పన్నీర్ ముక్కలు - 2 కప్పులు
నూనె - టేబుల్ స్పూన్
కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్
నిమ్మరసం - టీస్పూన్
బేబీ పొటాటోలు - పది (ఉడికించి పొట్టు తీయాలి)
ఉడికించిన బఠానీలు - కప్పు
అల్లం తురుము - టీస్పూన్
పచ్చిమిర్చి తురుము - టీస్పూన్
మిరియాల పొడి - అరటీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కారప్పూస - సరిపడా
ఆమ్ చూర్ - 2 టీస్పూన్లు
తయారుచేసే పద్ధతి :
- బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. తరువాత పన్నీర్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసి మరో నిమిషం వేయించాలి. ఇప్పుడు ఆమ్ చూర్, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర, కాస్త కారప్పూస చల్లి అందిస్తే సరి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం