పన్నీర్ - ఒక కప్పు,
జీలకర్ర - 2 స్పూన్స్,
ఉల్లిగడ్డ - 1,
టమాటాలు - 2,
మసాలా - అర టీ స్పూన్,
పసుపు - పావు టీ స్పూన్,
కారం - అర టీ స్పూన్,
పచ్చిమిరపకాయలు - 3,
కొత్తిమీర - ఒక కట్ట,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
- పన్నీర్‌ని చిన్నగా తురమాలి.
- కడాయిలో నూనె పోసి జీలకర్ర వేగాక ఉల్లిపాయలను బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలను వేసి రెండు స్పూన్ల నీళ్ళు పోయాలి.
- మూడు నిమిషాల తర్వాత సన్నని మంట మీద ఉంచి మసాలా, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు వేసి మరో రెండు నిమిషాలపాటు అలాగే ఉంచాలి.
- ఇప్పుడు పన్నీర్, ఉప్పు వేసి మరికొన్ని నీళ్ళు పోయాలి. నీళ్ళన్నీ ఇంకే వరకు అలాగే సన్నని మంట మీద వేగనివ్వాలి. చివరన కొత్తిమీర వేసి దించేయాలి. దీన్ని బ్రెడ్ టోస్ట్‌తో లాగిస్తే బాగుంటుంది.