గోధుమ పిండి - కప్పు
బియ్యప్పిండి - అరకప్పు
సోయా పిండి - అరకప్పు
అవిసె పిండి - టీస్పూన్
రాగి పిండి - టీస్పూన్
కసూరి మెంతి - అరకప్పు
కరివేపాకు - పది రెమ్మలు
కారం - టీస్పూన్
పసుపు - టీస్పూన్
దాల్చిన చెక్క పొడి - టీస్పూన్
మసాలా పొడి - పావుటీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - టీస్పూన్
తయారుచేసే పద్ధతి:
- ఓ గిన్నెలో పిండిలన్నింటిని వేసి కలపాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర, కసూరిమెంతి, కారం... అన్ని వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మెత్తని ముద్దలా పిండిని కలపాలి. పిండి ముద్దను చిన్న ఉండలుగా చేసి పాలిథిన్ కవర్ మీద నెయ్యి లేదా నూనె అద్దుతూ చెక్కల్లా వత్తాలి.
- స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి పెనం మొత్తం పరుచుకునేటట్లు నూనె రాయాలి. ఇప్పుడు వత్తిన చెక్కల్ని పెనం మీద పరిచినట్లుగా వేసి తక్కువ మంట మీద కాల్చాలి. అవసరమైతే మధ్యలో రెండు లేక మూడు చుక్కల నూనె వెయ్యాలి. రెండు నిమిషాల తర్వాత అన్నీ తిప్పి నూనె వేస్తూ కరకరలాడే వరకు కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం