర్వాత గుణమాత ఆలయం పరిసరాలను శుభ్రం చేశారు వాళ్లు. "కొండప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతకున్న ప్రాధాన్యాన్ని వివరించాము. పిల్లల పార్కులకు వెళ్లి చెత్తను తొలగించాం. సేకరించిన చెత్తను వేరుచేసి, రీసైకిల్‌కు పంపిస్తున్నాం..'' అందా లండన్ అమ్మాయి. ఆమె 'చెత్తశుద్ధి'ని గమనించిన స్థానిక పత్రికలన్నీ 'గార్బేజ్ గర్ల్' అంటూ తెగ పొగిడేస్తున్నాయట. "నేను తెల్లమ్మాయిని కాబట్టి నా దగ్గర దండిగా డబ్బు ఉంటుందనుకుంటున్నారు అందరూ. నేనేమీ ధనవంతుల కుటుంబం నుంచి రాలేదు. మా బృందానికి ప్రతి నెలా తొంభైవేలు ఖర్చు అవుతోంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కేవలం పద్దెనిమిది వేలు. ఎలా బతకాలో మీరే చెప్పండి?..'' అన్నారు.

                          దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఎంతో కష్టపడి కొండకోనల్లో పడేసిన చెత్తను తీసేస్తున్న అండర్‌హిల్‌ను ప్రోత్సహించాల్సిందిపోయి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. డెహ్రాడూన్‌లోని ఆరోగ్యకార్యకర్తలకు తమ సంస్థ తరఫున శిక్షణ ఇచ్చేందుకు అనుమతినివ్వాలంటూ.. పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు అండర్‌హిల్. కాని ఆయన నుంచి ఏ సమాధానమూ రాలేదు. ఎన్ని ఫోన్లు చేస్తున్నా స్పందనే లేదు. "చెత్త అనేది రోత కాదు. మీరెప్పుడైనా చిప్స్ తింటే, ఆ ఖాళీ కవర్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయకండి. ఒకవేళ దగ్గర్లో డస్ట్‌బిన్ లేకపోతే, ఖాళీ కవర్‌ను మడిచి పర్సులో పెట్టుకోండి. డస్ట్‌బిన్ కనిపించాకే అందులో పడేయండి. అందరూ ఇలాచేస్తే పరిశుభ్ర భారత్ ఆవిర్భవిస్తుంది..'' అని చెప్పారు.

0 Comments

అమ్మ మాటతోనే అక్షర వెలుగులు

7/13/2013

0 Comments

 
Picture
                       పట్టుదల, ఆశయం ముందు మూఢాచారాలు ఏవైనా అవన్నీ తల ఒగ్గాల్సిందే. సంప్రదాయాలు ఏవైనా కానివ్వండి అవి మానవ ఔన్నత్యానికి దోహదం చేసేందుకు మనం ఏర్పాటు చేసుకున్న ఓ సదుపాయం. కాలచక్రంలో ఆ సదుపాయాలే ఉరితాళ్లుగా మారి స్త్రీ మనుగడకే ముప్పువాటిల్లే దుస్థితి ఏర్పడింది. ఆచారాల మాటున మానవీయ విలువల్ని కాలరాసే విషసంస్కృతి, ఆ నీచసంస్కృతికి బుగ్గిపాలవుతున్న ఆడబిడ్డ జీవనం నేటికి ఓ ప్రశ్నార్థకం.  పుట్టిన బిడ్డ మగబిడ్డ కావాలి కాదుకాదు అయ్యితీరాల్సిందే. లేకపోతే ఆ మరుక్షణంలోనే ఆడశిశువు గొంతులో ఒడ్లగింజల్ని వేయడమో లేదా గొంతునులిమి చంపడం గిరిజనుల అజ్ఞానానికి నిదర్శనం. చంపడానికి మనసొప్పనివారు ఆ బిడ్డను రెండు,మూడు వేలకు అమ్మివేస్తారు. వంశాంకురం కోసం డజనుమంది ఆడపిల్లల్ని కనేందుకైనా వెనుతిరుగరు.  మగపిల్లవాడు పుట్టేవరకు అంతే. తల్లి ఎంత రక్తహీనంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా సరే, మగబిడ్డను ఇచ్చేవరకు కాన్పు మీద కాన్పుల పాలు పడాల్సిందే. ఇలాంటి చీకటి బతుకుల్లో మగ్గిపోతున్న గిరిజనులు అభివృద్ధికి ఆమడదూరంలో, కనీస వసతుల్లేని మారుమూలగ్రామాల్లో నివసిస్తున్న వీరికి చదువు అందని ద్రాక్షపండుగా మిగిలిపోతున్నది. కనీసం రాజ్యాంగం తమకు ఎలాంటి సదుపాయాల్ని కల్పించిందో తెలుసుకోలేని అంధకారంలో నిట్టూర్పు బతుకులే వారి జీవనచిత్రం. అయినా ఆశయం, పట్టుదల ఉన్న ఒకరో,ఇద్దరో లేని వసతులను చూసి, నిరాశతో కృంగిపోరు. ఇరుకైన అవకాశాలలో విశాలమార్గాన్ని వెతుక్కుంటారు. నింగిలోకి చేరుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ ప్రయత్నంలో దేవరకొండ గిరిజన తండాలో మొగ్గతొడిగి వికసించిన వనిత డాక్టర్‌ సూర్య.  ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ తెలుగు డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధుల్ని నిర్వహిస్తూనే తన జాతిలోని ఆడపిల్లలకు చేతనైనంత సాయం చేస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న సూర్యాధనుంజయ్.

 పుట్టి, పెరిగింది నల్గొండలో
                   నేను పుట్టింది నల్గొండ జిల్లాలో దేవరకొండ మండలంలోని ఓ గిరిజన తండాలో. చిన్నప్పటి నుంచి చదువంటే అమితమైన ఆసక్తి ఉండేది. కానీ మా తండాల్లో స్కూళ్లు ఉండేవి కావు. దాదాపు 15కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్లోనే 5వ తరగతి వరకూ చదువుకున్నాను. ఆడపిల్ల అందులో మా తండాలో ఆడపిల్లలు చదువుకు ఆమడదూరంలో ఉండాల్సిందే. సమీపంలో స్కూళ్లు లేకపోవడం, ఒకటిరెండు ఉన్నా 'ఆడపిల్లకెందుకు చదువు' అనే భావంతో ఇంటిపనులు, కూలిపనులకు పంపడం తప్పని జీవనపోరాటం మాది. మాకు భాష ప్రధాన సమస్య. స్కూలుకు వెళ్లాలంటే తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాల్సిందే. తెలుగు అక్షరాలు నేర్చుకోవాలి. ఇదంతా మాకు పెద్దకష్టంగా అనిపించేది. దీంతో చదువుపట్ల ఆసక్తి చూపించేవారు కాదు. పైగా ఆడపిల్లకు పదకొండు, పన్నెండేళ్లు రాగానే పెళ్లి చేస్తారు. నాకు కూడా మా తల్లిదండ్రులు అలాంటి ప్రయత్నమే చేశారు.  నేను ఆసక్తిగా చదవడం గమనించి మా అమ్మ ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు.  నా చదువు కోసం ఆమె మా తండా వారితో ఎన్నో మాటల్ని భరించాల్సి వచ్చింది. ఆడపిల్లను అలా బయటికి పంపితే ఇంకేమన్నా ఉందా అని ఈసడింపులూ భరించింది. వారి మాటల్ని పట్టించుకోకుండా నన్ను చదువుకోమని చెప్పేది. ఇదే సమయంలో మా గ్రామానికి ఒక క్రైస్తవ మిషనరీ జంట వచ్చింది. మాచేత వారు అక్షరాలు దిద్దించేవారు. నేను చాలా ఇష్టంగా భాషను నేర్చుకున్నాను. ప్రాథమిక విద్యను చదివిన నాకు హైస్కూలు మా ఊర్లో లేకపోవడం వల్ల మిర్యాలగూడ ఎస్సీ హాస్టల్‌లో చేరి హైస్కూల్‌ విద్యను పూర్తిచేశాను. ఇంటర్‌లో చేర్పించేసరికి ఇక మా ఊరిపెద్దలు నాకు పెళ్లి చేసేయ్యొచ్చుకదా! అని పోరుపెట్టారు. వారి పోరును భరించలేక మాఅమ్మ నాపెళ్లి చేసింది. అయితే పెళ్లికి ముందే కాబోయే అల్లుడితో నన్ను చదివించాలనే ఒక షరతును విధించింది. మా తండాల్లో ఇలాంటి షరతులు ఎవరూ పెట్టేవారు కాదు. ఏమీ చదువుకోని అమ్మ మాత్రం నా జీవితంలో అక్షర వెలుగులు నింపే దిశగా ఆలోచించింది. మా అమ్మకు మాట ఇచ్చిన మావారు ఇంటర్‌ చదివించారు.

ఉన్నత విద్య
                     ఇంటర్‌ పూర్తి చేశాక, ఓపెన్‌వర్సిటీ ద్వారా డిగ్రీ చదివాను.  ఆంధ్రమహిళాసభలో బిఇడి చదివాను. వెంటనే డిఎస్‌సి నోటిఫికేషన్‌ వస్తే, నాన్‌లోకల్‌ ఎస్టీ పోస్టులో టీచర్‌గా సెలక్ట్‌ అయ్యాను. ఉన్నత చదువు చదవాలన్న కోరికతో సెలవుపై ఎంఎ, ఎంఫిల్‌ చదివాను. సదాశివపేటలో డిగ్రీకాలేజీలో లెక్చరర్‌గా ఎంపిక కావడంతో అక్కడ చేరాను. అంతకు ముందే ఉస్మానియావర్సిటీలో జరిగిన ఇంటర్వ్యూకు వెళ్లాను. దీంతో ఉస్మానియావర్సిటీలో 1999లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాను. 'నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం, జీవనచిత్రణ' అనే అంశంపై పిహెచ్‌డి చేశాను. 2007లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ప్రమోషన్‌ వచ్చింది.

సేవా కార్యక్రమాలు
                         మా తండాకి వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడవాల్సిందే. బస్సు సౌకర్యం లేదు. తండాకి వెళ్లేందుకు దిగే చోట కనీసం ఒక బస్టాప్‌ లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలబడే దుర్భర పరిస్థితి నుంచి తప్పించాలని, మా అమ్మపేరుతో ఒక బస్టాప్‌ను నిర్మించారు. 2004లో అమ్మపేరుతోనే ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాను. మా తండాలో పెద్ద చదువు చదివింది నేనే. నా స్థితిని చూసిన మా తండావారిలో మార్పు వచ్చింది. వారి పిల్లల్ని ఆడపిల్లలు అని కూడా చూడకుండా దూరప్రాంతాలకు, హాస్టల్‌లో ఉంచి చదివించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో డిగ్రీ, పిజీ చదువుతున్న అమ్మాయిల శాతం పెరుగుతున్నది. వీరిని ప్రోత్సహించేందుకు నేను వారికి పుస్తకాలు, సైకిళ్లు కొనిస్తూ, ఫీజు చెల్లించుకోలేని వారికి ఆర్థికంగా నాకు చేతనైనంతవరకు సాయం చేస్తున్నాను. మా యూనివర్సిటీలో 'ట్రైబ్స్‌ డిపార్ట్‌మెంట్‌'ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. దీనిద్వారా గిరిజనులకు విద్య, ఉపాధి సౌకర్యాల మెరుగుకు కృషి చేయాలని ఉంది. ఎందుకంటే మా వర్సిటీలో మొదటి గిరిజన ప్రొఫెసర్‌ని కావడం నాకెంతో ఆనందాన్ని ఇస్తున్న విషయం.

భర్త సహకారం
                    నా ఈస్థితికి కారణం నా భర్త ధనుంజయ్ దే. మా తండా సంప్రదాయాన్ని గౌరవించి, చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నా, ఆగిపోయిన చదువును తిరిగి కంటిన్యూ చేసేందుకు నా భర్త ఎంతో ప్రోత్సహించారు. ధనుంజయ్ ప్రస్తుతం జియలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నాకు ముగ్గురు పిల్లలు. ఒకవైపు పిల్లలు, ఇంటిబాధ్యతలు మరొకవైపు చదువుకోవడం అంటే ఎవరికైనా కష్టమే. కానీ మా వారు నన్ను ప్రోత్సహించడం వల్ల ఆటంకాలు, అభ్యంతరాలు ఏవైనా వాటన్నింటిని జయించగల్గాను. 

ఆడబిడ్డలకు ఏమైనా చేయాలి
                         మొదటిసారి, రెండవసారి ఆడబిడ్డ పుడితే పర్వాలేదు. ఆ తర్వాత మళ్లీమళ్లీ ఆడపిల్లలే పుడితే వారికి జీవించే హక్కును కాలరాయడం తండాల్లో సాధారణంగా జరుగుతున్న ఘోరాలు. కొడుకు కోసం ఎంతమంది ఆడపిల్లల్ని కనేందుకైనా వెనుతిరుగరు. అలాగని పుట్టినవారందరిని పోషించే స్థోమత ఉండదు. దీంతో పురిట్లోనే చంపే ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిని రూపుమాపాలంటే చదువు ఒక్కటే అందుకు దోహదం చేస్తుంది. చదువు  మానవీయదృక్పధంతో జీవించే విధానాన్ని నేర్పిస్తుందని నా అభిప్రాయం. ఇది వాస్తవం కూడా.

పుస్తకాలు
                  నేను చేసిన పిహెచ్‌డి థీసెస్సే బంజారా నానీలయ్యాయి. ముద్రితం కాని నాలుగు పుస్తకాలు ఉన్నాయి. నా ఆశ, ఆశయం అంతా ఒక్కటే గిరిజనుల బతుకుల్లో వెలుగును నింపాలి. వారిలో పాతుకునిపోయిన మూఢాచారాల నుంచి బయటికి తీసుకొచ్చి, నాణ్యమైన జీవితాన్ని అనుభవించేలా చేయాలని ఉంది.    

మూలం : వార్త దినపత్రిక 

0 Comments

వ్యాపారమే జీవితం

7/12/2013

0 Comments

 
Picture
2011లో లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు
కోకాకోల నుంచి గోల్డెన్‌ స్ఫూన్‌ అవార్డు
ప్రస్తుతం ెకల్లోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్గలో డైరెక్టర్‌
హెచ్‌ఎస్‌బిలో చిఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌


               వ్యాపార రంగంలో తనకు సాటి లేరు అన్నంతగా శ్రమపడుతూ ముందుకు సాగతున్న సంగీత కల్లోగ్‌లో డైరెక్టర్‌గా ఉంటూ పలువురు మహిళలక ఆదర్శ మహిళగా నిలుస్తున్నారు. 2011 లో లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా కోకాకోల కంపెని నుంచి కూడా అవార్డున అందుకున్నా సంగీత నేటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


జీవితం:

                    భారతదేశంలో మేనేజింగ్‌ ఆఫ్‌ కెల్లోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సంగీత పండూర్కర్‌. మార్చి 3, 2009లో కోకా-కోల ప్రైవేట్‌ కంపెనీకి ఉపాధ్యాక్షురాలిగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాపార రంగంలో ఎంతో వ్యూహాత్మకంగా బాధ్యతలు వ్యవహరించేవారు. అంతేకాకుండా వ్యాపార రంగంలో అనేక లోటు పాట్లు ఉన్న వాటిని అధిగమిస్తూ కంపెనీని ముందుకు నడిపించడం మామూలు విషయం కాదు. కోకా కోల కంపెనీలో ఉపాధ్యాక్షురాలిగా దాదాపు 18 నెలలు సేవలందించడం జరిగింది. వ్యాపార రంగంలో ఎక్కువగా అభివృద్ధి చేందేందుకు అనేక ఆలోచనలతో ముందుకు సాగేవారు. జార్టీయా టీ, కాఫీలతో వ్యాపారాన్ని వృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించారు. 

                       అంతేకాకుండా వ్యాపార రంగాన్ని బలోపెతం చేయాటానికి జ్యూస్‌లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి నింబు పాని అను పేరుతో పిలిచేవారు తరువాత దానిని పేరు మార్చి నింబు ఫ్రెష్‌ అని పిలవడం జరుగుతోంది. భారతదేశంలోని హాంకాంగ్‌, షాంఘై బ్యాంకింగ్‌ కొ ఆపరేషన్‌ లిమిటెడ్‌లో ఛీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా సేవలందిచడం జరిగింది. ఆమె హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్‌లోనూ, హిందూస్థాన్‌ యూనిలివర్‌లోనూ, కింబర్లీ క్లర్క్‌లల్లోనూ విధులు నిర్వహించారు. మొదటగా ఆమె జీవితంలో ఇక్కడే సాగడం గమనార్హం. అంతేకాకుండా 20 సంవత్సరాలుగా మార్కెటింగ్‌ సెల్స్‌లలో పని చేశారు. హిందూస్థాన్‌ సిబ-జ్యిజి (ప్రస్తుతం నోవార్టిస్‌) లో మొదటి సారిగా సేవలందించడం జరిగింది.


బ్రేక్‌ఫాస్ట్‌క్లబ్‌:


                      మూడు విభిన్న రంగాలలో అనుభవం ఉన్న 44 సంవత్సరాల సంగీత ఇప్పటికి పలు అంశాలపైనా కానీ, వ్యాపార రంగంలో కానీ గురి తప్పకుండా ముందుకు సాగడం ఆమె విజయం వెనుక ఉన్న రహస్యం. ఫార్మస్యూటికల్‌, ఫైనాన్షియల్‌, ఫాస్ట్‌ మూవీంగ్‌ కన్జుమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎమ్‌సీజీ) వంటి రంగాలలో ఆరితేరారు. ముంబాయిలో దీర్ఘకాలంగా వ్యాపార రంగంలో కొనసాగడానికి విలువగల మార్పులను తెలుసుకోవచ్చు. కొల్లెగోలో చేరిన తరువాత బాధ్యతగల ఉద్యోగిగా అనేక బాధ్యతలు చేపట్టి కంపెనిలో ఎన్నడు లేనంత సరికొత్త రికార్డును నెలకోల్పారు. దాదాపు 400 కోట్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో మార్కెటింగ్‌ విలువలలో 65 శాతం వృద్ధి శాతంను పెంచారు. 

                      భవిష్యత్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా కొన్ని విలువలు అవసరం డ్రైవింగ్‌లో వృద్ధి చెందడం, పైప్లెన్‌ నిర్మాణం, ఆస్తులు, ప్రతిభను కనబరచాటానికి ఇలాంటి అనేక నైపుణ్యం కలిగిన నైతిక విలువలు అవసరం. వ్యాపారం చేసేటప్పుడు కంపెని నుంచి టార్గెట్‌ చేయవలసి వచ్చిన సమయంలోనూ ఎలాంటి మార్పులు లేకుండా చేసేవారు. చేయకపోయిన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు.


                        2011లో ముంబాయిలో ఫుడ్‌ఫెస్టివల్‌లో లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ది ఈవినీంగ్‌ ఆఫ్‌ ఫుడ్‌ టైటాన్స్‌ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా కోకాకోల నుంచి గోల్డెన్‌ స్ఫూన్‌ అవార్డుతో పాటు, 2010లో వ్యాపార రంగంలో అవార్డులను అందుకున్నారు. 14 రకాల కార్యక్రమాకు సంబంధించిన జరిగిన ఫెస్టివల్‌లో అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది.


కుటుంబం:
    
                         మధ్యతరగతి కుటుంబంలో సబర్బన్‌ గృహంలో జన్మించిన సంగీతకు ఐదుగురు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి కుటుంబాన్ని కట్టదిట్టమైన పద్దతులతో నడిపించేవారు. పిల్లల ఆలోచన విధానాన్ని పసిగట్టి అప్పట్లోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోనేవారు. ఔషధ శాస్త్రంలో అనేక విలువలను ఆమెకు నేర్పించేవారు. తండ్రి మెడిసిన్‌ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు. చిన్నప్పటి నుంచి చదువుతున్న సమయంలో ఎప్పుడు కూడా ఎలాంటి జీవితం కావాలో ఆమెకు తోచేదికాదు. గ్రాడ్యూయేషన్‌ అనంతరం కూడా జీవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక, అనుకోకుండా మార్కెటింగ్‌లోకి రావడం జరిగింది. 

                  ఏ రంగంలో వెనకబడకుండా ముందుకుసాగాలనే నిర్ణయంతో వ్యాపార రంగంలో అనేక మేలకువలు నేర్చుకున్నారు. దేశంలోని వ్యాపార రంగంలోని మహిళ శక్తివంతుల జాబితాలో నిలవడం గమనార్హం. ఎంబీఎ పూర్తి చేసిన తరువాత వారి దగ్గరి స్నేహితులతో కలిసి అంతేకాకుండా ఆమె పని చేస్తున్న పరిశ్రమలోనే వారి స్నేహితులతో మాట్లాడంలో నైతిక విలువలు నేర్చుకుని దీనిలో రాణించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎంపిక విషయoలో రెండు పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌లు చేయడం జరిగింది. ఇదే రంగంలో కొంతమంది స్నేహితులు కూడా రాణించడం గమనార్హం. వ్యాపార రంగంలోనే ఆమెకు సరైన జీవితం ఇందులోనే ఉందని భావించారు.



మూలం : సూర్య దినపత్రిక 

0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.