telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!

9/20/2013

0 Comments

 
Picture
                         మనిషిలో సాధించాలనే పట్టుదల, చొరవ, శ్రమించే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమే. మనం ఏ ప్రయత్నం చేయకుండా, మనకేదీ దక్కలేదని బాధపడడం అవివేకమని అంటోంది బెంగళూరుకు చెందిన ఓ మహిళా ఆటో డ్రైవర్.. కాదు కాదు.. మహిళా న్యాయవాది. ఆటోడ్రైవర్‌కు బదులు మహిళా న్యాయవాది అంటే ఒకింత ఆశ్చర్యపోతున్నారా? అవును మరి..! వెంకటలక్ష్మి ఒకప్పుడు ఆటోడ్రైవరే. మొక్కవోని దీక్షతో ‘లా’ కోర్సు చదివి, తాను కో రుకున్న విధంగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించింది.

                     తన కల సాకారం కావడం గురించి వెంకటలక్ష్మి మాట్లాడుతూ, న్యాయవాది కావడం అనేది తన చిరకాల వాంఛ అని చెబుతోంది. నేటి రోజుల్లో సాధారణ ప్రజానీకానికి న్యాయం దొరకడం అంత సులువైన విషయం కాదని, అందుకే తాను న్యాయవాది కావాలని కోరుకున్నట్లు చెబుతోంది.

                             వెంకటలక్ష్మి నిజానికి చాలా ధైర్యవంతురాలు. హైస్కూలులో చదివే రోజుల్లోనే కర్నాటక ప్రభుత్వం నుంచి సాహస బాలిక అవార్డును దక్కించుకుంది. వేగంగా వస్తున్న బస్సు కింద సహచర విద్యార్థిని పడబోతుంటే ప్రాణాలకు తెగించి ఆమెని రక్షించడంతో ఈ అవార్డు వరించింది. అటువంటి ధైర్యవంతురాలైన వెంకటలక్ష్మిని కొనే్నళ్ల క్రితం అయిదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బలాత్కరించబోయారు. ఎంతో తెగువ, సాహసం కలిగిన ఆమె వారిని ఎదిరించి తప్పించుకుంది. ఆ కేసు తొమ్మిది సంవత్సరాలు కోర్టులో నడిచింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసును తేల్చకుండా అలా పొడిగిస్తూనే ఉండడంతో ఒకరోజు వెంకటలక్ష్మి ధైర్యంగా తన కేసు తానే వాదించుకుంటానని జడ్జిని కోరింది. అందుకు న్యాయమూర్తి సరేననడంతో వెంకటలక్ష్మి ఏకధాటిగా రెండున్నర గంటల పాటు వాదించి తనపై ఐదుగురు దుండగులు ఎలా దాడిచేశారో, తాను వారి నుంచి ఎలా తప్పించుకున్నదో జడ్జికి వివరించి చెప్పింది. స్వయంగా వాదించి ఆ కేసులో ఆమె గెలిచింది. ఆ స్ఫూర్తితో ఎప్పుడో చేయాలనుకున్న ఎల్‌ఎల్‌బి కోర్సును వెంటనే చేయాలని నిశ్చయించుకుంది. బసవేశ్వర్‌నగర్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ లా కాలేజీలో చేరింది. తెల్లవారక ముందే నిద్ర లేచి వంటపని పూర్తిచేసేది. కుమార్తెను బడికి సిద్ధం చేసేది. మధ్యాహ్నం పూట తినేందుకు ఇద్దరికీ క్యారేజీలు కటి,్ట పాపని స్కూలు వద్ద దించేసి కాలేజీకి వెళ్లిపోయేది. క్లాసులు పూర్తికాగానే, ఖాళీగా ఉండకుండా ఆటో నడిపి ఎంతోకొంత ఆదాయం సంపాదించేది. స్కూలుకి వెళ్లి పాపని తీసుకుని ఇంటికి చేరుకునేది. ఇలా ఐదేళ్లు కష్టపడ్డాక ఆమె లా కోర్సు పూర్తయింది.

                       కాలంతో పోటీ పడుతూ లా కోర్సు పూర్తిచేసిన వెంకటలక్ష్మి ఏ రోజూ చదువును, వృత్తిని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఏ రోజు పాఠాలు ఆ రోజు నిద్రపోవడానికి ముందే పూర్తిచేసేది. పద్ధతిగా చదివి, పరీక్షలు చక్కగా రాసి లా పరీక్షలో ఉత్తీర్ణులయింది. ఆటోలోనే లా కోర్సు పుస్తకాలు పెట్టుకుని ఏ మాత్రం అవకాశం ఉన్నా చదువుకునేది. కబుర్లతో కాలక్షేపం చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకునేది.

                   లా కోర్సు పూర్తి చేశాక ఆమె కర్ణాటక బార్ అసోసియేషన్‌లో తన పేరు నమోదు చేసుకుంది. అయినప్పటికీ ఆమె ఆటో నడపడం మానలేదు. కుటుంబ అవసరాలకు నెలకి ఎలా లేదన్నా పది వేల రూపాయలు ఉండాలని, అందుకే ఆటో నడుపుతున్నానని ఆమె చెబుతోంది. కుటుంబాన్ని పోషించుకుంటూ, మరోవైపు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తానని చెబుతోంది. సమాజంలో అణగారిన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడం, ఐఎఎస్‌కు ఎంపిక కావడం తన లక్ష్యాలని చెబుతున్న వెంకటలక్ష్మి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తోంది.


0 Comments

తెలుగందం... మెరిసింది

9/17/2013

0 Comments

 
Picture
                     నీనా పుట్టకముందే ఆమె తల్లిదండ్రులు న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. తండ్రి ధనకోటేశ్వరరావు గైనకాలజీ నిపుణుడు. తల్లి షీలా రంజనిది సాఫ్ట్‌వేర్‌ రంగం. నీనా పసిపిల్లగా మూడేళ్ల పాటు విజయవాడలో ఉన్న అమ్మమ్మ దగ్గరే పెరిగింది. తరవాత తల్లిదండ్రుల వద్దకెళ్లింది. తండ్రి తరఫున బంధువులంతా అక్కడే ఉంటారు. దాంతో తెలుగు సంప్రదాయాల మధ్యే పెరిగింది. ఇంట్లోనూ తెలుగులోనే మాట్లాడుకోవడంతో తనకూ భాష మీద మంచి పట్టు ఉంది. వేసవి సెలవులొస్తే నీనా అక్కతో కలిసి ఇండియాకొచ్చేస్తుంది.

                      విజయవాడలోని అమ్మమ్మ కోటేశ్వరమ్మ, పెద్దమ్మ డాక్టర్‌ శశిబాల ఇంట్లో ఉత్సాహంగా గడిపేస్తుంది. ఆ మూడు నెలలూ భరత నాట్యం, కూచిపూడి, వీణ, పియానో... ఇలా తనకిష్టమైన ఆసక్తులతో కాలం గడుపుతుంది. సినిమాలు చూడటమూ తన అభిరుచుల జాబితాలో ఉంది. ప్రేమ కథలంటే మరీ ఇష్టంగా చూస్తుంది. ప్రభాస్‌ తన అభిమాన నటుడు. 'వర్షం సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు' అంటుంది. చిన్నతనంలో సెలవులొస్తే చాలు నీనా... నాన్నతో కలిసి ఆయన పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లిపోయేది. అక్కడ ఆయన ఎంతోమందికి వైద్యం చేసి, సాంత్వననందించడం చూసి తను కూడా డాక్టర్‌ అవ్వాలనుకునేది. అంతేకాదు... చదువుకుంటూనే చిన్నారుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల్లో చేరి, వారి కార్యకమాల్లో చురుగ్గా పాల్గొనేది.

                      నీనా ప్రస్తుతం మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో బ్రెయిన్‌ బిహేవియర్‌ అంశంపై ప్రాజెక్టు వర్క్‌ చేస్తోంది. తరవాత వైద్య విద్యను అభ్యసించడమే ఆమె లక్ష్యం. క్యాంపస్‌లో ఉన్నా ఆమె ఆలోచనలు చదువుకే పరిమితం కాలేదు. ప్రతినెలా డాన్స్‌, మారథాన్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విరాళాలను సేకరించేది. ఆ వచ్చిన మొత్తాన్ని చిన్నారుల వైద్యానికి వినియోగించేది. నీనా చేస్తోన్న మంచి పనికి విశ్వవిద్యాలయంలోని వేల మంది సహ విద్యార్థుల అండదండలున్నాయి. చదువుకీ, సేవకీ సమప్రాధాన్యం ఇచ్చే నీనా ఇప్పటికే యూనివర్సిటీ మెరిట్‌, నేషనల్‌ ఆనర్స్‌ సొసైటీ అవార్డులను అందుకుంది. ఇంతకీ తను ఫ్యాషన్‌ రంగంలో ఎలా అడుగుపెట్టింది అంటారా? అది అనుకోకుండానే జరిగింది.

                     తను టీనేజీలో బాగా లావుగా ఉండేది. తెలుగింటి వంటకాలంటే బాగా ఇష్టం. ఒకానొక సమయంలో ఆహారం తీసుకొనే విషయంలో నియంత్రణ కోల్పోయింది. బాగా బరువు పెరిగింది. కానీ నాజూగ్గా మారడానికి తనని తాను మానసికంగా సిద్ధం చేసుకుంది. ప్లస్‌ టూకి వచ్చాక బాగా కసరత్తు చేసి, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకుంది. అదే సమయంలో స్నేహితులు కొందరు 'మిస్‌ టీన్‌' పోటీలకు దరఖాస్తు చేశారు. తనూ వాటిల్లో పాల్గొంది. అది అప్పటికే సరదానే! కానీ ఆ పోటీల్లో తనదే రెండోస్థానం. వందల మందిని అధిగమించి అభినందనలు అందుకోవడం... ఆమెలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండమన్నాయి. హృద్రోగ నిపుణురాలు అవ్వాలనుకున్న నీనా మొదటి ప్రాధాన్యం... చదువుకే. దాంతో ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించింది. డిగ్రీ పూర్తయింది. ఆర్నెల్ల విరామం. కాస్త సమయం దొరికింది. అప్పుడే స్థానిక అందాల పోటీల ప్రకటన చూసింది. ఉత్సాహంగా దరఖాస్తు చేసింది. గెలుపు తనదే. మిస్‌ న్యూయార్క్‌ పోటీలకు ఎంపికైంది. ఇక్కడ విజేతగా నిలవడానికి తను చాలా కష్టపడిందనే చెప్పాలి.

                            తనకిష్టమైన భారతీయ వంటకాలను తినకుండా, నోరు కట్టేసుకుంది. జంక్‌ఫుడ్‌, ఐస్‌క్రీమ్‌లూ, చాక్లెట్లను దూరం పెట్టింది. తెల్లవారు జామున నాలుగు గంటలకే నిద్రలేచి యోగా, ధ్యానం, ఏరోబిక్స్‌ చేసింది. బయటి ఆహారం పూర్తిగా బంద్‌. అమ్మ చేతి వంట మాత్రమే అదరహో! మానసిక దృఢత్వాన్నీ పెంచుకుంది. జూన్‌లో జరిగిన పోటీల్లో 'మిస్‌ న్యూయార్క్‌'గా ఎంపికై, మిస్‌ అమెరికా పోటీలకు అర్హత సాధించింది. ఇప్పటి వరకూ న్యూయార్క్‌ అందాల పోటీల్లో గెలిచిన తెలుగమ్మాయిలు లేరు. నీనాయే ఆ ఘనత సాధించింది. వేల డాలర్ల నగదు బహుమతి అందుకుంది. అలాగని ఆ మొత్తాన్ని విలాసాలకు ఖర్చు పెట్టలేదు. ఖరీదైన కార్లూ కొనుక్కోలేదు. క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల వైద్యం కోసం అందజేసింది. ఆ తరవాత వెంటనే మిస్‌ అమెరికా పోటీల్లోనూ పాల్గొంది. తనతో కలిసి యాభై మూడు మంది అందాల భామలు పోటీలో తలపడ్డారు. వివిధ వడపోత దశలు. అన్నిటినీ దాటింది. యాభై వేల డాలర్ల ఉపకార వేతనాన్నీ అందించింది. ఈ పోటీల్లో ప్రతిభను నిరూపించుకునే విభాగంలో.. సంప్రదాయ దుస్తుల్లో కూచిపూడి, భరత నాట్యం ప్రదర్శించింది నీనా. కొన్ని బాలీవుడ్‌ హిట్‌ పాటలకూ స్టెప్పులేసింది.

                         'తెలుగమ్మాయిగా పుట్టడం వల్లే చదువూ, సేవ, అందం, జీవితం గురించి నాకంటూ ఓ స్పష్టమైన అవగాహన ఏర్పడిందని అనుకుంటున్నా అనే నీనాకు దైవభక్తి ఎక్కువ. శిరిడీ సాయిబాబాను పూజిస్తుంది. సమయం దొరికితే పూజలు చేస్తుంది. ఆధునిక పద్ధతుల మధ్య పెరిగినా పండగలూ, ప్రత్యేక సందర్భాల్లో అమెరికాలో పట్టు పరికిణీలో కనిపించడానికే ప్రాధాన్యం ఇస్తా అంటుంది.అందమంటే ఇది...కృత్రిమ మార్పులు తెచ్చుకునే బదులు పుట్టుకతో మనకొచ్చిందే అందం అన్నది తన భావన. దీనినే న్యాయనిర్ణేత లకు సమాధానంగా చెప్పి అందాల కిరీటం గెలుచుకుంది నీనా.


0 Comments

అటవీ సంపదకు అండ

9/16/2013

0 Comments

 
Picture
                               'మనుషులు బతకాలంటే చెట్లు ఉండాలి... చెట్లు ఉంటేనే మనిషి బాగుండేది' ఇదే జమునకు తెలిసింది. తనకి సైన్సు తెలియదు. జార్ఖండ్‌లో ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆమె గ్లోబల్‌ వార్మింగ్‌ అనే పదాన్ని కూడా ఎప్పుడూ వినలేదు. అయినా చెట్లంటే ప్రేమా, అభిమానం. చిన్నప్పట్నుంచి వాటిని చూస్తోంది. పొయ్యిలో పెట్టుకోవడానికి కర్రల నుంచి తినే పండ్ల వరకూ అన్నీ చెట్లే ఇస్తున్నాయి. మనుషుల కడుపు నింపుతున్నవీ, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతున్నవీ అవే. వాటి నుంచి అంత సాయం పొందుతూ వాటిని రక్షించుకోకపోతే ఎలా... అనుకుంటూ ఉండేది ఎప్పుడూ!

                పదహారో ఏడు వచ్చిందో లేదో అమ్మానాన్నలు పెళ్లి చేసేశారు. అత్తవారి వూళ్లో అడుగుపెట్టింది జమున. తన గ్రామాన్ని మించిన పచ్చదనం అక్కడ. అడవి కూడా పక్కనే. ఆనందం పట్టలేకపోయింది. రోజూ అడవిలోకి వెళ్లడం ఎండిన కర్రలు వంటకి ఏరి తెచ్చుకోవడం... ఇదే పని.ఒకరోజు ఎప్పటిలాగే కర్రలు ఏరుకోవడానికి వెళ్లింది. కొందరు అక్రమంగా గొడ్డళ్లతో చెట్లను నరికేస్తున్నారు. చాలా బాధపడుతూ వెనక్కి వచ్చింది. ఆ ఒక్కరోజుతో చెట్లను కొట్టడం అవలేదు. కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, వాళ్లని అడిగే ధైర్యం చేయలేదు. ఇదే విషయం గ్రామంలోని ఆడవాళ్లతో మాట్లాడింది. చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం మనకెంతో ఉందని వివరించింది.

                    గ్రామంలోని సుమారు పాతిక మంది మహిళలు జమునకు తోడుగా వచ్చారు. చెట్లు కొడుతున్న వాళ్లని వెంటనే అడ్డుకోవాలని వాళ్లంతా వూళ్లో ఉన్న మగవాళ్లని అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి జమున నాయకత్వంలో మహిళలే అడవిని కాపాడుకునేందుకు నడుం బిగించారు. తమ బృందానికి 'వన సురక్షా సమితి' అని పేరు పెట్టుకున్నారు. చెట్లు కొట్టే వారిని అడ్డుకుని, గ్రామం వదిలి వెళ్లేలా చేశారు. అక్కడితో ఆగకుండా... గ్రామంలోని గడపగడపకీ తిరిగి చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రచారం చేశారు. 'ఒక్కసారి చెట్లు లేని ప్రపంచాన్ని వూహించుకోండి. ఎంత భయంకరంగా ఉంటుందో. అసలు మనం బతకగలమా...' అంటూ అర్థమయ్యేట్టు చెప్పారు. చెట్లనే కాదు అడవిలో ఉన్న జంతువులను కాపాడుకోవడమూ తమ బాధ్యతగా భావించారు. వాటిని వేటాడి చంపొద్దని గ్రామంలో ప్రచారం చేశారు.

                    జమున ధైర్యానికి చైతన్యం పొందిన కొందరు మగవాళ్లు కూడా ఆమె బృందంలో చేరారు. ఇప్పుడు ఆ బృందంలో 70 మంది ఉన్నారు. చెట్లు కొట్టే ముఠాలను అడ్డుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం. ఉత్త చేతులతో వెళితే వాళ్లు చాలాసార్లు వీరిపై దాడి చేశారు. అందుకే వీళ్లు కూడా ఆయుధాలు సమకూర్చుకున్నారు. కర్ర లాఠీలూ, విషం పూసిన బాణాలూ, కర్రలూ సిద్ధం చేసుకున్నారు. మగవాళ్లు రాత్రిపూట కాపలా కాస్తే, ఆడవాళ్లు ఉదయం కాపలా ఉంటారు. చాలాసార్లు చెట్లుకొట్టి అమ్ముకునే దుండగుల చేతుల్లో వీళ్లు దెబ్బలు తిన్నారు. అయినా సరే, అడవి సంరక్షణని వదిలిపెట్టలేదు. జమున ప్రారంభించిన వన సురక్షా సమితి గురించి అటవీశాఖ అధికారులకి తెలిసింది. వారు వీరి కృషిని దగ్గర నుంచి చూశారు. వెంటనే వీరుండే ముతురుఖాంని 'ఆదర్శ గ్రామంగా' ఎంపిక చేశారు.

                  దాంతో ఎలాంటి వసతులు లేని ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడక్కడ సీసీ రోడ్లు పడ్డాయి. అంతవరకూ ఒక్క విద్యుత్తు స్తంభంలేని గ్రామంలో, ప్రతి ఇంటికీ కరెంట్‌ కనెక్షన్‌ వచ్చేసింది. మంచినీళ్ల కరవుతో బాధపడే మహిళల కష్టాలు తీరాయి. కొళాయిలు ఏర్పాటయ్యాయి. చెట్ల సంరక్షణతో ఒక్కటవడం అనేది గ్రామాభివృద్ధికి బాటలు పరిచింది. జమున తన సొంత స్థలంలో స్కూలుని కట్టించి గిరిజనుల పిల్లలకి చదువు చెప్పించడం మొదలుపెట్టింది. తన జీవితాన్ని పూర్తిగా గిరిజన పిల్లల చదువుకోసం, గ్రామం అభివృద్ధి కోసం అంకితం చేసింది జమున.


0 Comments

వందల మందిని కాపాడింది...

9/15/2013

0 Comments

 
Picture
                      పాతికేళ్ల రంగూ శౌర్య డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుకుతూ ఇంటి దగ్గరే ఉంది. బయటకెెళ్లిన ప్రతిసారీ రోడ్డు పక్కన ఎవరో ఒకరు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల గురించి మాట్లాడుకుంటూ కనిపించేవారు. తనూ అలాంటి సంఘటనలెన్నో చూసింది. ఆ సమయంలోనే జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని మార్చేసింది. ఓసారి శౌర్య పక్కింటి వాళ్లు తమ పదమూడేళ్ల కూతుర్ని పని కోసం ఢిల్లీకి పంపించారు.తరవాత ఆ అమ్మాయి సమాచారం లేదు. పోలీసులకు చెప్పినా ఫలితం దక్కలేదు. శౌర్య ఆ అమ్మాయిని కనిపెట్టి తీసుకొచ్చేందుకు ఢిల్లీ వెళతానంది. తనదీ పేద కుటుంబమే. అయినా అప్పు చేసి బయల్దేరింది. ఫోన్‌ నంబర్‌ల ఆధారంగా, ఒక్కో అడుగూ వేస్తూ ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కొంది. పనిలో పెట్టుకున్న వాళ్లను దోషులుగా నిలబెట్టింది. తొమ్మిదేళ్ల క్రితం సంఘటన ఇది.

                   అప్పుడు ఆ అమ్మాయి కళ్లలో చూసిన ఆనందమే... శౌర్యను అలాంటి వాళ్ల సాయానికి పూర్తి స్థాయిలో పనిచేసేలా చేసింది. 'డిగ్రీ చదువుకుంది. మంచి ఉద్యోగం తెచ్చుకుని మమ్మల్ని బాగా చూసుకుంటుంది' అని ఇంట్లో వాళ్లు ఆమె పైన ఆశలు పెట్టుకున్నారు. అక్రమ రవాణాకు గురయ్యే అమ్మాయిల్ని ఆదుకోవాలన్న ఆమె ఆలోచన విని ఆశ్చర్యపోయారు. వద్దన్నారు. కానీ వింటేగా! బ్యాంకు నుంచి అప్పు తీసుకుని పాల కేంద్రం మొదలుపెట్టింది. తాను రక్షించిన అమ్మాయిలకు, అందులో ఉపాధినిచ్చింది. కానీ తనుంటోన్న డార్జిలింగ్‌లో అమ్మాయిలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించ డం చాలా సాధారణం. దాంతో సాయం చేయమంటూ తన వద్దకి చాలామంది వచ్చేవారు. పూర్తి స్థాయిలో వాటిపైనే దృష్టి పెట్టడంతో వ్యాపారం కుంటుపడింది. అప్పులు పెరిగి, తనపై అరెస్టు వారెంటు కూడా జారీ అయింది. అయినా శౌర్య తగ్గలేదు. ఆ ధైర్యానికి అన్నీ కలిసొచ్చాయి. ఆర్థిక సాయం అందిస్తామంటూ ఓ సంస్థ ముందుకు రావడంతో... అమ్మాయిలను రక్షించే పనిలో పూర్తిగా నిమగ్నమైంది.

                   ఎక్కడెక్కడో ఉన్న అమ్మాయిలను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్లేది. అవమానాలు పడేది. చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులకైతే లెక్కేలేదు. ధైర్యంగా వాటన్నింటినీ దాటుకుంటూ ఇప్పటివరకూ ఎనిమిది వందల మందికి పైగా అమ్మాయిలను అక్రమ రవాణా బారి నుంచి తప్పించింది. వాళ్లకు చదువూ, ఉపాధి మార్గం చూపించింది. ఆమె సాహసాలకు గుర్తింపుగా 'గాడ్‌ ఫ్రే ఫిలిప్స్‌' సాహస అవార్డుతో పాటూ, ఫిక్కీ జాతీయ స్థాయి పురస్కారమూ లభించింది.


0 Comments

జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!

9/14/2013

0 Comments

 
Picture
                    చిత్రలేఖనం ఒక అపారమైన ప్రతిభ. పేరుకోసం చిత్రించేవారు కొందరైతే, సమాజంలోని సమస్యల్ని తమకున్న అపూర్వమైన కళ ద్వారా ప్రశ్నిస్తూ, ప్రోత్సహిస్తూ, సమాజాభివృద్ధికి పాటుపడేవారు మరికొందరు. ఇలాంటి కళాకారులే నిజమైన కళాకారులు. చిత్రలేఖనం మనసులో రగిలే కోట్లాది భావాల ప్రతిబింబం. అంతరంగ నిశీధిలో దాగిన తలంపులు, ఎంతకీ వదలిపోని వేదన, చేదు సంఘటనల ప్రతిరూపాలే అందమైన చిత్రాలుగా మలచబడతాయి. ఒక తెల్లటి పేపర్‌పై రంగులతో బొమ్మల్ని గీయడం శిక్షణ ద్వారా కాస్త సులభమే అయినా, చెప్పుకోలేని ఆక్రందన, ఒక సంతోషం, ఒక కష్టం, ఆలోచనా, ఆత్మీయ భావాన్ని పంచుకునేందుకు పెయింటింగ్‌ కళ దోహదపడుతుంది.

                    కోట్లాదిమంది జనాల మధ్య మనం ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ప్రత్యక్ష, పరోక్ష సంకేతాల ప్రయత్నంలో చిగురించే చిత్రాలే మరియ లాస్‌నిగ్ని పెయింటింగ్స్‌గా  బాహ్యప్రపంచంలో విహరిస్తున్నాయి.  మనచుట్టూ ఎన్నో సంఘటనలు తటస్థిస్తుంటాయి. అయినా వాటిని పట్టించుకునే ఓర్పు, సహనం మనకుండదు. ఆ కష్టం, బాధ మనవరకు వస్తే తప్ప ఆ సమస్య అగాధంలోకి తొంగిచూడలేని ఒక నిస్సహాయత స్థితిలో మనం జీవిస్తున్నాం. అందుకే ఈ జీవన పయనంలో అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు, మౌనంగా, కళ్లు మూసుకుని వాటిని ధాన్యిస్తే ఎంత బాగుంటుందో! 'సమాజం నాకు చేసిన మేలు ఏంటి' అని ప్రశ్నించుకోవడంలో మన హీనస్థితిని బహిర్గతం చేసుకుంటామే తప్ప 'ఈ సమాజానికి నేను చేసిన మంచి, మేలు ఏంటి?' అనే ప్రశ్న, సందేహం ఎవరిలో మెదులుతుందో వారిని సమాజం కూడా ఉన్నతశిఖరాల్లోకి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మంచి ప్రశ్న మరో ఉజ్వలభవితకు బాటలు వేస్తుంది. అలాంటి వారు చైతన్యకెరటంలా దేశాన్ని, ప్రపంచాన్నే ప్రభావితం చేస్తారు. ఇలా ప్రభావితం చేసిన మహిళల్లో మరియ లాస్‌నిగ్ని ఒకరు.

                      19వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కళాకారుల్లో ఒకరిగా నిలబడ్డారామె. మరియ పెయింటింగ్‌లో అందవేసిన చేయి. టైమ్‌పాస్‌ కోసమో లేక పేరు ప్రఖ్యాతల కోసం ఆమె ఈ వృత్తిని చేపట్టలేదు. తన దేశంలో అనాదిగా స్త్రీ పడుతున్న వేదనకు ప్రతిస్పందనే ఆమె కుంచె పట్టుకునేందుకు కారణమైంది.

                    సెప్టెంబరు 8, 1919లో ఆస్ట్రియాలో జన్మించారు. ప్రస్తుతం వియన్నాలో జీవిస్తున్న మరియ పెయింటింగ్‌లో ఎక్కువగా స్త్రీ దేహానికి సంబంధించినవిగా ఉంటాయి. కారణం మహిళ అనగానే లైంగిక వాంఛల్ని తీర్చే ఒక వస్తువుగా భావించే పురుషసమాజంపై ఆమె రగిలిపోయేవారు. వారి వేధింపులకు గురవుతున్న మహిళకు తనవంతు సాయంగా ఏదో ఒకటి చేయాలనే తపన ఆమెను నిలువనిచ్చేది కాదు.  ఆ ఆశ మరియను పెయింటింగ్‌వైపు తిప్పింది. స్త్రీకి తన దేహంపై ఎలాంటి హక్కు, స్వేచ్ఛ ఉందో తెలియచెప్పే ప్రయత్నం మరియ తన చిత్రాల ద్వారా చేసి చూపించారు. మహిళలకు కనీస అవగాహన ఉండాలని అంటారు. అందుకే ఆమె పెయింటింగ్స్‌ అన్నీ 'బాడీ అవేర్‌నెస్‌ అనే అర్థాన్ని ఇచ్చేలా ఉంటాయి.

చిత్రాల్లో  గొప్పతనం
                    మరియ చిత్రాలను చూడగానే మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు కంటికి కనిపిస్తాయి. స్త్రీ మానసికంగా ఎంత బలవంతురాలైనా శారీరకంగా ఆమె బలహీనురాలే. దీన్ని ఆసరాగా తీసుకున్న మగవారు ఆమెను అపురూపంగా చూసుకోవాల్సింది పోయి, తమ పశువాంఛల్ని తీర్చుకునేందుకు వీలైన వస్తువుగా భావిస్తూ, ఆమెపై చేస్తున్న దాడులపై మరియ తీవ్ర ఆవేదనకు గురయ్యేవారు. వియన్నా దేశమైనా, భారతదేశమైనా అమెరికా అయినా అభివృద్ధిచెందినా, చెందకపోయినా స్త్రీ విషయంలో వచ్చేసరికి అన్నిదేశాల్లో పురుషుల్లో మెదిలే భావం మాత్రం ఒకటే. స్త్రీని తక్కువగా చూస్తారు అనేది ఆమె ఉద్దేశం. వారి ఆలోచనావిధానాన్ని విమర్శిస్తూ చిత్రాలను వేయడంలో ప్రావీణ్యతను సంపాదించారు.


చిత్రాలపై డాక్యుమెంటరీ
                    మరియ తన చిత్రాలను రెండు డాక్యుమెంటరీలుగా రూపొందించి, ప్రేక్షకులకు అందించారు. పారిస్‌, లండన్‌, జర్మనీ వంటి దేశాల్లో ఆర్ట్‌ గ్యాలరీ ద్వారా ప్రదర్శనలకు నోచుకున్నాయి. వియన్నా, వెనిస్‌, ఆస్ట్రియావంటి పలు ప్రాంతాల్లో వందల ప్రదర్శన ద్వారా మరియ చిత్రాలు లక్షలాది మంది హృదయాన్ని దోచుకున్నాయి. పెన్సిల్స్‌తో ఆర్ట్‌ వేయడంలో ఆమె దిట్ట.


శిల్పకారిణి కూడా
                     మరియ పెయింటింగ్‌లోనే కాక శిల్పకారిణి కూడా. తనకున్న చిత్రలేఖనం అనుభవం ద్వారా శిల్పకళారంగంలో ప్రవేశించి, అద్భుత శిల్పాలను ఎన్నింటినో తయారుచేశారు. ఈ శిల్పాలు కూడా పలు ప్రదర్శనల ద్వారా ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు వయసు మీదపడుతున్నా తనకున్న ఆసక్తిని బట్టి, వయసును ఏమాత్రం లెక్కచేయకుండా ఇంకా చిత్రాలను గీస్తూనే ఉన్నారు. అదే తనకు అమితమైన ఆనందాన్ని ఇస్తుందని, మనసు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడుతుందని అంటారు మరియ.


పేరు తెచ్చిన చిత్రాలు
                 మరియ 1979లో వేసిన 'స్లీపింగ్‌ విత్‌ ఎ టైగర్‌, 1961లో వేసిన 'ది బ్లూ ఫ్లవర్‌ ఆఫ్‌ రొమాంటిజమ్‌', 'విమెన్‌ అండ్‌ హర్‌ ఎమోషనల్స్‌' అనే ఈ చిత్రాలకు మంచి పేరుతోపాటు విశ్వఖ్యాతిని అందించాయి. స్త్రీకి ఒక మనసు ఉంది. అది స్పందిస్తుంది, ఆమెకూ కొన్ని వాంఛలు అనేవి ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, భాగస్వామి సహకరించాలి అనేది మరియ చిత్రాల్లో కనిపించే ప్రధాన భావం. స్త్రీ అనేక సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటుందని, దీన్ని ఎవరూ గమనించరని, దీంతో ఆమె తీవ్రనిరాశ, నిస్పృహలకు గురై, అనారోగ్యం పాలవుతుంటుందని, ఇది నన్ను ఎంతో బాధించే విషయమని, నా చిత్రాలు వీటికే ప్రాధాన్యత ఇచ్చేలా ఉంటాయని చెబుతారు మరియ.


అవార్డులు
                   మరియ ఈ సంవత్సరం జూన్‌ నెలలో గోల్డెన్‌ లయన్‌ ఫర్‌ లైఫ్‌టైమ్‌ అవార్డును పొందారు. ఆర్ట్‌ అండ్‌ గ్యాలరీ అవార్డులను ఎన్నో పొందారు. ఏది ఏమైనా మరియ చిత్రాలు అనాదిగా స్త్రీ ఆవేదన, ఆలోచనల రూపకల్పనలే అని చెప్పక తప్పదు.


మూలం : వార్త దినపత్రిక

0 Comments

విరామం తర్వాత విజేతలయ్యేలా!

9/13/2013

0 Comments

 
Picture
                       మా తరగతిలో అరవై అయిదు మంది విద్యార్థులుంటే, అందులో ముప్ఫై ఐదు మంది అమ్మాయిలం. మేం అంతా బాగా చదివే వాళ్లం. ఉద్యోగం చేసి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రణాళికలు వేసుకునే వాళ్లం. కానీ వాళ్లలో ఈ రోజున కేవలం ఐదుగురు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. వివిధ కారణాలతో మిగతా వాళ్లు ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. కొంత కాలం క్రితం వరకూ నా పరిస్థితీ అంతే.

                      మాది హర్యానా. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి రష్యన్‌ భాషలో పీజీ చేశా. కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశా. మా కుటుంబం మొత్తంలో నేనొక్కదాన్నే ఉద్యోగస్తురాలిని. అయితే పెళ్లయ్యాక, అమ్మాయి పుట్టాక ఉద్యోగం చేయడం కష్టం అనిపించింది. పాప బాధ్యతలే ముఖ్యం అనుకుని ఉద్యోగం మానేశా. కానీ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాక ఖాళీగా ఉండటానికి మనసొప్పలేదు. దాంతో కొందరు స్నేహితులతో కలిసి ఓ మ్యాగజైన్‌ని నిర్వహించా. అదీ సంతృప్తినివ్వలేదు. ఏం చేద్దామో తోచలేదు.

                             నా లాంటి పరిస్థితి మరికొందరు మహిళలకూ ఎదురవుతుంది కదా అని అప్పుడు అనిపించింది. అందుకే బాగా ఆలోచించి ఫ్లెక్సీమామ్స్‌ని ప్రారంభించా. పిల్లలు పుట్టాక ఉద్యోగం నుంచి విరామం తీసుకున్న మహిళలు కెరీర్‌లో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేలా వారిని ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. సౌకర్యవంతమైన పనివేళలున్న ఉద్యోగాన్ని కోరుకుంటూ, కుటుంబం, కెరీర్‌ని సమన్వయం చేసుకోవాలనుకునే మహిళలకు మేం ఉపాధి కల్పిస్తాం. అలాంటి అవకాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో వివరిస్తాం. దాంతోపాటూ దరఖాస్తును ఆకట్టుకునేలా రూపొందించుకోవడం మొదలుకొని ఇంటర్వ్యూలకు హాజరవడం, పని చేసే చోట రాణించడం.. ఇలా కెరీర్‌కి సంబంధించి ప్రతిదీ శిక్షణ ఇస్తాం. మంచి చదువూ, అనుభవం ఉండి కొంతకాలం విరామం తరవాత ఉద్యోగంలో చేరాలనుకునే వారికి కొంత శిక్షణతో ఉద్యోగాలిచ్చే సంస్థల గురించీ మేం ముందుగా తెలుసుకుంటాం.

                     ఆయా సంస్థల లక్ష్యాలూ, వాటికి తగ్గట్టు ఎటువంటి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారో మాట్లాడతాం. మాకొచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి... ఆయా సంస్థల వాళ్లకి పంపిస్తాం. ఈ రకంగా మేం చేసిన ప్రయత్నాలతో సుమారు నాలుగొందల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మేం దరఖాస్తుల్ని పంపించే స్థాయికి చేరుకున్నాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు వేల మందికి ఉపాధి కల్పించాం. ప్రస్తుతం ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, పుణేలలో మా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ మేం చూపించిన వాటిల్లో దాదాపు ఎనభైశాతం సౌకర్యవంతమైన పనివేళలు ఉన్నవే. ఇంటినుంచి పనిచేసే అవకాశం పొందిన వాళ్లూ ఉన్నారు. సాధ్యమైనంత వరకూ అలాంటి ఉద్యోగాలనే వెతుకుతాం. ఇంటినుంచి పనిచేయాలనుకున్నా... పార్ట్‌టైంగా ఉండాలనుకున్నా... తాత్కాలికంగా ఓ ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నా... మా డాట్‌కామ్‌లోకి ప్రవేశించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన పని లేదు. ప్రస్తుతం మా దగ్గర పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. మహిళలకు ఇచ్చే శిక్షణ, నిర్వహించే వర్క్‌షాప్‌ల కోసం మాత్రం నామమాత్రంగా కొంత ఫీజు తీసుకుంటాం. వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే మా భవిష్యత్‌ లక్ష్యం.

web site :http://www.fleximoms.in

0 Comments

చీకటి జీవితాలకు కొత్త వెలుగు...

9/12/2013

0 Comments

 
                       ఒకప్పుడు... సుచిత్ర భర్త వేధింపులు భరించలేక, పుట్టింటి ఆదరణకు నోచుకోక పిల్లలతో సహా ఇంట్లోంచి బయటికొచ్చింది. మోసగాళ్ల మాటల వలలో పడి వ్యభిచార కూపంలో చిక్కుకుంది. విధిలేని పరిస్థితుల్లో అదే ఉపాధిగా పిల్లల కడుపు నింపేది. కానీ వాళ్లకి చదువు చెప్పిద్దామంటే బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో క్షణికావేశంలో ఇల్లొదిలి వచ్చినందుకు కుమిలిపోయింది. మరిప్పుడు... ఆమె ఓ కార్పొరేట్‌ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ఒక్క సుచిత్రే కాదు... ఆమెలాంటి మరో ముప్ఫై మంది ఆ వృత్తి నుంచి బయటపడి, తమ కాళ్లమీద తాము నిలబడి పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఈ మార్పునకు కారణం గీతాంజలి.

                    ఇరవై ఆరేళ్ల గీతాంజలి... ఢిల్లీలో మాస్‌ మీడియా కమ్యూనికేషన్‌లో పీజీ చదివింది. తల్లిదండ్రులు విద్యావంతులు. కూతురు ఉన్నతోద్యోగినిగా స్థిరపడితే చూడాలనుకున్నారు. కానీ జరిగింది మరొకటి. గీతాంజలి చదువుకునేప్పుడు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంఘాలతో కలిసి పని చేసింది. అప్పుడే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఢిల్లీలో మరో కోణం గురించి తెలుసుకుంది. రెడ్‌లైట్‌ ఏరియాలో మహిళలూ, వారి పిల్లల దుస్థితిని చూసి బాధపడింది. వారి జీవితాల్లో మార్పు కోసం కృషి చేయాలనుకుంది. చదువయ్యాక కార్పొరేట్‌ సంస్థలో చేరినా ఆలోచనలన్నీ ఆ లక్ష్యంపైనే. ఏడాది తిరిగేసరికి ఐదంకెల జీతమొచ్చే ఉద్యోగం మానేసింది. రెడ్‌లైట్‌ ప్రాంతంలోని పిల్లల కోసం స్కూలు ప్రారంభించాలనుకుంది. 'ఆ పిల్లల చదువు కోసమైతే ఇల్లు అద్దెకివ్వడం కుదరదు' అన్నారంతా. ఆ పిల్లల తల్లులూ, గీతాంజలిని మొదట్లో నమ్మలేదు. కొన్ని నెలల పాటు విసుగూ, విరామం లేకుండా అక్కడికెళ్లి, మహిళల్ని కలిసి వారి బాధలు వింది. ఆ వృత్తిలోంచి బయటికొస్తే, వేరే ఉపాధి మార్గం చూపిస్తానని భరోసా ఇచ్చింది.

                  కొన్నాళ్లకి అద్దెకి ఇల్లు దొరికింది. స్నేహితుల సాయంతో దాన్ని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లా తీర్చిదిద్దింది. మెల్లగా పిల్లలు చదువుకోవడానికి రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ముప్ఫై మంది చిన్నారులు ఆమె వద్ద చదువుకుంటున్నారు. మరో ముప్ఫై మంది మహిళలు వృత్తి విద్యా నైపుణ్యాలు నేర్చుకుని స్వయం ఉపాధితో జీవిస్తున్నారు. గీతాంజలి ప్రయత్నాలకు స్థానిక పోలీసులూ, స్వచ్ఛంద సంస్థల సభ్యులూ సాయం అందిస్తున్నారు. 'ఆ కూపంలో మగ్గుతున్న నాలుగు వేల మందిని బయటకు తీసుకొచ్చి కొత్త జీవితం ఇవ్వడమే నా లక్ష్యం. ఈ క్రమంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా, అడ్డంకులు ఎదురయినా తట్టుకునేందుకు సిద్ధమే' అంటోంది గీతాంజలి.

0 Comments

పక్షి ప్రేమికురాలు

9/12/2013

0 Comments

 
Picture
గిరిజనుల అభివృద్ధికి కృషి
లండన్‌ ప్రభుత్వం గ్రీన్‌ ఆస్కార్‌ ప్రదానం
బడులూ, ఆరోగ్య ేకంద్రాల ఏర్పాటు
నేచర్‌ కన్జర్వేషన్‌ పేరుతో ఓ సంస్థ


ప్రకృతిలో ఎన్నో అందాలు. అన్నింటిన చూడడం మనకు సాధ్యం కాదు. కొందరైతే కాంక్రీట్‌ జంగిల్‌ేక పరిమితం అవుతారు. కానీ కొంత మంది పర్యావరణాన్ని చూస్తే పులకించిపోతారు. ప్రకృతిని ఆరాధిస్తారు. పక్షులను ప్రేమిస్తారు. వాటి శబ్దాలతో సంగీతాన్ని వింటారు. వాటి పరిరక్షణకు నడుంబిగిస్తారు. అలాంటి వారిలో ఒకరు అపారజిత దత్తా. పర్యావరణం కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ వివరాలెమిటో చూద్దాం...

                             ప్రకృతిని ప్రేమించి... జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి... ‘పర్యావరణాన్ని పట్టించుకుంటే పదికాలాల పాటు మనకే మంచిది’ అంటూ ప్రచారం చేసిన అపరాజిత రెండున్నర లక్షల పౌండ్ల విలువైన ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ ఆస్కార్‌ పురస్కారాన్ని సాధించింది. అపరాజిత తండ్రి ఉద్యోగ రీత్యా జాంబియాలో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచీ ఆఫ్రికా చుట్టుపక్కల అడవుల్లోని పక్షులూ, జంతువులూ, పచ్చని చెట్లను చూస్తూ పెరిగిన అపరాజితకు జీవశాస్త్రం ఇష్టమైన పాఠ్యాంశంగా మారింది. దాన్లో పీజీ చదివి, పెద్ద ఉద్యోగం చేయాలనుకుంది. కొన్నేళ్లకి ఆమె కుటుంబం స్వస్థలం కోల్‌కతాకి వచ్చేశాక అక్కడే అపరాజిత వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. జీవావరణం అంశంలో పీజీ పూర్తి చేసింది.

                    మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ కీకారణ్యాల్లోని పక్షులూ, మొక్కల మీద ఎన్నో అధ్యయనాలు చేసిన ఆమె... అరుణాచల్‌ప్రదేశ్‌ అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే మూడు ముక్కుల పక్షి హార్న్‌బిల్‌ జీవనశైలిని ఆసక్తిగా గమనించింది. అవి దట్టమైన అడవుల్లో అన్ని రకాల పండ్లు తింటాయి. గింజల్ని వివిధ ప్రాంతాల్లో వెదజల్లుతాయి. దాంతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది. ఆ పక్షుల ప్రత్యేకత, అవి చేస్తున్న మేలు ప్రధానాంశంగా పీహెచ్‌డీ చేసిన అపరాజిత ‘నేచర్‌ కన్జర్వేషన్‌’ పేరుతో ఓ సంస్థని స్థాపించింది. అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు పక్షులనూ, జంతువులనూ వేటాడకుండా అటవీ సంపదకు నష్టం కలిగించకుండా అవగాహన కల్పించింది. హార్న్‌బిల్‌ల సంఖ్యను పెంచడానికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి బాధ్యతను గిరిజనులకు అప్పగించింది. అవి పిల్లల్ని పెట్టడం గూళ్లలో పిల్లల్ని పోషించడం తదితర జీవన పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవి వేటగాళ్ల బారిన పడి అంతరించిపోకుండా కాపాడుతున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పక్షిజాతి పూర్తిగా అంతరించిపోయిందని అయినా వేటగాళ్ల ఉచ్చు కొనసాగుతోంది.

                         సంచరించే పక్షి జాతుల్లో హార్న్‌బిల్‌ పెద్దది ఈ అద్భుతమైన పక్షిని బయట ఎలా కాపాడుకోవాలో ఆమె ప్రయత్నిస్తుంటారు. దత్తా అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60 హర్న్‌బిల్‌ పక్షి గూళ్లను కనిపెట్టుకుని సంరక్షించింది. వలంటీర్ల సాయంతో ఉద్యానవన తోటలు పెంచి, చేతి వృత్తులను ప్రోత్సహించి గిరిజనులకు ఉపాధి మార్గం చూపించింది. బడులూ, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. పదేళ్లు తిరిగే సరికి అపరాజిత కృషి ఫలించింది. పక్షుల సంరక్షణ కేంద్రాల సంఖ్య అరవైకి చేరింది. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. జీవ వైవిధ్యంపై ఎన్నో పుస్తకాలు రాసిన అపరాజిత, పిల్లల కోసం ప్రత్యేకంగా హార్న్‌బిల్‌ పక్షుల గురించి పుస్తకం రాసింది. పదేళ్లుగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన లండన్‌ ప్రభుత్వం ‘గ్రీన్‌ ఆస్కార్‌’ ఇచ్చి సత్కరించింది.

                             హార్నిబిల్‌ పక్షిజాతి సంరక్షకురాలు అపరాజిత దత్తా గ్రీన్‌ ఆస్కార్‌ అవార్డు సాధించారు. ఈ అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ అవార్డును వైట్లీ అవార్డుగా పిలుస్తారు. బ్రిటన్‌ మహరాణి ఎలిజెబెత్‌ కుమార్తె రాణి అన్నె ఈ అవార్డును రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ ఉత్సవ సభలో ప్రదానం చేశారు. మనదేశంలోని అరుణాచల ప్రదేశ్‌ అడవుల్లో ఎక్కువగా మనుగడ సాగించే హార్నిబిల్‌ పక్షిజాతి అంతరించిపోతున్న పక్షుల్లో అతి ప్రధానమైనది. బహుమతిగా ఇచ్చిన రూ.30 లక్షల నగదును భారత దేశంలో ఉండే హార్న్‌బిల్‌ పక్షుల సంరక్షణకు వినియోగిస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అసోం, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌ ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి హార్న్‌బిల్‌ ఉనికి ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకుంటామని దానికోసం తన బహుమతి నగదు వినియోగిస్తానని ఆమె చెప్పడం దాతృత్వానికి, పక్షులపై ఆమెకు గల ప్రేమకు నిదర్శనం అని చెప్పవచ్చు.


0 Comments

ఒంటి కాలితో గెలిచింది!

9/11/2013

0 Comments

 
Picture
                    అది 2011 డిసెంబరు. 'ఎంతసేపూ ఆఫీసూ, పనీ అంటావ్‌... ఇంటికొచ్చి ఆర్నెల్లు అవుతోంది తెలుసా..' అంటూ అమ్మ నుంచి ఫోన్‌. నిజమే, అన్ని రోజులు ఇంటి మొహం చూడకుండా ఉండటం అదే మొదటిసారి. అందుకే ఈసారి డిసెంబరు 25న నా పుట్టిన రోజూ, అలానే కొత్త సంవత్సర వేడుకలూ ఇంట్లోనే జరుపుకోవాలనుకున్నా. ముందే టికెట్లు బుక్‌ చేసుకున్నా. కాలం గిర్రున తిరిగొచ్చింది. ఇంటికి వెళ్లే రోజు రానే వచ్చింది. ఇంట్లో వాళ్లందరికీ బట్టలు కొన్నా. జీతంలో కొద్దికొద్దిగా దాచుకున్న డబ్బుతో బంగారు గొలుసు కొనుక్కున్నా. దాన్ని అమ్మకు చూపించి వేసుకుందాం అని బ్యాగులో పెట్టుకున్నా. డిసెంబరు 23న రైలెక్కా.

                మాది హర్యానా. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం. హర్యానాలోని మా వూరు చేరడానికి ఇరవై నాలుగ్గంటలు ప్రయాణం చేయాలి. ఇల్లు చేరతానన్న సంతోషం ఓ పక్క. మనసులో తెలియని ఆందోళన మరో పక్క.. సాయంత్రం ఆరున్నర అవుతుండగా... మా వూరికి ముందు స్టేషన్‌లో రైలు ఆగింది. మరో పది నిమిషాల్లో దిగాల్సిన దాన్నే కదా అని డోర్‌ వద్దకి సామానుతో చేరుకున్నా. చలికాలం కావడంతో అప్పటికే ప్రయాణికులు కిటికీలు వేసేసుకున్నారు. అక్కడ దిగాల్సిన వాళ్లు దిగారు. ఇంకొందరు ఎక్కారు. రైలు కదిలింది...

                     అంతలో ఇద్దరు యువకులు నా దగ్గరికొచ్చి నిలబడ్డారు... ట్రెయిన్‌ వేగం పుంజుకుంది. అంతలో ఒకడు నా చేతిలో బ్యాగు లాక్కోబోయాడు. అడ్డుకున్నా. ఇద్దరూ కలిసి నన్ను తోసేసి, బ్యాగుతో పారిపోయారు. ఏం జరిగిందో తెలిసేలోపే పట్టాల మీద పడిపోయా. ఒళ్లంతా గాయాలు. వెన్నుపూసకు బలమైన దెబ్బ. ఎడమ కాలిని ఎవరో మెలి తిప్పుతున్నట్టు విపరీతమైన నొప్పి. పంటి బిగువున బాధను భరిస్తూ రక్షించండి అని అరుస్తూనే ఉన్నా. అరగంట తరవాతనుకుంటా... దగ్గర్లో పని చేస్తున్న కూలీలు చూసి పరుగెత్తుకొచ్చారు. 'సాయం పట్టండి... ఆస్పత్రికి తీసుకెళదాం', 'బ్యాగు వెతికి, ఇంటి అడ్రెస్‌ చూడండి...' అంటూ వాళ్లు అనుకుంటుండగానే నేను స్పృహ కోల్పోయాను.

                  మాది హర్యానాలోని ఫరీదాబాద్‌. నాన్న దోబీ. తన సంపాదనతోనే మా ఇల్లు గడిచేది. ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని. పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. ఇంటర్‌కి వచ్చే సరికి మా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. రెండేళ్లు గడిచేసరికి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరుగుపొరుగు 'చదివింది చాలు. మీ నాన్నని ఇబ్బంది పెట్టకుండా పెళ్లి చేసుకో' అనేవారు. లెక్చరర్లు మాత్రం 'మీ అమ్మాయి బాగా చదువుతుంది. చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది' అంటూ నాన్నకి చెప్పారు. 'నా కూతురికి ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు. కానీ తన కాళ్ల మీద తాను నిలబడేంత వరకూ చదివిస్తా' అంటూ నాన్న అప్పులు చేసి, నన్ను డిగ్రీ చదివించారు. పీజీ ఎంట్రన్సులో మంచి ర్యాంకొచ్చింది. మొదటి సంవత్సరం విశ్వవిద్యాలయ టాపర్‌గా నిలిచా. దాంతో ఫీజు లేకుండా చదువుకునే అవకాశం లభించింది. పూర్తిగా చదువుపైనే శ్రద్ధపెట్టా. చదువు పూర్తయ్యే సమయానికి, క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. శిక్షణ పూర్తి చేసుకుని, హైదరాబాద్‌ ఇన్ఫోసిస్‌లో చేరా.

                        డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ ప్రతి నెలా కొంత ఇంటికి పంపేదాన్ని. తమ్ముడూ, చెల్లిని కూడా మంచి కాలేజీలో చేర్పించాను. అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కష్టాలు తీరుతున్నాయనుకుంటున్న సమయంలో రైలు ప్రమాదం కుంగదీసింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలు. చాలాచోట్ల కుట్లు పడ్డాయి. రెండు శస్త్ర చికిత్సలు చేశారు. తప్పని పరిస్థితుల్లో ఎడమ కాలు మోకాలి వరకూ తీసేశారు. అస్సలు కదల్లేని పరిస్థితి. వెన్నుపూసకు ఏ ప్రమాదం లేదు కానీ కొన్ని నెలలు మంచానికి పరిమితమయ్యాను. నా పరిస్థితి చూసి అమ్మానాన్నలు తల్లడిల్లిపోయారు. బాధను దిగమింగుకుని నన్ను ఓదార్చారు. మూడు నెలలు దాటాయి. శారీరకంగా కొంత కోలుకున్నా. కానీ మానసికంగా కుంగిపోయా. ఇంట్లో పరిస్థితులూ క్షీణించాయి. నాన్న ఇంకా అప్పులు చేయాల్సి వచ్చింది.

                       'ఇంక ఈ పిల్లకి పెళ్లెలా అవుతుందో.... ఒంటి కాలితో ఎలా బతుకుతుందో ఏంటో...' అంటూ ఇరుగుపొరుగు వాళ్లు అనే మాటలు నన్నింకా నిరాశలోకి నెట్టేశాయి. జీవితమే పాడయ్యాక జీతం, ఉద్యోగం ఏంటి అన్న వైరాగ్యం చుట్టుముట్టింది. ఆర్నెల్లపాటు ఇంట్లోనే ఉండిపోయా. ఒకరోజు డీపీ సింగ్‌ అనే వ్యక్తి గురించి ఓ ఛానల్‌లో కథనం ప్రసారమైంది. మేజర్‌గా పని చేసిన సింగ్‌ కార్గిల్‌ యుద్ధంలో కాలు పోగొట్టుకున్నారు. అయినా సరే, కృత్రిమంగా కాలు అమర్చుకొని భారత దేశపు మొట్టమొదటి బ్లేడ్‌ రన్నర్‌గా పేరు తెచ్చుకున్నారు. అతని కథనం చూసి నాలో ఏదో సంచలనం, ఉత్సాహం, ధైర్యం! చిన్నవో, పెద్దవో కష్టాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి... వాటిని దాటడంలోనే గొప్పతనం ఉంది అనుకున్నా.

                        ప్రతి నెలా ఆదాయం వస్తే పరిస్థితుల్లో మార్పొస్తుంది అనుకున్నా. వెంటనే ఉద్యోగంలో చేరా. నెట్‌లో వెతికితే డీపీ సింగ్‌ హైదరాబాద్‌లోనే ఉంటున్నారని తెలిసి వెళ్లి కలిశా. 'మనం హ్యాండీక్యాప్డ్‌ అని బాధపడితే ఏం ప్రయోజనం లేదు. హ్యాండీ క్యాపబుల్‌ అని నిరూపించుకోవాలి. ఉద్యోగం, జీతం దగ్గర ఆగిపోకు. కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకో...' అంటూ ఎన్నో మాటలు చెప్పారు. ఆ ప్రభావంతో నా మీద నాకుండే జాలీ, బతుకంటే ఉన్న భయం పోయాయి. డబ్బు కూడబెట్టుకుని కృత్రిమ కాలు పెట్టించుకున్నా. నడవడం, నా పనులు నేను చేసుకోవడం అలవాటు చేసుకున్నా. నాలాంటి వాళ్ల కోసం ఓ క్లబ్‌ ఉందని తెలుసుకుని, దానిలో సభ్యురాలినయ్యా. అందులో చాలామంది సైక్లింగ్‌ చేయడం చూసి ఆశ్చర్యపోయా. నేనూ వాళ్లలా సైకిల్‌ తొక్కాలనుకున్నా. అప్పటివరకూ సైకిల్‌ తొక్కింది లేదు. అయినా పట్టుదలగా ప్రాక్టీసు మొదలుపెట్టా.

                      ఎడమకాలితో పెడల్‌ తొక్కలేక, కాలు మడతపెట్టలేక, వేగం అందుకోలేక... కళ్లల్లో నీళ్లు తిరిగేవి. అయినా ప్రతిరోజూ సాయంత్రం ఆఫీసు అయిపోగానే, లింగంపల్లి నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకూ ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో వచ్చి, రాత్రి తొమ్మిది వరకూ సాధన చేసేదాన్ని. ఈ క్రమంలో దెబ్బలు తగిలాయి. కానీ నాలుగు నెలలు గడిచేసరికి సైకిల్‌ తొక్కగల నైపుణ్యం వచ్చేసింది. అప్పుడే, ఈ ఏడాది మార్చిలో సైక్లింగ్‌ పోటీల ప్రకటన నన్ను ఆకట్టుకుంది. దాన్లో పాల్గొనాలనుకున్నా. అమ్మానాన్నలకు విషయం తెలిసి వద్దని వారించారు. ఓడిపోయినా సరే, పోటీ పడాల్సిందే అనుకుని దరఖాస్తు చేశా. ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టాక గెలవాల్సిందే అనుకున్నా. అదే జరిగింది... ఐదు కిలోమీటర్ల మారథాన్‌లో నేను ఫస్టొచ్చా. ఆ బంగారు పతకం... నేను రైల్లో పోగొట్టుకున్న చెయిన్‌ని గుర్తుకుతెచ్చింది. అంతులేని ఆత్మవిశ్వాసాన్ని అందించింది. భుజానికెత్తుకున్న బాధ్యతల్ని నేనే నెరవేర్చాలన్న ఆత్మస్త్థెర్యాన్ని కూడగట్టుకునేలా చేసింది. ఈ సమయంలోనే నాకో కొత్త లక్ష్యం ఏర్పడింది. మరిన్ని సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొని, వచ్చే ఏడాది జరగనున్న పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్నదే నా ధ్యేయం. అదే ధ్యాసగా ఇప్పుడు కఠిన సాధన చేస్తున్నా. వారాంతాల్లో కొందరు సహోద్యోగులతో కలిసి అనాథాశ్రమాలకు వెళ్లి తోచిన సాయం అందిస్తున్నాం. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి రెండు కాళ్లను కోల్పోయింది. చికిత్స పొందుతున్న తన వద్దకెళ్లి కుంగిపోకుండా ధైర్యం చెప్పా. తను మళ్లీ కాలేజీకి వెళ్లి చదువుకునేలా ప్రోత్సహించా. కుంగిపోకుండా కొత్త లక్ష్యాలు ఏర్పర్చుకుని నవ్వుతూ కనిపిస్తున్న నన్ను చూసి అమ్మానాన్నలూ, తమ్ముడూ, చెల్లి ఆనందంగా ఉన్నారు. 'ఒంటి కాలితో సైక్లింగ్‌లో పతకం సాధించి నువ్వు పదిమందికీ స్ఫూర్తి పంచాలి' అంటూ డీపీసింగ్‌ వెన్నుతడుతున్నారు.


0 Comments

నేను..ఈశ్వరీబాయి బిడ్డను...

9/6/2013

0 Comments

 
Picture
                            తల్లి పిల్లలకు తొలి గురువు అంటారు..తెలంగాణ పురచ్చి తలైవి (విప్లవ వనిత) జె. ఈశ్వరీబాయి.. బిడ్డచేయి పట్టుకొని అక్షరాలు నేర్పలేదు... కానీ తన జీవితాన్నే పాఠంగా చూపింది!అమ్మను మించిన స్నేహితురాలు ఉండదంటారు...

                           ఈ విషయం డాక్టర్ గీతాడ్డికి అనుభవైకవేద్యం!తల్లికన్నా గొప్ప తత్వం బోధించేవాళ్లుంటారా?ఉండరు.. ఈశ్వరీబాయి, గీతాడ్డిల అనుబంధమే అందుకు సాక్ష్యం! అమ్మకు సాటివచ్చే గైడ్ ఎవరు లోకంలో...?ఎవరూలేరు! అందుకు గీత సాధించిన విజయాలే సోదాహరణలు!‘అఆఇఈ’ల చదువు నుంచి ఆత్మవిశ్వాసం గెలుపు దాకా గీతలో పోతపోసుకున్నదంతా ఈశ్వరీబాయే!అయినా అమ్మలో నేను పదిశాతం కూడా లేను అనుకుంటుంది ఆ బిడ్డ! అలాంటి గీతాడ్డి మనోగతమే ఇది....

                 నేను చాలా అదృష్టవంతురాలిని. దళిత మహిళా నేత జె. ఈశ్వరీబాయి నాకు తల్లికావడం నా పూర్వజన్మ సుకృతం. ఆమెలాంటి వ్యక్తిత్వం బహుశా ఇంకెవరికీ ఉండకపోవచ్చు. దళిత కుటుంబంలో పుట్టి, చిన్న వయసులోనే భర్తను కోల్పోయి జీరో నుంచి జీవితాన్ని మొదలుపెట్టింది. ఓ వైపు టీచర్‌గా ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు సాంఘిక సేవలో ఇన్‌వాల్వ్ అయింది. రెడ్‌క్షికాస్ సొసైటీ చాలా కార్యక్షికమాల్లో ఆమె భాగస్వామి. రెడ్‌క్షికాస్ సొసైటీ లైఫ్ మెంబర్. పేదలకు చదువు చెప్పించాలని తన దగ్గరున్న డబ్బుతోనే గీతా ప్రైమరీ స్కూల్ అని, గీతా మిడిల్ స్కూల్ అని ఇన్‌స్టిట్యూషన్స్ మొదలుపెట్టింది. నాన్న చనిపోయినప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఆయన పుణెలో డెంటిస్ట్. నాన్న పోవడంతో నన్ను తీసుకొని సికింవూదాబాద్‌లోని అమ్మమ్మవాళ్లింటికి(చిలకలగూడ) వచ్చేసింది అమ్మ. అక్కడి స్లమ్స్‌కి వెళ్లి అడల్ట్ ఎడ్యుకేషన్ చెప్తానని అమ్మ అక్కడ ఓ బోర్డ్ పెట్టి, ఓ వరండాలో అందరినీ పోగేసి చదువు చెప్పేది. నేను అప్పుడప్పుడే స్కూల్‌కి వెళ్తున్నాను. స్కూల్ నుంచి రాగానే నేనూ అమ్మతో వెళ్లి నాకు వచ్చిన ఏబీసీడీలు బోర్డుమీద రాసి వాళ్లకు చెప్పేదాన్ని.

ఇండిపెండెంట్..
                        మేమున్న ఏరియా వెరీ సెక్యులర్. ఒకవైపు అంతా ముస్లిమ్స్, ఇంకో వైపు క్రిస్టియన్స్. మధ్యలో మేముండేవాళ్లం. అన్ని పండుగలను అందరం కలిసే చేసుకునేవాళ్లం. కులమతాలకతీతమైన మంచి వాతావరణంలో పెరిగాన్నేను. ఎస్సీనని చిన్నప్పటి నుంచీ తెలుసు. కాని దానివల్ల వచ్చే కష్టాలు, నష్టాలు మాత్రం నేనెప్పుడూ ఫేస్ చేయలేదు. అట్లా పెంచింది నన్ను అమ్మ. ఒకవైపు సంఘసేవ, ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవాలనే తత్వం లాంటివన్నీ మా అమ్మవల్ల చిన్నప్పుడే తెలిశాయి. అన్నిటికి మించి ఆత్మస్థయిర్యం. ఆమె నాకు మదర్, టీచర్, గైడ్ , ఫిలాసఫర్, ఫ్రెండ్ కూడా! ఆమెను చూసిన ప్రతిసారి ఒక ఉత్సాహం కలిగేది. ఇన్‌స్పైర్ అయ్యేదాన్ని. ఆమె అప్పుడే కార్ డ్రైవ్ చేసేది. ఎలాంటి డేంజరస్ సిట్యూయేషన్స్ ఉన్నా, ఎవరైనా ఆడవాళ్లు బాధల్లో ఉన్నట్టు తెలిస్తే చాలు ఎంత రాత్రయినా సొంతంగా కారేసుకొని వెళ్లిపోయేది. మా అమ్మవాళ్ల బ్రదర్ రామకృష్ణ .

                            ఆయన టోటల్ లెఫ్టిస్ట్. అమ్మకు పొలిటికల్ థాట్స్, అవేర్‌నెస్ కల్పించింది ఆయనే! భర్త చనిపోయి తల్లిగారింటి మీదున్నా అమ్మ ఏనాడూ డిపెండెంట్‌గా లేదు. ఆ రోజుల్లోనే ఆమె మెట్రిక్ పాసైంది. టీచర్ ఉద్యోగం చేస్తూ ఇండిపెండెంట్‌గానే ఉంది. ఎక్కడున్నా అందరితో కలివిడిగా, ప్రేమతత్వంతో ఉండేది. అణగారిన వర్గాలు, స్త్రీల పట్ల చాలా కమిట్‌మెంట్‌తో ఉండేది. జీవితాంతం అంబేద్కర్ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. ఇండిపెండెంట్‌గా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసి అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీలోకి వెళ్లింది. ‘రూలింగ్ పార్టీలో ఉంటే మనకు వాయిస్ ఉండదు. వాళ్లు చెప్పినట్టే నడుచుకోవాలి. అదే అపోజిషన్‌లో ఉంటే క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది’ అని చెప్పేది ఎప్పుడూ! అంత పోరాటపటిమతో ఉండేది. మా అమ్మలో నేను పదోవంతు కూడా లేను. రెండుసార్లు కౌన్సిలర్‌గా ఉండి తర్వాత ఎమ్మెల్యే అయింది. మా గ్రాండ్‌పేంట్స్ కూడా ఆమెకు చాలా స్వేచ్ఛనిచ్చారు. జనాలంతా డైరెక్ట్‌గా ఆమె బెడ్‌రూమ్‌లోకే వెళ్లేవాళ్లు. కింద ఒక గొంగడి పర్చుకొని కూర్చునేవారు.

                            అక్కడే అమ్మ ఒక టైపిస్ట్‌ని, క్లర్క్‌ని పెట్టుకునేది. ప్రజల సమస్యలు విని అప్పటికప్పుడే లెటర్ టైప్ చేయించి ఇస్తుండే. అమ్మ చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉండేది, మంచి డ్రెస్ సెన్స్ ఆమెది. తనను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది... ఒక్క మహిళ... ఇన్ని పనులు చేయగలదా అని! అట్లా ఎదుగుతూ ఎదుగుతూ ఆమె చివరకు రిపబ్లికన్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయింది. పుణెలో ఉన్నప్పుడు మరాఠీ బాగా నేర్చుకుంది. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో ఆమెతో పార్టీవాళ్లు మరాఠీలో స్పీచ్‌లిప్పించేవారు. పీవీ నరసింహారావు, అమ్మ అయితే మరాఠీలోనే మాట్లాడుకునేవాళ్లు. ఆయన అమ్మను ‘అక్కా’ అని పిలిచేది. పీవే కాదు అన్ని పార్టీల నేతలు అమ్మను చాలా గౌరవించేవారు. నా చిన్నప్పటి నుంచి అమ్మ ఒకటే మాట అంటుండే..‘మీ ఫాదర్ డెంటిస్ట్‌గా ఉండే, నువ్వు గైనకాలజిస్ట్ కావాల, డాక్టర్‌నే పెళ్లి చేసుకోవాల, నేను హాస్పిటల్ కట్టాల, మీరు అందులో ప్రాక్టీస్ చేయాలి’ అని! నన్ను మాత్రం పాలిటిక్స్‌లోకి రావద్దు అని చెప్పేది. పాలిటిక్స్‌కి నేను సూట్ కానని ఆమె ఉద్దేశం. నిజానికి ఆమె నన్ను ఓ లిటిల్ ప్రిన్సెస్‌లా పెంచింది. ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంవూదవూపసాద్, కృష్ణమీనన్, జవహర్‌లాల్ నెహ్రూ.. ఇట్లా అందరినీ నాకు చూపించింది. షి వజ్ సో ఫాండ్ ఆఫ్ మి. నేను ఆమె కలలను నెరవేర్చాను.

వారితో పరిచయం.. ఫారిన్ ప్రయాణం
                        నేను గాంధీ మెడికల్ కాలేజ్‌లో మెడిసిన్ చేశాను. డాక్టర్‌గారు (భర్త, డాక్టర్ రామచంద్ర రెడ్డి
) మణిపాల్‌లో ఎంబీబీఎస్ చేసి హౌస్‌సర్జన్సీ కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వచ్చారు. నాదీ గాంధీ హాస్పిటలే. అట్లా మా ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. 1971లో నా పెళ్లి అమ్మ ఊహించుకున్న రేంజ్‌లోకాక చాలా సింపుల్‌గా జరిగిపోయింది. పెళ్లాయ్యాక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాం ఇద్దరం. అక్కడే జాబ్ చేస్తూ పీజీ చదివాం. తను అనస్థీషియా, నేను గైనకాలజీ! మూడేళ్ల తర్వాత ఇండియా వచ్చాం. తన ఫ్రెండ్స్‌ని, రెండు వైపుల బంధువులను పిలిచి గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చింది. ఆ టైమ్‌లో ఆస్ట్రేలియాకు పెద్ద పేరు లేదు. ఇంగ్లండ్ అంటేనే గొప్ప. ‘ఏం ఆస్ట్రేలియా.. లండన్‌లో చదువుకుంటే గొప్ప’ అని అమ్మ బంధువులు అన్నారు. అట్లా ఆస్ట్రేలియా నుంచి 1977లో లండన్ వెళ్లాం. అక్కడ మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్‌లో obstetrics and gynecologyలో నేను, అనస్థీషియాలోడాక్టర్‌గారు.. డిగ్రీ చేశాం.

                          మేమున్నప్పుడు ఒకసారి రాయల్‌కాలేజ్ ఫంక్షన్‌కి క్వీన్ ఎలిజబెత్ వచ్చారు. ఆమె ఎవరి దగ్గరకైతే వచ్చి మాట్లాడుతుందో వాళ్లు మోకాళ్ల మీద వంగి ఆమెకు రాజవందనం తెలపాలని మాకు ముందే చెప్పి ఉంచారు కాలేజ్ స్టాఫ్. నేను చీర కట్టుకొని, నగలు వేసుకొని కంప్లీట్ ఇండియన్ లేడీగా తయారై వెళ్లాను. డాక్టర్‌గారు ముందే చెప్పారు ‘ఎలిజబెత్ సరాసరి నీ దగ్గరికే వస్తుంది’ అని. ఆ మాటను నేను తేలికగా తీసుకున్నాను. అన్నట్టుగానే క్వీన్ ఎలిజబెత్ డైరెక్ట్‌గా నా దగ్గరకే వచ్చి పలకరించింది. ఆ ఎగ్జైట్‌మెంట్‌లో ఆమెకు మోకాళ్ల మీద వంగి నమస్కారం చేయాలనే విషయాన్ని కూడా మరిచిపోయిన! మేం ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడే అమ్మ ఇక్కడ ఎమ్మెల్యే. తను అపోజిషన్‌లోఉన్నప్పటికీ ఆమెను విమెన్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్ కమిషన్‌కి చైర్మన్ చేశారు. అంటే అది కేబినెట్ ర్యాంక్ అన్నమాట. అమ్మకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవమనుకుంటా అది! అంత స్ట్రేచర్, బిజీగా ఉండే అమ్మ నా ఎగ్జామ్స్ టైమ్స్‌లో లండన్‌కి వచ్చి పక్కా తల్లి పాత్ర పోషించింది. ఆమె మంచి కుక్. మాకే కాదు మా ఇంటికొచ్చిన అందరికీ ఓపికగా బిర్యానీ సహా రకరకాల వంటలు వండిపె ఎన్ని క్వాలిటీసో ఆమెలో!

కింగ్ ఫర్హాద్..
                           లండన్‌లో మా చదువులు ముగిసే నాటికల్లా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఫర్హాద్ హాస్పిటల్‌లో పనిచేయడానికి ఆఫర్ వచ్చింది మా ఇద్దరికి. అప్పటికే డాక్టర్‌గారు కూడా ‘మనం సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవాలంటే డబ్బు, అనుభం కావాలి కదా.. వెళ్లి చేద్దాం’ అన్నారు. మంచి హాస్పిటల్, పెద్ద జీతం, గొప్ప అవకాశం అది. వెళ్లాం. ఆ హాస్పిటల్‌లో మా ఇద్దరికీ మంచి పేరుండేది. మేం అక్కడున్నప్పుడే 1980లో ఇండియా నుంచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న రాజీవ్‌గాంధీ ఇద్దరూ రియాద్‌కి వచ్చారు. ముస్లిం కంట్రీస్‌లో వాళ్ల జెండాతో పాటు ఇండియా జెండా కూడా కలిసి ఎగరడం ఓ అద్భుతం. అదిచూసిన మాకు చాలా గర్వంగా అనిపించింది. అప్పుడే సౌదీ కింగ్ ఫర్హాద్ ఇందిరాగాంధీ, రాజీవ్‌లతో పాటు అతికొద్ది మంది సన్నిహితులకు ఒక డిన్నర్ ఏర్పాటు చేశాడు. దానికి మా ఇద్దరికీ ఆహ్వానం అందింది. వెళ్లాం. అందరినీ పరిచయం చేసుకుంటూ ఇందిరాగాంధీ మా దగ్గరకీ వచ్చింది. అప్పుడు నేను చాలా అగ్రెసివ్‌గా ఉండేదాన్ని.

                      ఆమెకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ‘అచ్చా బాబా...’ అంటూ చాలా క్లోజ్‌గా మాట్లాడి ‘అంత చదువులు చదివి ఇక్కడెందుకు ? నీ సొంతదేశమొచ్చి సర్వీస్ చేయొచ్చు కదా’ అంది. ‘ఫారిన్‌లో ఉన్న డయాగ్నస్టిక్ ఫెసిలిటీస్ హైదరాబాద్‌లో లేవు కదా?’ అంటూ సమాధానమిచ్చాను. ఆమె తన వెనకాలే ఉన్న రాజీవ్‌గాంధీని పిలిచి మమ్మల్ని పరిచయం చేసి ‘కింద నాకు ప్రెస్ కాన్ఫన్స్ ఉంది. వీళ్లతో నువ్ మాట్లాడు’ అని రాజీవ్‌కి చెప్పి ఆమె వెళ్లిపోయింది. రాజీవ్‌గాంధీతో కూడా అదే చెప్పాను. ‘మనదేశంలో వెస్ట్రన్ కంట్రీస్‌లో ఉన్న ఫెసిలిటీస్ లేవు. మేమో వెల్‌ట్రైన్డ్ డాక్టర్స్‌మి. ఇక్కడున్న ఫెసిలిటీస్ అక్కడ లేకపోతే మేం నేర్చుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది కదా?’ అని. దానికి ఆయన ‘లేదు.. లేదు.. మనదేశానికి మీలాంటి చదువుకున్నవాళ్ల అవసరం చాలా ఉంది. సరే ఎలా చేద్దామనేది చూద్దాం’ అన్నారు. ఈలోపే మా అమ్మ నుంచి మెస్సేజ్...‘హాస్పిటల్ కట్టడం పూర్తయింది, మీరు రావాలి’ అని.

                    ఇండియాకు వెళ్లేముందు జర్మనీ వెళ్లి అక్కడ బెంజ్ కారు సహా మా ఇన్నేళ్ల సంపాదనలో కొన్నుక్కున మెడికల్ ఎక్విప్‌మెంట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇంటికోసం కొనుక్కున్న ఎన్నో సామాన్లను ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ రెసిడెన్స్‌లో తెచ్చుకున్నాం. తీరా ముంబై వెళ్లి చూస్తే షిప్‌లో మా సామాన్లున్న పెట్టెలకు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి సామాన్లు మాత్రం మాయం. బాధ, కోపం! ఏం చేస్తాం! కంప్లయింట్ చేసినా ముంబైలో అప్పుడు మేం అనామకులం. ‘ఇండియా రండి, ఇండియా రండి అన్నారు.. ఈరకమైన స్వాగతమా? రాజీవ్‌కి చెప్దాం ఈ అన్యాయం గురించి’ అని ఆయనకు ఉత్తరాలు రాశాం. జవాబు లేదు. ఇలా అయితే కుదరదు వెళ్లి డైరెక్ట్‌గా కలుద్దామని ఢిల్లీ వెళ్లాం.

సోనియాగాంధీ సహాయం..
                      ఏపీ భవన్‌లో ఉన్నాం. ఇదిగో కలుస్తారు, అదిగో కలుస్తారు అనుకోవడంలోనే రోజులు గడిచాయి కానీ రాజీవ్‌గాంధీ మాత్రం కలవలేదు. అప్పుడు సోనియాగాంధీ మాకు హెల్ప్ చేసి రాజీవ్‌గాంధీ అప్పాయింట్‌మెంట్ ఇప్పించారు. ఆయనకు మా విషాదగాథ అంతా వివరించాం. రాజీవ్‌గాంధీ సహకారంతో మా ఇన్సూన్స్ డబ్బులు మాకు వచ్చాయి. హైదరాబాద్ చేరిన తర్వాత అమ్మ తను కట్టించిన హాస్పిటల్ చూసి నేనైతే నోరెళ్లబెట్టి రోడ్డుమీదే నిలుచుండి పోయిన. ‘ఇది దేవత లేని గుడిలాగా ఉంది. ఎక్కడో దేశంకాని దేశంలో నువ్వు గొప్ప డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటే నాకేం సంతోషం? నా కండ్లముందు నా బిడ్డ గొప్ప పేరు తెచ్చుకుంటే సంతోషం కాని’ అంది మా అమ్మ. ఆ హాస్పిటల్‌లో మా ప్రాక్టీస్ మొదలైంది. గ్రామాల్లో కూడా మొబైల్ మెడికల్ సర్వీసూ మొదలుపెట్టిన. రెండు వ్యాన్లు తీసుకొని దానికి ‘రాజీవ్ మొబైల్ మెడికల్ సర్వీస్’ అని బ్యానర్లు కట్టుకొని మెదక్ జిల్లాలోని గజ్వేల్, నర్సాపూర్, సిద్ధిపేట్ ఏరియా అంతటా మెడికల్ క్యాంపులు పెడ్తుంటి. ఫ్రీగా మందులు ఇచ్చేవాళ్లం. అక్కడున్న కాంగ్రెస్ వాళ్లు కూడా బాగా పరిచయం అయిపోయిండ్రు. ఒకవైపు మెడికల్ సర్వీస్ చేసుకుంటూనే ఇంకోవైపు జనాలకు కాంగ్రెస్ గురించి, అది అందిస్తున్న పథకాల గురించి చెప్తుంటి.

ఓడిపోతే బాగుండు..
                        1986లో అంజయ్య చనిపోయాడు. ఆ బై ఎలక్షన్లో నేను నిలబడాలి. నా వెల్‌విషర్స్, డాక్టర్‌గారు అందరూ చెప్తే ఆ సీట్ నాకివ్వడానికి రాజీవ్‌గాంధీ ట్రై చేశారు. కాని కుదరలేదు. ‘ఇది బై ఎలక్షన్ కదా.. అందరి దృష్టి దానిమీదే ఉంటుంది తర్వాత చూద్దాంలే’ అని రాజీవ్‌గాంధీ ఆ సీట్‌ను మణెమ్మకు ఇచ్చారు. అది కరెక్టే! ఆ తర్వాత 1989లో మళ్లా నేను సిద్ధిపేట్ ఎంపీ టికెట్‌కి అప్లికేషన్ పెట్టుకున్న. అంతకుముందు అక్కడ నంది ఎల్లయ్య ఉండే. ఆల్‌మోస్ట్ టికెట్‌నాకిచ్చేసినట్టే చెప్పారు. చివరకు ‘ఆ స్థానం నంది ఎల్లయ్యకే కావాల, ఎంతైనా ఆయన సీనియర్.. ఆమె ఇప్పుడిప్పుడే వచ్చింది, కావాలంటే ఆమెకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు..’ అంటూ మళ్లీ మా పెద్ద నాయకులందరూ రాజీవ్‌గాంధీని ఇన్‌సిస్ట్ చేశారు. రాజీవ్‌గాంధీ కూడా ‘ఎమ్మెల్యేగా నిలబడుదువుగానీ’ అన్నారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ‘నో ప్రాబ్లం .. ఐ గో బ్యాక్ టు మై ప్రాక్టీస్’ అన్నాను ఆయనతో. ‘నోనో.. సిద్ధిపేట్‌లో నీకే సీట్ కావాలంటే అది ఇస్తాను’ అన్నారు.

                      పెద్దమనిషి అంత ఇదిగా అంటుంటే రిజెక్ట్ చేయడం కూడా మర్యాద కాదనుకొని గజ్వేల్ సెలెక్ట్ చేసుకొని ఎమ్మెల్యేగా నిలబడ్డ... ‘ఓడిపోతే మంచిగుండు’ అనుకుంటూ! ఎందుకంటే అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. ఓడిపోయాను అనుకొని ఎవరినీ నొప్పించకుండా మళ్లీ నా ప్రాక్టీస్‌కి నేను వెళ్లిపోవచ్చు అని. నాట్ నోయింగ్ మచ్ ఎబౌట్ పాలిటిక్స్, అంతగా కాన్వాసింగ్ కూడా ఏమీ లేకుండానే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన. కాని గెలిచిన. ఆ టర్మ్‌లోనే మినిస్టర్‌గా అవకాశం కూడా వచ్చింది. అయితే నేను అనుకున్న దానిపట్ల కమిటెడ్‌గా ఉంటానని నామీద రాజీవ్‌గాంధీకి నమ్మకం ఉండె!

న్యూ కమ్మర్‌నే అయినా..
                      మంత్రిగా నాకు చాలా పోర్ట్‌ఫోలియోలు వచ్చాయి. చెన్నాడ్డి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు సోషల్ వెల్‌ఫేర్, సెకండరీ ఎడ్యుకేషన్, ప్రోటోకాల్ ఈ మూడింటికి నేను మంత్రిని. నా విజయం పట్ల మా అమ్మకు సంతోషమే ఉండే. దాన్ని ఇంట్లోనే వ్యక్తం చేసేది కాని బయట పదిమందిలో ఎప్పుడూ పొగిడేది కాదు. అది ఆమెలో ఉన్న గొప్ప క్వాలిటీ! అంతెందుకు.. మొదటిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి నిజాం కాలేజ్‌క్షిగౌండ్స్‌కి వెళ్తూ.. ‘నా ప్రమాణస్వీకారానికి నువ్వు రావాలి అమ్మా... నా కార్లోనే వెళ్దాం రా’ అంటే ‘అది నీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రమాణస్వీకారానికి నేనెందుకు వస్తాను, రాను’ అంది. ‘అరే.. నేను నీకు ఒక్కగానొక్క బిడ్డను. నేను ఫస్ట్ టైమ్ మంత్రినయినా.. నువ్ చూడవా ? రా’ అని బతిమాలినా.. ‘నువ్ పో అమ్మ పో... నీ ప్రమాణస్వీకారం నేను టీవీల జూస్కుంటలే’ అని టీవీలోనే చూసింది కానీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌కి మాత్రం రాలేదు. దటీజ్ ఈశ్వరీ బాయి. అంత ప్రిన్స్‌పుల్డ్, ఐడియలాజికల్ పర్సన్! షి ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ టుడేస్ పాలిటీషియన్స్!

1991...
                      ఆయేడు మా అమ్మ చాలా సిక్ అయింది. బాంబేలోని ఫేమస్ డాక్టర్ సూనావాలాకు చూపించాం. బయాప్సీ చేస్తే క్యాన్సర్ అని తేలింది. అది నాకు సెట్‌బ్యాక్ అయింది. ఎందుకంటే నాకింకా వేరే బ్రదర్స్, సిస్టర్స్ లేరు కదా! అమ్మ అయినా, ఫ్రెండ్ అయనా తనే! అందుకే ఆమెకు క్యాన్సర్ అని తేలేసరికి నేను చాలా కుంగిపోయాను. ట్రీట్‌మెంట్ ఇప్పించినా... 1991, ఫిబ్రవరి 21న షి పాస్డ్ అవే! దురదృష్టవశాత్తు అది చాలా బ్యాడ్ ఇయర్. మేలో రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. ఆ టైమ్‌లో నా హజ్బెండ్ చాలా సపోర్ట్‌గా ఉన్నారు. అయినా ఎందుకో ఇక పాలిటిక్స్ వద్దనిపించింది. పాలిటిక్స్ వదిలేస్తానని డైరెక్ట్‌గా చెన్నాడ్డిగారితోనే చెప్పాను. ‘పిచ్చిగా మాట్లాడకు. బాగాలేకపోతే కొన్నాళ్లు రెస్ట్ తీసుకో. అర్జెంట్ ఫైల్స్ ఉంటే చూడు, లేకపోతే ఏమీ పట్టించుకోకు’ అని సర్దిచెప్పాడు. ఆగస్ట్‌లో రాజీవ్‌గాంధీ జయంతి అయిపోగానే సోనియాగాంధీ దగ్గర టైమ్ తీసుకొని వెళ్లి కలిశాను. ‘మీ కుటుంబం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నేను కంటిన్యూ కాలేను.

                        ఐ గో బ్యాక్ టు మై ప్రాక్టీస్’ అని చెప్పిన. దానికి ఆమె ‘దేశంలో మీలాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ పర్సన్స్ చాలామందిని ఆయన రాజకీయాల్లోకి తెచ్చారు మీరంతా ఏదోచేస్తారని.. ఇప్పుడు మీరు విరమించుకుంటానంటే అంత బాగుండదేమో’ అన్నారు. ఆమె అంత మాటనేసరికి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. 1994 కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా నేను రెండుసార్లు పార్టీ జనరల్ సెక్రటరీగా చేశాను. 2000 నుంచి 04 దాకా పార్టీ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా చేశాను. అధికారంలో ఉన్నా , లేకపోయినా పార్టీ నాకు ఇవ్వాల్సినంత గుర్తింపు, గౌరవాన్నిచ్చింది. 2004లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడంతో మళ్లీ మంత్రి పదవి వరించింది. 2009లో డీలిమి నాకు జహీరాబాద్ నియోజకవర్గం వచ్చింది. 2009లో రాజశేఖర్‌డ్డిని అడిగిన... ఎమ్మెల్యే, మంత్రి పదవులు చాలు.. ఎన్నాళ్లని ఇంకా స్టేట్ పాలిటిక్స్‌లో ఉండాలి? ఎంపీకి పోటీచేస్తానని.

                       కాని అవకాశం రాలేదు. టూరిజం, స్పోర్ట్స్, భారీపరిక్షిశమలు, ఇన్ఫర్మేషన్.. ఇట్లా అన్ని శాఖలకూ మంత్రిగా చేశాను. నా కెపాసిటీని ప్రూవ్ చేసుకున్నాను. 2004లో టూరిజం శాఖకు మంత్రిగా ఉన్న నన్ను వోక్స్‌వ్యాగన్ వ్యవహారంతో భారీ పరిక్షిశమల శాఖనూ నాకు అడిషనల్ పోస్ట్‌గా ఇచ్చారు. దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేశాను. తర్వాత ఇప్పుడూ అదే శాఖకు నన్ను మంత్రిని చేయడం నిజంగా ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు చీఫ్‌మినిస్టర్! ఈ శాఖకు సంబంధించి మొన్న వైస్‌వూపెసిడెంట్ హమీద్ అన్సారీ నుంచి ‘బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్టేట్’ అవార్డ్ కూడా తీసుకున్నాం. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో దేశంలో మనం సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం. పరిక్షిశమల్లో ఎస్సీఎస్టీలను ఎంకరేజ్ చేయడానికి ఒక పాలసీ తెచ్చాం. వాళ్లకు 30 శాతం రాయితీలు పెంచాం.

                           ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారులకైతే 40 శాతం సబ్సిడీలు పెంచాం. ఇది చరివూతాత్మక నిర్ణయమే! నేను వచ్చిన కొత్తలో కేవలం 78 యూనిట్స్ ఉంటే ఇప్పుడు మూడువేల యూనిట్స్‌కి పెరిగాయి. షుగర్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి కూడా బాగానే వర్క్ చేశాం. 2005లో మూతపడ్డ ఎనిమిది పరిక్షిశమలను రివైవ్ చేశాం. దీన్నిబట్టే నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననిపిస్తుంది. ఏ శాఖ ఇచ్చినా అందులో టోటల్‌గా ఇన్‌వాల్వ్‌కావడం, అధికారులతో మంచి రాపో మెయిన్‌టైన్ చేయడం నా నైజం!

మిస్ అవుతున్నాను
                      డాక్టర్‌గా కూడా నేను సక్సెస్‌ఫులే. నా మెడికల్ కెరీర్‌లో ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్‌ను డీల్ చేశాను. నా అదృష్టమేంటంటే మా ఆయన ఎనస్థిటిస్ట్ కావడం. అర్ధరాత్రి కేసొచ్చినా ఇద్దరం పరిగెత్తేవాళ్లం. అప్పట్లోనే ఇన్‌ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌లో నేను నెంబవర్ వన్. నా లైఫ్‌లో బెస్ట్ అంటే రీకానలైజేషన్ సర్జరీ. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్న ఒకామెకు మళ్లీ పిల్లలు కలిగేలా ఆపరేషన్ చేస్తే కొడుకు పుట్టాడు. ఇప్పుడు అతనికి 24 ఏళ్లు. ఆ అబ్బాయిని తీసుకొని అప్పుడప్పుడు ఇంటికొస్తుంది ఆమె. నేను మెడిసిన్‌ను ఇష్టపడే చదివాను. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ను చాలా ప్రేమించాను. ఇప్పుడు ఆ ప్రొఫెషన్‌ను, ఆ వన్ టు వన్ రిలేషన్‌ను మిస్ అవుతున్నాననిపిస్తుంది! నాకొక కూతురు. తను చాలా తెలివిగా హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేసింది. ఇప్పుడు మా హాస్పిటల్‌ను డాక్టర్‌గారు, మా అమ్మాయే చూసుకుంటున్నారు. అల్లుడు ఐఎస్‌బీలో ఎంబీఏ చేసి జార్ఖండ్‌లో సోలార్ ప్లాంట్ బిజినెస్ చేస్తున్నాడు. వాళ్లకు ఒక పాప ఆకృతి, నాలుగేళ్లు! నా గ్రాండ్ డాటరే నా బెస్ట్ ఫ్రెండ్.

మేము చూస్తామని అనుకోలేదు...
                      తెలంగాణ మా అమ్మకాలం నాటి పోరాటం. ఆ ఉద్యమంలో మా అమ్మ ఒక సైనికురాలిగా పోరాడింది. పోలీసులు ఆమెకోసం మా ఇంటిచుట్టూ పహారాకాసేవాళ్లు. దొరకకుండా ఒక నెలరోజులు మా అమ్మ వాళ్లను ముప్పుతిప్పలు పెట్టింది. లాస్ట్ పట్టుకున్నారనుకోండి. ఆమెను జైల్‌కి తీసుకెళ్తుంటే తనలో కొంచెం కూడా బెరుకులేదు. ‘అయ్యోనాకో కూతురు ఉంది, నేను జైల్‌కి వెళ్తే తనెట్లా’ అన్న ఆలోచనే లేదు! ఆమె అట్లా వెళ్తుంటే వెనకాల ఫియట్‌కారులో మేము...!’ అంత ధైర్యం నేను ఎవరిలో చూడలేదు. అన్నేళ్ల పోరాటానికి ఫలితం అన్నట్లుగా సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది నా జీవితకాలంలో చూస్తాననుకోలేదు. అంతటి చారివూతాత్మక పరిణామానికి మనమంతా సాక్షులుగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ కల నెరవేరింది. తెలంగాణ ప్రజలమంతా కష్టపడి దీని అభివృద్ధికి పాటుపడాలి. ప్రతి ఒక్కరం అందులో భాగస్వాములం కావాలి!

మూలం : నమస్తే తెలంగాణ

0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.