telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

బూందీ రైతా

9/17/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్ధాలు: 
బూందీ: 100 గ్రా.
పెరుగు: 1 కప్పు
ఉప్పు: తగినంత
వేయించిన జీలకర్ర పొడి: 
1/2 టీ స్పూను
కొత్తిమీర తరిగినది: 
2 టేబుల్‌ స్పూన్లు
కారం: 1/2 టీ స్పూన్‌



తయారు చేసే విధానం:
  • పెరుగును చిక్కగా చిలుక్కోవాలి.
  • దానిలో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర ఆకులలో సగం వేయాలి. అందులో బూందీ వేసి గరిటతో బాగా కలపాలి.
  • తర్వాత మిగిలిన జీలకర్ర పొడి, కొత్తిమీర ఆకులు, కారం వేసి సర్వ్‌ చేయడమే. దీనిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది. 

మూలం : సూర్య దినపత్రిక

0 Comments

సొరకాయ రైతా 

6/26/2013

0 Comments

 
Picture


కావలసిన పదార్థాలు :  
సొరకాయ తురుము - ఒకటిన్నర కప్పు,  
పెరుగు - ఒక కప్పు, 
ఉప్పు - ఒక టీస్పూన్, 
కారం - పావు టీస్పూన్, 
జీలకర్ర (వేగించి, పొడికొట్టి)- అర టీస్పూన్.




తయారుచేసే పద్ధతి :
  •  పెరుగుని ఒక గిన్నెలో తీసుకుని బాగా గిలక్కొట్టాలి. 
  • సొరకాయ తురుమును కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. 
  • పెరుగులో ఉప్పు వేసి కలిపి ఆ తరువాత ఉడికించిన సొరకాయ గుజ్జును కలపాలి. దీనిపైన కారం, జీలకర్ర పొడి వేసి అలంకరించి సర్వ్ చేయాలి. తాలింపు వేసుకుని తిన్నా రుచిగానే ఉంటుంది.

మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 

0 Comments

రాగి సరిగ

6/10/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బియ్యం నూకలు  -       రెండు కప్పులు 
రాగి పిండి          -        ఒకటిన్నర కప్పు 
పెరుగు              -        అరకప్పు 
ఉల్లిపాయ          -        ఒకటి (పెద్దది)
పచ్చిమిరపకాయలు -   మూడు 
ఉప్పు               -        తగినంత 


తయారుచేసే పద్ధతి :
  • ముందుగా ఒక పాత్రలో రాగిపిండి తీసుకొని అందులో నీళ్ళు కలిపి సుమారు 12 గంటల సేపు ఊరబెట్టాలి. రాగిపిండి జావ బాగా పులవాలి. 
  • తర్వాత నూకలు శుభ్రం చేసుకొని అందులో ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద ఉడికించాలి. అర్ధ భాగం ఉడికిన తర్వాత పులిసి ఉన్న రాగి పిండిని జావాను అందులో పోయాలి. తర్వాత మరో పది నిముషాలు ఉడికించాలి. 
  • చల్లారిన తర్వాత కావలసినన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఆ జావలో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు చేర్చుకోవాలి. అంతే రాగి సరిగ రెడీ. 
  • ఇది వేసవి తాపాన్ని తీరుస్తుంది. ఇందులో కారం కావాలనుకునే వారు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. శీతల పానీయాలకంటే సాంప్రదాయబద్దమైనది. చిన్నారులకు ఈ సరిగ ఆకలి తీర్చడమే కాకుండా మంచి శక్తిని ఇస్తుంది. ఇది తెలుగింటి వేసవి స్పెషల్.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

స్పినాక్ రైతా 

5/23/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

పాలకూర              -             ఒక కట్ట 
పెరుగు                 -              ఒక కప్పు 
ఉడికించిన కార్న్   -              ఒక టేబుల్ స్పూన్ 
చాట్ మసాలా        -              ఒక టీస్పూన్ 
పచ్చిమిరపకాయ  -              ఒకటి 
వెల్లుల్లి రెబ్బ          -               ఒకటి 
ఉల్లికాడలు           -               ఒకటి 

తయారుచేసే పద్ధతి :

          ముందుగా పాలకూర ఆకుల్ని పేస్ట్ చేసుకోవాలి. పెరుగులో మిగతా పదార్థాలన్నీ కలపాలి. పాలకూర పేస్ట్ ను కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఉడికించి చల్లార్చి కలపాలి. ఉల్లికాడలతో అలంకరించుకోవాలి.

మూలం : స్వాతి సపరివార పత్రిక 

0 Comments
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    June 2013
    May 2013

    Categories

    All
    చె న్నై సాంబార్
    రైతా
    రాగి సరిగ
    బూందీ రైతా
    ఆమ్లా రైతా
    లస్సీ విత్ ఫ్లేక్స్
    ఉసిరి సాంబార్
    ఉసిరి సాంబార్
    మిక్స్ వెజ్ పులుసు
    సొరకాయ రైతా
    టొమాటో కర్డ్ స్ల్యూ
    గుమ్మడి సాంబార్
    వరుత్తరాచ సాంబార్
    పచ్చిమామిడికాయ సాంబార్

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.