ఓట్స్ – 1/4 కప్పు
బ్రెడ్ స్లైసులు – 6
నెయ్యి – 1 టీస్పూన్
గడ్డ పెరుగు – 1 కప్పు
క్యాప్సికమ్ తురుము – 2 టీ స్పూన్
క్యారట్ తురుము – 3 టీ స్పూన్
వేయించిన జీలకర్ర – చిటికెడు
టమాటా సాస్ – 1 టీ స్పూన్
కొత్తిమిర – కొద్దిగా
మిరియాల పొడి – చిటికెడు
ఉప్పు – తగినంత
వెన్న – 4 టీ స్పూన్
తయారుచేసే పద్ధతి :
- పెరుగును ఒక బట్టలో కట్టి నీరంతా పోయేవరకు వ్రేలాడదీయాలి.
- ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి ఓట్స్‌ని దోరగా వేయించుకోవాలి.
- ఒక గిన్నెలో వేయించిన ఓట్స్, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తురుము, పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమిర వేసి బాగా కలియబెట్టాలి.
- బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి పలుచగా వెన్న రాయాలి.
- దీనిమీద చెంచాడు పెరుగు, కూరగాయల మిశ్రమాన్ని పరిచి ఇంకో వెన్న రాసిన బ్రెడ్ స్లైసుతో మూసేసి వేడి పెనం మీద కొద్దిగా వెన్న వేసుకుంటూ రెండు వైపులా బంగారురంగు వచ్చేవరకు కాల్చుకోవాలి లేదా ఓవెన్లో కూడా కాల్చుకోవచ్చు..