
బ్రెడ్ స్లైసెస్ - ఎనిమిది (పెద్దవి)
క్యారెట్ తురుము - కప్పు
పన్నీర్ తురుము - పావు కప్పు
మిరియాల పొడి - పావు చెంచ
ఉప్పు - తగినంత
ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ
పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె - వేయించడానికి సరిపడా
వెన్న - చెంచ
కారం - అరచెంచ
తయారుచేసే పద్ధతి :
ముందుగా బాణలిలో వెన్న కరిగించి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. అందులోనే పన్నీర్ తురుము కూడా వేసి రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి కలిపి దించేయాలి.
ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచుల్ని కత్తిరించి మధ్యలో క్యారెట్ మిశ్రమాన్ని రెండు చెంచాలు ఉంచి రోల్ లా చుట్టేయాలి. క్యారెట్ మిశ్రమం బయటకు రాకుండా ఉండేందుకు చేయి తడి చేసుకొని అంచుల్ని మూసేయాలి. ఇలా మిగిలిన స్లైసుల్ని కూడా చేసుకొని కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించుకొని తీసేస్తే నోరూరించే బ్రెడ్ రోల్స్ సిద్దం.
మూలం : ఈనాడు వసుంధర