
కావలసిన పదార్థాలు :
మైదా - కప్పు
పన్నీర్ తురుము - కప్పు
ఆలూ తురుము - అరకప్పు (ఉడికించి తురుముకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - చెంచ
గరం మసాలా - చెంచ
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - రెండు
ధనియాల పొడి - అరచెంచ
కొత్తిమీర - కొంచెం
నూనె - వేయించడానికి సరిపడా
ఉల్లిపాయలు - రెండు
ఉల్లికాడలు - కొన్ని
తయారుచేసే పద్ధతి :
మూలం : ఈనాడు వసుంధర
మైదా - కప్పు
పన్నీర్ తురుము - కప్పు
ఆలూ తురుము - అరకప్పు (ఉడికించి తురుముకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - చెంచ
గరం మసాలా - చెంచ
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - రెండు
ధనియాల పొడి - అరచెంచ
కొత్తిమీర - కొంచెం
నూనె - వేయించడానికి సరిపడా
ఉల్లిపాయలు - రెండు
ఉల్లికాడలు - కొన్ని
తయారుచేసే పద్ధతి :
- మైదాలో కొద్దిగా ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని అరగంట సేపు నాననివ్వాలి.
- ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, కాగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. నాలుగైదు నిమిషాలయ్యాక ఆలూ, పన్నీర్ తురుము, కూడా వేసేయాలి. అన్నీ బాగా కలిసాక ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి దించేయాలి.
- ఇప్పుడు మైదాను పల్చని పూరీలా వత్తుకొని మధ్యలో పెద్ద చెంచాడు పన్నీర్ మిశ్రమాన్ని ఉంచి, అన్నివైపులా అంచుల్ని పైకి తెచ్చి మూటలా వచ్చేలా చేసుకోవాలి. (ఆ మిశ్రమం కింద పడకుండా ఉండాలంటే ఉల్లికాడతో ఆ మూటను ముడి వేసేయాలి) ఇలా మిగిలిన పిండితోనూ మోదక్ లను చేసుకొని వాటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వచ్చేదాకా వేయించి తీసేసుకోవాలి.
మూలం : ఈనాడు వసుంధర