telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ఆలూ బోండాలు

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు -          అర కిలో 
నూనె               -            వేయించడానికి సరిపడా 
సెనగ పిండి        -            అరకిలో 
బియ్యప్పిండి     -              కప్పు 
కొత్తిమీర           -              కొద్దిగా 
పూదీన తురుము -          కొద్దిగా 
కరివేపాకు తురుము -       కొద్దిగా 
అల్లం వెల్లుల్లి     -             2 టీస్పూన్లు 
ఉప్పు               -            రుచికి సరిపడా
జీలకర్ర              -             అర టీస్పూన్
పచ్చిమిర్చి         -             2 టీస్పూన్లు  
ఆవాలు             -              ఒక టీస్పూన్ 
కేసరి ఫుడ్ కలర్ -              పావుటీస్పూన్
వంట సోడా        -             పావుటీస్పూన్ 
నిమ్మరసం        -             అర టీస్పూన్

తయారుచేసే పద్ధతి:
  • బంగాళాదుంపలు ఉడికించి ఆరనివ్వాలి. తరువాత తోకకు తీసి బాగా చిదమాలి. 
  • బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తురుము వేసి దోరగా వేగనివ్వాలి. అందులో పసుపు, అల్లం, పచ్చిమిర్చి గుజ్జు వేసి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చిదిమిన బంగాళాదుంపలు వేసి ఉప్పు చల్లి కలుపుతూ పొడిపొడిగా వేగనివ్వాలి. అనంతరం కొత్తిమీర, పూదీన వేసి బాణలిను కిందకు దించి నిమ్మరసం కలపాలి. 
  • ఒక లోతైన గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, కేసరి రంగు, వంట సోడా, తగినంత ఉప్పు వేసి నీరు పోసి, గట్టి పెరుగులా పిండిని కలిపి ఉంచాలి.
  • ఆలుగడ్డల మిశ్రమాన్ని లడ్డులంత సైజ్ లో ముద్దలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ముద్దలుగా చేసిన ఆలుగడ్డల మిశ్రమాన్ని పిండిలో ముంచి నూనె లో వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఆలూ బోండాలు రెడీ. ఇవి పచ్చిమిర్చి పచ్చడి, టమాటో సాస్ తో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

మూలం : సాక్షి దినపత్రిక  

0 Comments

పెనం చెక్కలు 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి     -            కప్పు 
బియ్యప్పిండి      -             అరకప్పు 
సోయా పిండి      -              అరకప్పు 
అవిసె పిండి       -             టీస్పూన్ 
రాగి పిండి         -              టీస్పూన్
కసూరి మెంతి    -              అరకప్పు 
కరివేపాకు         -             పది రెమ్మలు 
కారం               -              టీస్పూన్ 
పసుపు            -              టీస్పూన్ 
దాల్చిన చెక్క పొడి -           టీస్పూన్ 
మసాలా పొడి       -             పావుటీస్పూన్ 
ఇంగువ             -             చిటికెడు 
ఉప్పు               -            రుచికి సరిపడా
జీలకర్ర              -             టీస్పూన్ 

తయారుచేసే పద్ధతి:
  • ఓ గిన్నెలో పిండిలన్నింటిని వేసి కలపాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర, కసూరిమెంతి, కారం... అన్ని వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మెత్తని ముద్దలా పిండిని కలపాలి. పిండి ముద్దను చిన్న ఉండలుగా చేసి పాలిథిన్ కవర్ మీద నెయ్యి లేదా నూనె అద్దుతూ చెక్కల్లా వత్తాలి.
  • స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి పెనం మొత్తం పరుచుకునేటట్లు నూనె రాయాలి. ఇప్పుడు వత్తిన చెక్కల్ని పెనం మీద పరిచినట్లుగా వేసి తక్కువ మంట మీద కాల్చాలి. అవసరమైతే మధ్యలో రెండు లేక మూడు చుక్కల నూనె వెయ్యాలి. రెండు నిమిషాల తర్వాత అన్నీ తిప్పి నూనె వేస్తూ కరకరలాడే వరకు కాల్చి తీయాలి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

రగ్ డా పట్టి 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
తెల్ల బఠానీలు        -         కప్పు 
ఉల్లిపాయ            -          ఒకటి 
పచ్చిమిర్చి ముద్ద  -         టీస్పూన్ 
అల్లం వెల్లుల్లి ముద్ద -        అరటీస్పూన్ 
ఆవాలు                -       అరటీస్పూన్ 
కరివేపాకు             -        రెండు రెమ్మలు 
ఇంగువ               -          చిటికెడు 
కారం                  -           టీస్పూన్ 
బ్లాక్ సాల్ట్            -            టీస్పూన్ 
జీలకర్ర పొడి         -            అరటీస్పూన్ 
ధనియాల పొడి     -            అరటీస్పూన్ 
మిరియాల పొడి    -            అరటీస్పూన్ 
పసుపు               -          అరటీస్పూన్ 
గరం మసాలా       -            టీస్పూన్ 


పట్టీల (బిళ్ళల) కోసం :
బంగాళాదుంపలు  -          5
పచ్చిమిర్చి          -          2
అల్లం తురుము    -          టీస్పూన్ 
నూనె                -           టేబుల్ స్పూన్ 
కార్న్ ఫ్లోర్          -           టీస్పూన్
బ్రెడ్ పొడి            -           2 టేబుల్ స్పూన్లు
పసుపు             -           పావుటీస్పూన్ 
ఉప్పు               -            రుచికి సరిపడా
నూనె               -            వేయించడానికి సరిపడా


అలంకరించేందుకు 
కారప్పూస         -            కప్పు 
చాట్ మసాలా      -           టీస్పూన్
ఉల్లిపాయలు        -           రెండు 
కొత్తిమీర తురుము -          అరకప్పు 
చింతపండు చట్నీ  -          అరకప్పు 

తయారుచేసే పద్ధతి:
  • బఠానీలను సుమారు పది గంటలు నానబెట్టాలి. వీటిలో ఐదు కప్పుల నీటిని పోసి ఉప్పు, చిటికెడు సోడా వేసి ఫ్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మూడు లేక నాలుగు నిముషాలు వేయించాలి. ఉల్లి ముక్కలు వేగాక ఉడికించిన బఠానీలు వేసి వేయించాలి. తరువాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
  • ఇప్పుడు బాణలిలోని సగం బఠానీలు పక్కకు తీసి మెత్తగా మెదిపి మళ్లీ అందులోనే వేయాలి. తరువాత కప్పు నీళ్ళు పోసి బాగా కలిపి పది నిముషాలు ఉడికించి పక్కన ఉంచాలి.
  • పట్టీల తయారి :
  • బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం తురుము, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బ్రెడ్ పొడి, పసుపు వేసి కలపాలి.
  • మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకొని గుండ్రని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండని తీసుకొని వేళ్ళతో అర అంగుళం మందంలో వత్తి చిన్న బిళ్ళల్లా చేయాలి. 
  • ఇప్పుడు వీటిని నాన్ స్టిక్ పాన్ లో వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీయాలి.
  • ప్లేటులో రెండు పట్టీలు పెట్టి పైన రెండు టేబుల్ స్పూన్ల రగ్ డా వేసి, ఆ పైన చింతపండు చట్నీ, ఉల్లి ముక్కలు, కొత్తిమీర తురుము, కారప్పూస వేసి, చాట్ మసాలా పొడి చల్లి వేడిగా అందించాలి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

బఠానీ చాట్ 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఎండు బఠానీలు     -         2 కప్పులు 
బేకింగ్ సోడా          -         అరటీస్పూన్ 
ఇంగువ               -          చిటికెడు 
చింతపండు చట్నీ  -          కొద్దిగా
గ్రీన్ చట్నీ            -          కొద్దిగా 
బంగాళాదుంపలు  -          రెండు 
ఉల్లిపాయ            -          ఒకటి 
టొమాటో             -          ఒకటి
కీరా                    -          ఒకటి
నిమ్మరసం           -           కొద్దిగా 
ఉప్పు                 -          రుచికి సరిపడా 
కారం                  -           టీస్పూన్ 
గరం మసాలా       -            టీస్పూన్ 
బ్లాక్ సాల్ట్            -            టీస్పూన్ 
జీలకర్ర పొడి         -            అరటీస్పూన్ 

తయారుచేసే పద్ధతి:
  • ఓ గిన్నెలో బఠానీలు వేసి మునిగే వరకు నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టాలి.
  • ఉదయాన్నే బఠానీలను ఫ్రెషర్ కుక్కర్ లో వేసి సోడా, ఉప్పు, ఇంగువ వేసి ఉడికించాలి. తరువాత నీళ్ళు వంపేసి బఠానీలను ఓ గిన్నెలో వేయాలి.
  • బంగాళాదుంపలను ఉడికించి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి.
  • ఉల్లిపాయ, టొమాటో, కీరా దోస అన్నింటిని చిన్న ముక్కలుగా కోయాలి. వీటికి బంగాళాదుంపలు కూడా చేర్చి కలపాలి.
  • ఇప్పుడు ఓ ప్లేటులో రెండు టేబుల్ స్పూన్ల బఠానీలు వేసి వాటి మీద కొద్దిగా ఉల్లిముక్కల మిశ్రమం వేసి గరం మసాలా, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి చల్లాలి. వీటిమీద కొద్దిగా చింతపండు చట్నీ, గ్రీన్ చట్నీలు వేసి నిమ్మరసం పిండి అందించాలి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

దాల్ కచోరి 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
మినపప్పు         -          ముప్పావు కప్పు 
గోధుమ పిండి     -          4 కప్పులు
పచ్చిమిర్చి        -           ఒకటి 
ఉప్పు               -            అరటీస్పూన్ 
సోంపు              -            టేబుల్ స్పూన్ 
ధనియాలు        -            టీస్పూన్ 
కారం                -          అరటీస్పూన్ 
                                                                   ఇంగువ             -          పావుటీస్పూన్ 
                                                                   నూనె                -          వేయించడానికి సరిపడా 

తయారుచేసే పద్ధతి:
  • మినపప్పును రాత్రే నానబెట్టుకోవాలి.
  • గోధుమపిండిలో తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకొని తడి బట్ట వేసి అరగంట సేపు నాననివ్వాలి.
  • ఇప్పుడు మినపప్పులో ఉప్పు, కారం, ధనియాలు, సోంపు వేసి మెత్తగా రుబ్బాలి.
  • గోధుమపిండిని నిమ్మకాయంత ముద్ద తీసుకొని చిన్న పూరీలా వత్తుకొని అందులో కాస్త పప్పు మిశ్రమాన్ని పెట్టి మూసేసి కచోరీలా వత్తాలి.
  • ఇలాగే అన్నీ చేసుకొని కాగిన నూనెలో వేయించి తీసి చట్నీతో వడ్డించాలి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

పన్నీర్ పకోడీ 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్              -         పావుకిలో 
సెనగ పిండి        -         కప్పు 
ఉప్పు               -          రుచికి సరిపడా
కారం                -          అరటీస్పూన్ 
మంచి నీళ్ళు      -          అరకప్పు 
నూనె                -          వేయించడానికి సరిపడా 


తయారుచేసే పద్ధతి:
  • సెనగ పిండిలో ఉప్పు, కారం వేసి, కాసిని నీళ్ళు పోసి చిక్కగా కలిపి పక్కన పెట్టాలి.
  • పన్నీర్ ను కావలసిన సైజ్ లో ముక్కలుగా కోయాలి.
  • ఇప్పుడు పన్నీర్ ముక్కలను సెనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చాక తీయాలి. వీటిని బ్లాటింగ్ పేపర్ మీద వేసి నూనె అద్ది పూదీన చట్నీ తో తింటే చాలా బాగుంటుంది. 

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

మామిడికాయ పకోడీ 

6/4/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
మామిడికాయ తురుము -     అరకప్పు 
బంగాళదుంపల తురుము -    పావుకప్పు
ఉల్లి ముక్కలు      -             పావుకప్పు 
సెనగ పిండి          -             అరకప్పు 
అల్లం-పచ్చిమిర్చి ముద్ద -      2 టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర తురుము  -            2 టేబుల్ స్పూన్లు 
ఉప్పు                 -             రుచికి సరిపడా
నూనె                 -              వేయించడానికి సరిపడా 



తయారుచేసే పద్ధతి :
  • ఓ గిన్నెలో అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి పకోడీ పిండిలా కలపి ఓ పది నిముషాలు పక్కన ఉంచాలి.
  • బాణలిలో నూనె వేసి బాగా వేడి అయ్యాక పిండిని పకోడీల్లా వేసి తీయాలి. వీటిని వేడిగా సాస్ తో తింటే చాల బాగుంటాయి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం 

0 Comments
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    రగ్ డా పట్టి
    ఎగ్ కట్ లెట్స్
    ఎగ్ చాట్
    ఎగ్ బజ్జీ
    ఆలూ టిక్కా
    ఎగ్ బాల్స్
    ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్
    ఎగ్ బుర్జీ సాండ్‌విచ్
    ఆలూ పన్నీర్ చాట్
    ఎగ్ మంచూరియా
    బేల్ పూరి
    పానీ పూరి
    లెహ్ సుని టిక్కి
    ఫిష్ పకోడి
    రైస్ పకోడి
    దాల్ కచోరి
    గోబీ పకోడీ
    చాకో బనానా సాండ్ విచ్
    మీల్ మేకర్ మంచూరియా
    రాగి పిండి బిస్కెట్స్‌
    కీమా టిక్కీ
    జాలీ మిర్చి
    గోబీ మంచురియా
    కబాబ్
    సమోసా రగడ
    బఠానీ చాట్
    మూంగ్ దాల్
    సాండ్ విచ్ డోక్లా
    పాలక్ పకోడి
    టమోటా బజ్జీ
    ఓట్స్ శాండ్ విచ్
    మొలకల ఫ్రూట్ భేల్
    పనీర్ పాలకూర బాల్స్
    బ్రెడ్ పాన్ కేక్
    గ్రీన్ పీస్ పూరీ
    గ్రీన్ పీస్ ధోక్లా
    బ్రెడ్ బజ్జీ
    పాలకూర పకోడీ
    యాపిల్ బజ్జీ
    బ్రెడ్ సమోసా
    సేమియా పకోడీ
    సొరకాయ పకోడి
    దోసకాయ బజ్జీ
    టొమాటో బోండా
    గుత్తి వంకాయ బజ్జీ
    అటుకుల టిక్కి
    పొటాటో బైట్స్
    తందూరీ టిక్కా
    స్వీట్ కార్న్
    బ్రెడ్ పిజ్జా
    కార్న్ టిక్కి
    సేమ్యా టిక్కి
    బ్రెడ్ స్వీట్ కార్న్ బాల్స్
    చిల్లీ పన్నీర్
    బ్రెడ్ పన్నీర్ రోల్
    బ్రెడ్ మంచురియా
    సకినాలు
    చెక్కలు
    కట్లెట్
    పన్నీర్ బజ్జీ
    పన్నీర్ పకోడీ
    దొండకాయ బజ్జీ
    పన్నీర్ పకోడి
    హరియాలి టిక్కి
    పన్నీర్ బాల్స్
    స్టఫ్డ్ మిర్చి బజ్జీ
    నర్గీసీ కబాబ్స్
    పన్నీర్ సిగార్స్
    ప్రాన్స్
    నూడుల్స్ ప్రై
    క్యాబేజీ బోండా
    పానీపూరీ మసాలా మురుకులు
    చాక్లెట్ ఫ్రైడ్ డిమ్సమ్...
    అమెరికన్ చాప్‌సూయి
    సర్వపిండి
    మామిడికాయ పకోడీ
    మొక్కజొన్న కబాబ్
    మీల్‌మేకర్ పకోడీ
    మొక్కజొన్న కట్లెట్
    జాక్‌ఫ్రూట్‌ మసాలా బాల్స్‌
    3314e5f8bf
    34955b7e6b
    4331cfd919
    మొక్కజొన్నకర్రీ 65
    F7c5f54312

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.