మైదా పిండి - పావుకిలో
స్టఫింగ్ కోసం:
పన్నీర్ తురుము - ముప్పావు కప్పు
ఉల్లికాడల తురుము - పావు కప్పు
చిల్లీగార్లిక్ సాస్ - టేబుల్ స్పూన్
చీజ్ - పావుకప్పు
నూనె - 2 టీస్పూన్లు
ఉప్పు - సరిపడా
తయారుచేసే పద్ధతి :
- మైదాలో తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి పూరీ పిండిలా కలుపుకొని పది పురీల్లాగా చేసుకోవాలి.
- మరో టేబుల్ స్పూన్ మైదా పిండిలో టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి.
- పాన్ లో నూనె వేసి ఉల్లికాడల తురుము వేసి వేయించాలి. తరువాత స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలపాలి. రెండు నిముషాలు ఉడికిన తర్వాత పది భాగాలుగా చేయాలి.
- ఒక్కో పూరీలో ఒక్కో భాగంగా చేసిన స్టఫ్ పెట్టి ఒకవైపు నుంచి చాపలా చుట్టుకొని రావాలి. తరువాత రెండు చివరలా అంచుల్ని మూసేసి ఊడిపోకుండా మైదా పేస్ట్ తో అతికించాలి. ఇలాగే అన్ని పూరీలను సిగార్స్ లా చుట్టి రెండు వైపులా అంచులు మూసేసి నూనెలో వేయించి తీయాలి. ఎక్కువగా ఉన్న నూనెను బ్లాటింగ్ పేపర్ తో అద్దాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం