చపాతీలు-మూడు,
పనీర్ తురుము-మూడు చెంచాలు
ఉల్లిపాయ ముక్కలు-పావుకప్పు,
పచ్చిమిర్చి-రెండు
టమాటాలు-రెండు,
క్యాప్సికం ముక్కలు-రెండు చెంచాలు
నూనె-పావు కప్పు,
అల్లం, వెల్లుల్లి మిశ్రమం-అరచెంచా
కారం-కొద్దిగా,
ఉప్పు-రుచికి సరిపడా
పసుపు-చిటికెడు,
కొత్తిమీర తరుగు-రెండు చెంచాలు
కరివేపాకు-రెండు రెబ్బలు
తయారుచేసే విధానం
- బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పనీర్ తురుము, క్యాప్సికం ముక్కలు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక టమాట ముక్కలు, అల్లం, వెల్లుల్లి మిశ్రమం పసుపు సరిపడా ఉప్పు, కారం, కరివేపాకు చేర్చి వేయించి ముక్కల్ని మగ్గనివ్వాలి.
- చివరగా కొత్తిమీర వేసి దింపేస్తే సరిపోతుంది. ఈ కూరను చపాతీల్లో ఉంచి గుండ్రంగా చుట్టేయాలి. ఇలా చేసుకున్న వాటిని పెనంపై ఉంచి మరో చెంచా చొప్పున నూనెవేసి రెండువైపులా కాల్చు కోవాలి. ఇంకా రుచికరంగా ఉండాలనుకుంటే మైదా, మొక్క జొన్న పిండిలో ముంచి కాగుతోన్న నూనెలో వేయించుకోవచ్చు.