బేబీకార్న్ పొత్తులు-8,
శనగపిండి-అరకప్పు
బియ్యప్పిండి-రెండు టీ స్పూన్లు,
వంటసోడా, పసుపు-చిటికెడు
ఉప్పు-తగినంత,
నూనె-వేయించడానికి సరిపడినంత
పచ్చిమిరపకాయలు-రెండు,
అల్లంముక్క-చిన్నది
వెల్లుల్లి రెబ్బలు-రెండు,
కొత్తిమీర-కొంచెం
వీటన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి.
తయారుచేసే విధానం :
- శనగపిండిలో బియ్యప్పిండిని కలపాలి. తరువాత ఉప్పు, వంటసోడా, మసాలాముద్ద వేయాలి. తగినన్ని నీళ్లు పోసి మిరప లేదా అరటి బజ్జీ పిండిలాగ కలుపుకోవాలి.
- బేబీకార్న్ ఒక్కొక్కటి రెండు లేదా మూడు ముక్కలు కోయాలి. ఆ ముక్కల్ని పిండిలో బాగా ముంచి తీసి నూనెలో ఎర్రగా వేయించాలి. ఈ బేబీ కార్న్ బజ్జీలను టమాటాసాస్ లేదా చిల్లీసాస్తో తింటే బాగుంటాయి.