మినప్పప్పు - కప్పు
పెరుగు - రెండు కప్పులు
మామిడికాయ తురుము - కప్పు
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - టీస్పూన్
మిరియాలు - టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
క్యారెట్ తురుము - టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తాలింపు గింజలు - టీస్పూన్
డ్రై ఫ్రూట్స్ - కొద్దిగా
తయారుచేసే పద్ధతి :
- మినప్పప్పును సుమారు 4 గంటల సేపు నానబెట్టాలి.
- మామిడి తురుములో సరిపడా ఉప్పు కలిపి, కొద్దిసేపు అలాగే ఉంచి, తరువాత మామిడి తురుములో ఉండే నీరంతా గట్టిగా పిండి తీసేయాలి.
- పెరుగులో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, క్యారెట్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- స్టవ్ మీద బాణలి ఉంచి అందులో రెండు చెంచాల నూనె పోసి కాగాక, తాలింపు గింజలను వేసి వేయించి, పెరుగులో కలపాలి.
- నానబెట్టుకున్న మినప్పప్పును శుభ్రంగా కడిగి గ్రైండర్ లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి.
- మామిడి తురుము, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మరో మారు రుబ్బాలి.
- బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక రుబ్బి ఉంచుకున్న పిండిని గారెల్లాగా వేయాలి.
- వేగిన గారెలను ఒక నిమిషం పాటు నీటిలో ఉంచి తీసి పెరుగులో వేయాలి. డ్రై ఫ్రూట్స్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే మామిడి ఆవడలు రుచిగా ఉంటాయి.
మూలం : సాక్షి దినపత్రిక