telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

చాకో బనానా సాండ్ విచ్

11/12/2013

0 Comments

 
Picture
కావలసినవి
బ్రెడ్ స్లైసులు - 6
అరటిపండు - ఒకటి
వెన్న - 2 టీ.స్పూ.
చాక్లెట్ తురుము - 3 టీ.స్పూ.
పంచదార - 2 టీ.స్పూ.

ఇలా చేయాలి
అరటిపండు తొక్కను తీసివేసి సన్నగా స్లైసుల్లా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసులకు పైన పలుచగా వెన్న రాయాలి. ఒక స్లైసు మీద అరటిపండు స్లైసును అమర్చి దానిపైన పంచదార, చాక్లెట్ తురుము చల్లాలి. దానిపైన వెన్న రాసిన మరో స్లైసు పెట్టి అదమాలి.
ఇలా అన్నీ చేసుకుని సాండ్‌విచ్ టోస్టర్ లేదా పెనం మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. చాలా తొందరగా పిల్లలు ఇష్టపడేట్టుగా ఈ సాండ్‌విచ్ తయారుచేయొచ్చు.


0 Comments

మీల్ మేకర్ మంచూరియా

11/9/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
మీల్‌మేకర్ - 200 గ్రాములు,

ఉల్లిపాయలు - 10(గా,
క్యారెట్ -10(గా,
బఠాణీలు - 10(గా,
అల్లం వెల్లుల్లి - 10(గా,
కొత్తిమీర - ఒక కట్ట,
పచ్చిమిరపకాయలు-10,
కార్న్‌ఫ్లోర్ పౌడర్ - 2 స్పూన్లు,
అజినోమోటో - ఒక స్పూను,
సోయా సాస్ - నాలుగు స్పూన్లు,
వెనిగర్ - నాలుగు స్పూన్లు,
నూనె - సరిపడా,
ఉప్పు -రుచికి సరిపడా,
మైదా - రెండు స్పూన్లు,
రెడ్ కలర్ - ఒక స్పూన్

తయారు చేసేవిధానం :
  • ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో నానబెట్టుకుని పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి.
  • అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలను వేసి కొద్దిగా ఉడికించుకోవాలి.
  • అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి. వెనిగర్‌ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేయించుకోవాలి.
  • మరొక పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించుకున్న మంచూరియాను కలపాలి. కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసి దింపుకోవా లి. మీల్ మేకర్ మంచూరియా రెడీ!

0 Comments

ప్రాన్స్, నూడుల్స్ ప్రై

11/7/2013

0 Comments

 
Picture
కావలసినవి:
నూడుల్స్ - 250 గ్రాములు
చికెన్ - 100 గ్రాములు
ప్రాన్స్ - 100 గ్రాములు
ఉల్లిపొరక - 1 కప్పు
వెల్లుల్లి - 4
నూనె - 3 టీ స్పూన్స్
సోయా సాస్ - 2 టీ స్పూన్స్
ఆయిస్టర్ సాస్ - 1 టీ స్పూన్
చక్కెర - 1 టీ స్పూన్
మిరియాలపొడి - 1/4 టీ స్పూన్
ఉప్పు - తగినంత
పండు మిర్చి - 2

తయారుచేసే పద్ధతి
ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు మరిగించి నూడుల్స్ వేయాలి. అవి ముప్పావు వంతు  ఉడికిన తర్వాత తీసి జల్లెట్లో వేసి వెంటనే దాని మీద చల్లటి నీళ్లు పోయాలి. దానివల్ల  నూడుల్స్ ఇంకా ఉడికి మెత్తబడకుండా ఉంటాయి. చికెన్, రొయ్యలు కూడా సగం ఉడికించి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి. తర్వాత ఉడికించి చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, రొయ్యలు వేసి మరో రెండు నిమిషాలు పెద్దమంట మీద వేయించాలి. ఇందులో సోయా సాస్, ఆయిస్టర్ సాస్ వేయాలి. కొంచం వేగిన తర్వాత నూడుల్స్ వేసి కలపాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి,  పండు మిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపొరక వేసి రెండు నిమిషాలు వేపి దింపేయాలి.


0 Comments

పన్నీర్ బజ్జీ

11/6/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :

శనగపిండి : కప్పు,
బియ్యప్పిండి : 2 స్పూన్లు,
పనీర్‌ : 200 గ్రాములు,
జీలకర్ర : స్పూన్‌,
పచ్చిమిర్చి : 3-4,
అల్లం తరుగు : 2స్పూన్‌,
ఉల్లితరుగు : 1/2కప్పు,
కొత్తిమీర : ఒక కట్ట,
పుదీనా : ఒక కట్ట,
ఉప్పు, కారం, నూనె : తగినంత.

తయారు చేయు విధానం :


ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు కూడా వేయాలి. ఇవి వేగాక కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి మరో నిమిషం వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చే స్తే గ్రీన్‌ చట్నీ తయారయినట్టు. దీనిని పక్కనుంచుకోవాలి. తర్వాత పనీర్‌ను చిన్న చిన్న స్లైసెస్‌గా చేసుకుని, మధ్యలో ఈ గ్రీన్‌ చట్నీ పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. శనగపిండిలో బియ్యప్పిండి, ఉప్పు, కారం, నీరు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ముందుగా స్టఫ్‌ చేసిన పనీర్‌ ముక్కలను శనగపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్‌ చేస్తే బాగుంటాయి.


0 Comments

మీల్‌మేకర్ పకోడీ

11/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
మీల్‌మేకర్ - 10ఱగా,
కార్న్ ఫ్లోర్ - 1/2 కప్పు,
బియ్యప్పిండి - 1/2 కప్పు,
శనగపిండి - 1/2 కప్పు,
ఉల్లిపాయలు - 2,
నిమ్మకాయ - 1,
కొత్తిమీర - 1 కట్ట,
కరివేపాకు - కొద్దిగా,
నూనె - సరిపడ,
ఉప్పు, కారం - తగినంత,
అల్లం పేస్ట్ - 2 స్పూన్లు


తయారు చేసేవిధానం :

  • ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లుపోసి మరిగించుకోవాలి. మరిగించిన నీళ్లలో మీల్‌మేకర్ వేసి పక్కన పెట్టుకోవాలి.
  • 10 నిమిషాల తరువాత నీళ్లలోంచి మీల్‌మేకర్‌ని తీసి వేరే పాత్రలో మెత్తగా చేయాలి.
  • మెత్తగా చేసిన మీల్‌మేకర్‌లో కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
  • కడాయిలో నూనె కాగిన తరువాత పకోడీలు వేసుకోవాలి. అంతే కర కరలాడే మీల్‌మేకర్ పకోడీ రెడీ. ఇందులోకి టొమేటో సాస్ చాలా బాగుంటుంది!

0 Comments

అమెరికన్ చాప్‌సూయి

11/4/2013

0 Comments

 
Picture
  తయారు చేయడానికి కావలసినవి:
నూడుల్స్ - 200 gms
నూనె - 2 టేబిల్ స్పూన్స్
వెల్లుల్లి  - 5
ఉల్లిపాయ - 1
క్యాబేజీ తరుగు - 2 కప్పులు
క్యారట్ తరుగు - 1 కప్పు
కాప్సికమ్ తరుగు - 1/2 కప్పు
బీన్స్ తరుగు - 1/4 కప్పు
అజినొమొటొ - చిటికెడు
టమాటా కెచప్ - 4 టేబిల్ స్పూన్స్
సోయా సాస్ - 1 టేబిల్ స్పూన్
వెనిగర్ - 1 టేబిల్ స్పూన్
పంచదార - 2 టేబిల్ స్పూన్స్
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - 1/2 టేబిల్ స్పూన్
కార్న్‌ఫ్లోర్ - 2 టేబిల్ స్పూన్స్

ఒక గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు మరిగించి నూడుల్స్ వేయాలి. అవి సగం ఉడికిన తర్వాత తీసి జల్లెట్లో వేయాలి. నీరంతా పోయాక పల్చటి బట్ట లేదా పేపర్ మీద వెడల్పుగా వేయాలి. నూడుల్స్ పూర్తిగా ఆరిన తర్వాత బాణలిలో నూనె వేడి చేసి క్రిస్పీగా అయ్యేవరకు వేయించి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని కాస్త చేత్తో నలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, పంచదార, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి  రెండు కప్పుల నీళ్లు, కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి ప్యాన్ లేదా బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి కొద్ది సేపు వేయించాలి. ఇందులో తరిగిన క్యాబేజీ, క్యారట్, కాప్సికమ్, బీన్స్, వేసి మరి కొద్దిసేపు వేయించి అజినొమొటొ వేసి కలపాలి. ఇందులో సాస్ మిశ్రమం వేసి ఉడికించి వేయించి పెట్టుకున్న నూడుల్స్ సగం వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత దింపేసి మిగిలిన నూడుల్స్ వేసి సర్వ్ చేయాలి.

0 Comments

టొమాటో బోండా

11/3/2013

0 Comments

 
Picture
కావలసినవి:
 చిన్న టొమాటోలు - 250 గ్రా;

బంగాళదుంపలు - 3;
పచ్చిమిర్చి - 3 (సన్నగా కట్ చేయాలి); 
కొత్తిమీర - చిన్నకట్ట; 
శనగపిండి - కప్పు;
కారం - టీ స్పూన్;
ధనియాల పొడి - టీస్పూన్;
వంటసోడా - చిటికెడు;
ఉప్పు - తగినంత;
నూనె - వేయించడానికి తగినంత.
 
 తయారి:
 బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి పొడిపొడిగా మెదిపి గిన్నెలో వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి. గట్టిగా ఉన్న టొమాటోలను పైన కొద్దిగా కట్ చేసి, లోపలి గుజ్జంతా తీసేయాలి. ఉడికించిన బంగాళదుంప మిశ్రమం కూరి, మూత పెట్టి, టూత్ పిక్‌తో విడిపోకుండా గుచ్చి పెట్టాలి. ఒక గిన్నెలో శనగపిండి, కారం, ధనియాల పొడి, ఉప్పు, వంటసోడా, తగినంత నీరు వేసి బజ్జీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. టొమాటోలను శనగపిండి మిశ్రమంలో మొత్తం పిండి అంటుకునేలా ముంచి, వేడినూనెలో వేసి, అన్నివైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత  ఒక్కో బోండాను సగానికి కట్ చేయాలి. మూడు రంగులతో ఆకర్షణీయంగా ఉంంది.


0 Comments

గ్రీన్ పీస్ ధోక్లా

11/1/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :

మినపపప్పు - అర కప్పు,

శనగపప్పు - అర కప్పు,
బియ్యం - అర కప్పు,
బఠాణీలు - ఒక కప్పు,
అల్లం - చిన్న ముక్క,

పచ్చిమిరపకాయలు - 3,
ఇంగువ - అర టీ స్పూన్,
బేకింగ్ సోడా - పావు టీ స్పూన్,
ఆవాలు - అర టీ స్పూన్,
కొబ్బరితురుము - ఒక స్పూన్,
నువ్వులు - 2 టీ స్పూన్స్,
నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
బియ్యం, శనగపప్పు, మినపప్పులను కడిగి విడివిడిగా నానబెట్టాలి. తర్వాత రోజు పొద్దున్నే అన్నింట్లో నీటిని వడగట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో వాటితోపాటు అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, బఠాణీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మూతపెట్టి 7 నుంచి 8గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీంట్లో బేకింగ్ సోడా, ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి ఇడ్లీ మిశ్రమంలా కలుపుకోవాలి. ధోక్లా ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని వేసి కుక్కర్‌లో ఆవిరి మీద ఉడికించాలి. పదిహేను నిమిషాల్లో ఉడికిపోతాయి. వాటిని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. దాన్ని చిన్నగా మనకు నచ్చిన రీతిలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు వేయించి ధోక్లాల మీద వేయాలి. కొబ్బరితురుముతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

0 Comments

గ్రీన్ పీస్ పూరీ

10/31/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :

గోధుమపిండి - ఒక కప్పు,

మైదా - ఒక కప్పు,
బఠాణీలు - అర కప్పు,

అల్లం పేస్ట్ - పావు టీ స్పూన్,
పచ్చిమిరపకాయలు - 2,
గరం మసాలా పౌడర్ - పావు టీ స్పూన్,
జీలకర్ర - పావు టీ స్పూన్,

నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
బఠాణీల్లో కొన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. నీళ్ళని వడకట్టి దాంట్లో అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా పౌడర్, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూరీల కోసం చిన్న ముద్దలుగా చేయాలి. ఒక్కో దాన్ని తీసుకొని గుండ్రంగా వత్తాలి. దీంట్లో బఠాణీ మిశ్రమాన్ని వేసి మడిచి మళ్లీ పూరీల్లా చేసుకోవాలి. ఇలా అన్ని చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. వేరే కూరలేకుండా ఈ పూరీలనే లాగించేయొచ్చు.

0 Comments

పానీపూరీ మసాలా మురుకులు

10/30/2013

0 Comments

 
Picture
కావలసినవి
బియ్యం పిండి - 3  కప్పులు
పుట్నాల పప్పు పొడి -  1 కప్పు
వాము - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
పానీపురి మసాలా  పొడి:
పుదీనా, కొత్తిమీర -  1/2 కప్పు
పచ్చిమిర్చి - 3
ఆంచూర్ పొడి - 1  టీస్పూ.
జీలకర్ర పొడి - 1/2  టీ.స్పూ.
చాట్ మసాలా పొడి -  1/2 టీ.స్పూ.
నల్ల ఉప్పు - 1/4  టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి

ఇలా చేయాలి
  • పానీపురి మసాలా కోసం  సన్నగా తరిగిన  పుదీనా, కొత్తిమీర,  పచ్చి మిర్చి, నల్ల  ఉప్పు, జీలకర్ర పొడి,  చాట్ మసాలా పొడి,  ఆంచూర్ పొడి కలిపి  మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి.
  • ఒక గినెనలో బియ్యం పిండి,  పుట్నాల పప్పు పొడి,  ఉప్పు, వాము వేసి  కలపాలి.
  • ఇందులో  పానీపురి మసాలా  ముద్ద వేసి కలపాలి.
  • మరో గినె్నలో రెండు  కప్పుల నీళ్లు మరిగించి  రెండు చెంచాల నూనె  వేయాలి. ఈ నీళ్లను  పిండిలో వేసి కలిపి  మూత పెట్టి ఉంచాలి.
  • చల్లారిన తర్వాత బాగా  పిసికి పెట్టుకోవాలి.
  • మురుకుల గిద్దెలో  కొంచెం కొంచెం పిండి  ముద్ద పెట్టుకుని వేడి  నూనెలో  మురుకులు/జంతికల్లా  వత్తుకుని నిదానంగా  కాల్చుకోవాలి.

0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    రగ్ డా పట్టి
    ఎగ్ కట్ లెట్స్
    ఎగ్ చాట్
    ఎగ్ బజ్జీ
    ఆలూ టిక్కా
    ఎగ్ బాల్స్
    ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్
    ఎగ్ బుర్జీ సాండ్‌విచ్
    ఆలూ పన్నీర్ చాట్
    ఎగ్ మంచూరియా
    బేల్ పూరి
    పానీ పూరి
    లెహ్ సుని టిక్కి
    ఫిష్ పకోడి
    రైస్ పకోడి
    దాల్ కచోరి
    గోబీ పకోడీ
    చాకో బనానా సాండ్ విచ్
    మీల్ మేకర్ మంచూరియా
    రాగి పిండి బిస్కెట్స్‌
    కీమా టిక్కీ
    జాలీ మిర్చి
    గోబీ మంచురియా
    కబాబ్
    సమోసా రగడ
    బఠానీ చాట్
    మూంగ్ దాల్
    సాండ్ విచ్ డోక్లా
    పాలక్ పకోడి
    టమోటా బజ్జీ
    ఓట్స్ శాండ్ విచ్
    మొలకల ఫ్రూట్ భేల్
    పనీర్ పాలకూర బాల్స్
    బ్రెడ్ పాన్ కేక్
    గ్రీన్ పీస్ పూరీ
    గ్రీన్ పీస్ ధోక్లా
    బ్రెడ్ బజ్జీ
    పాలకూర పకోడీ
    యాపిల్ బజ్జీ
    బ్రెడ్ సమోసా
    సేమియా పకోడీ
    సొరకాయ పకోడి
    దోసకాయ బజ్జీ
    టొమాటో బోండా
    గుత్తి వంకాయ బజ్జీ
    అటుకుల టిక్కి
    పొటాటో బైట్స్
    తందూరీ టిక్కా
    స్వీట్ కార్న్
    బ్రెడ్ పిజ్జా
    కార్న్ టిక్కి
    సేమ్యా టిక్కి
    బ్రెడ్ స్వీట్ కార్న్ బాల్స్
    చిల్లీ పన్నీర్
    బ్రెడ్ పన్నీర్ రోల్
    బ్రెడ్ మంచురియా
    సకినాలు
    చెక్కలు
    కట్లెట్
    పన్నీర్ బజ్జీ
    పన్నీర్ పకోడీ
    దొండకాయ బజ్జీ
    పన్నీర్ పకోడి
    హరియాలి టిక్కి
    పన్నీర్ బాల్స్
    స్టఫ్డ్ మిర్చి బజ్జీ
    నర్గీసీ కబాబ్స్
    పన్నీర్ సిగార్స్
    ప్రాన్స్
    నూడుల్స్ ప్రై
    క్యాబేజీ బోండా
    పానీపూరీ మసాలా మురుకులు
    చాక్లెట్ ఫ్రైడ్ డిమ్సమ్...
    అమెరికన్ చాప్‌సూయి
    సర్వపిండి
    మామిడికాయ పకోడీ
    మొక్కజొన్న కబాబ్
    మీల్‌మేకర్ పకోడీ
    మొక్కజొన్న కట్లెట్
    జాక్‌ఫ్రూట్‌ మసాలా బాల్స్‌
    3314e5f8bf
    34955b7e6b
    4331cfd919
    మొక్కజొన్నకర్రీ 65
    F7c5f54312

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.