నువ్వులు : పావుకిలో
పచ్చిమిర్చి : తగినన్ని
బెల్లం : 50 గ్రా.
వంకాయలు : 2(ఉడికించినవి)
ఉల్లిగడ్డ : 1
నీళ్ళు : ఒక కప్పు
పోపు గింజలు : చెంచాడు
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
నువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి దోరగా వేయించాలి. పచ్చిమిర్చిని నూనెలో వేయించుకోవాలి. నువ్వులు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, బెల్లం కలిపి నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకొని మన ఇష్టాన్ని బట్టి ఉడికించిన వంకాయ లేదా ఉల్లిగడ్డను దీనిలో కలుపుకోవాలి. ఎంతో ప్రత్యేకమైన రుచితో ఉండే ఈ నువ్వుల చట్నీ నువ్వుల రొట్టెతో కానీ, నువ్వుల పులగంతో కానీ తింటే ఆ మజానే వేరు.
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం