
బ్రెడ్ స్లైసులు - 6
అరటిపండు - ఒకటి
వెన్న - 2 టీ.స్పూ.
చాక్లెట్ తురుము - 3 టీ.స్పూ.
పంచదార - 2 టీ.స్పూ.
ఇలా చేయాలి
అరటిపండు తొక్కను తీసివేసి సన్నగా స్లైసుల్లా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసులకు పైన పలుచగా వెన్న రాయాలి. ఒక స్లైసు మీద అరటిపండు స్లైసును అమర్చి దానిపైన పంచదార, చాక్లెట్ తురుము చల్లాలి. దానిపైన వెన్న రాసిన మరో స్లైసు పెట్టి అదమాలి.
ఇలా అన్నీ చేసుకుని సాండ్విచ్ టోస్టర్ లేదా పెనం మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. చాలా తొందరగా పిల్లలు ఇష్టపడేట్టుగా ఈ సాండ్విచ్ తయారుచేయొచ్చు.