telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ఓట్స్ మసాలా రవ్వ దోశ

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఓట్స్             -             కప్పు(మెత్తని పొడిలా చేయాలి)
బొంబాయి రవ్వ -           అరకప్పు 
బియ్యప్పిండి     -            పావు కప్పు 
మైదా పిండి      -            2 టీస్పూన్లు 
అల్లం వెల్లుల్లి     -           టీస్పూన్ 
మిరియాల పొడి   -         అర టీస్పూన్ 
ఉప్పు               -            రుచికి సరిపడా
జీలకర్ర              -             టీస్పూన్ 
                                                                  నూనె               -              వేయించడానికి సరిపడా 
                                                                  కారం               -              టీస్పూన్  
                                                                 ధనియాల పొడి   -            టీస్పూన్ 
                                                                 కరివేపాకు         -             ఒక రెమ్మ 

తయారుచేసే పద్ధతి:
  • ఓ గిన్నెలో అన్నీ పదార్థాలు వేసి కలపాలి. తరువాత తగినన్నీ నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా దోశ పిండి మాదిరిగా కలపాలి. ఇప్పుడు పెనం మీద పిండిని పలుచగా పోయాలి. దోశ మాదిరిగా గరిటెతో తిప్పకుండా రవ్వ దోశ మాదిరిగా వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

ఓట్స్ క్యారెట్ థాలిపీట్ 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఓట్స్             -             కప్పు
గోధుమ పిండి    -           అరకప్పు 
బియ్యప్పిండి     -            అరకప్పు 
క్యారెట్ తురుము -          అరకప్పు 
ధనియాల పొడి   -           టీస్పూన్ 
జీలకర్ర పొడి       -           టీస్పూన్ 
కసూరి మెంతి    -              టీస్పూన్ 
కరివేపాకు         -             పది రెమ్మలు 
గరం మసాలా      -            టీస్పూన్ 
ఉప్పు               -            రుచికి సరిపడా
జీలకర్ర              -             టీస్పూన్ 
నూనె               -              వేయించడానికి సరిపడా 
కారం               -              2 టీస్పూన్లు 
పసుపు            -              అర టీస్పూన్ 
వాము             -              అరటీస్పూన్ 

తయారుచేసే పద్ధతి:
  • ఓ గిన్నెలో అన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్నీ నీళ్ళు పోసి గట్టి పిండిలా కలపాలి. ఇప్పుడు చిన్న ముద్దను తీసుకోవాలి. పెనం మీద ఓ టీస్పూన్ నూనె వేసి ముద్దను ఉంచి వేళ్ళతో నెమ్మదిగా వత్తుతూ చిన్న రొట్టెలా చేయాలి. మధ్యమధ్యలో చేతుల్ని తడి చేసుకోవాలి. మధ్యలో చిన్న రంద్రం చేయాలి. అందులో కూడా ఓ టీస్పూన్ నూనె వేయాలి. ఇప్పుడు మొత్తం అన్ని వైపులకు నూనె వెళ్లి బాగా కాలుతుంది. ఇలా రెండు వైపులా కాల్చి తీయాలి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

ఓట్స్ వెజిటబుల్ బాత్ 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఓట్స్             -             కప్పు
మొక్కజొన్న గింజలు -       3 టీస్పూన్లు 
ఎండుమిర్చి       -             ఒకటి 
ఉల్లిపాయలు      -             రెండు 
పచ్చి బఠానీలు   -            4 టీస్పూన్లు 
కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద- ఒకటిన్నర టీస్పూన్లు
అల్లం తురుము   -            అరటీస్పూన్ 
వెల్లుల్లి              -             2 రెబ్బలు 
టమాటో, క్యారెట్, క్యాప్సికం, బీన్స్ ముక్కలు - కప్పు 
నెయ్యి              -              టీస్పూన్
జీలకర్ర పొడి      -              టీస్పూన్
ధనియాల పొడి  -             టీస్పూన్ 
కారం               -             అరటీస్పూన్  
అజినమెటో       -             చిటికెడు 
ఉప్పు               -            రుచికి సరిపడా
మిరియాల పొడి   -           చిటికెడు 
నూనె                -             2 టీస్పూన్లు 
పోపు కోసం :
జీలకర్ర, సెనగపప్పు, ఆవాలు, మినపప్పు - కొద్దికొద్దిగా 

తయారుచేసే పద్ధతి:
  • ఫ్రెషర్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ వేసి వేయించాలి. అవి వేగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇప్పుడు మొక్కజొన్న గింజలు, ఇతర కూరగాయ ముక్కలన్నీ వేసి కాసేపు వేయించాలి. తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు వేసి కలపాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఓట్లు వేసి కలిపి మూత పెట్టి ఓ విజిల్ రానివ్వాలి. చివరగా నెయ్యి వేసి కలిపితే సరి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

కార్న్ ఓట్స్ మసాలా 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఓట్స్             -             కప్పు
మొక్కజొన్న గింజలు -       కప్పు 
నెయ్యి              -              టీస్పూన్
జీలకర్ర పొడి      -              అరటీస్పూన్
ధనియాల పొడి  -             అరటీస్పూన్ 
కారం               -             అరటీస్పూన్  
అజినమెటో       -             చిటికెడు 
ఉప్పు               -            రుచికి సరిపడా
సోయాసాస్         -             టీస్పూన్ 
                                                                   నిమ్మరసం         -             టీస్పూన్ 
                                                                  నూనె                -             2 టీస్పూన్లు 

తయారుచేసే పద్ధతి:
  • బాణలిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఓట్లు వేసి వేయించాలి. అవి మంచి వాసనా వస్తుండగా తీసి ప్లేటులో పక్కన ఉంచాలి.
  • అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి. తర్వాత మసాలా పొడులన్నీ వేసి కలపాలి. ఇప్పుడు ఓట్లు కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసి ఓ రెండు నిముషాలు ఉడికించాలి. మంచి వాసనా వస్తుండగా దించి నిమ్మరసం పిండాలి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

థాలిపీట్ 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి    -             కప్పు
బియ్యప్పిండి     -             అరకప్పు 
సెనగ పిండి       -             పావుకప్పు 
జొన్న పిండి      -             అరకప్పు
అల్లం               -              చిన్న ముక్క 
వెల్లుల్లి రెబ్బలు  -              2
పచ్చిమిర్చి        -             3
ధనియాల పొడి   -             2 టీస్పూన్లు  
కసూరి మెంతి    -              టీస్పూన్ 
అవిసె గింజల పొడి -           టీస్పూన్ 
గరం మసాలా      -            టీస్పూన్ 
ఉప్పు               -            రుచికి సరిపడా
జీలకర్ర              -             టీస్పూన్ 
నూనె               -              వేయించడానికి సరిపడా 
కారం               -              2 టీస్పూన్లు 
పసుపు            -              అర టీస్పూన్ 
వాము             -              అరటీస్పూన్ 
కొత్తిమీర తురుము -          కప్పు 
నువ్వులు          -             2 టేబుల్ స్పూన్లు 
ఉల్లి తురుము     -             అరకప్పు 

తయారుచేసే పద్ధతి:
  • అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా రుబ్బాలి. కొత్తిమీర సన్నగా తరగాలి.
  • నువ్వులు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలపాలి.
  • ఇప్పుడు పిండి ముద్దను చపాతీ కర్రతో పాలిథీన్ కవర్ మీద గానీ లేదా నున్నని పాలరాయి మీద గానీ నూనె లేదా నెయ్యి అద్దుతూ చపాతీలా చేయాలి. రొట్టె చేసాక గారే మాదిరిగా మద్యలో రంద్రం చేసి పైన నువ్వులు చల్లి నెమ్మదిగా అద్దాలి.
  • ఇప్పుడు పెనం మీద ఈ రొట్టె వేసి చిల్లులో అరటీస్పూన్ నూనె వేసి మూతపెట్టాలి. రెండు లేక మూడు నిమిషాల తర్వాత రొట్టెను తిప్పి మళ్లీ అదే మాదిరిగా మధ్యలో పావుటీస్పూన్ నూనె వేసి మూతపెట్టి కాలనివ్వాలి. రెండోవైపు తిప్పిన తర్వాత నువ్వులు గోధుమ రంగులోకి మారగానే రొట్టె తీయాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉండడమే కాక మంచి పోషకాహారం కూడా.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments

అడపిండి వడలు 

6/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు,సెనగపప్పు - అరకప్పు చొప్పున 
ఎండుమిరపకాయలు -      7
బియ్యం            -             కప్పు
మెంతులు         -             అరటీస్పూన్ 
పసుపు            -             పావుటీస్పూన్ 
ఉప్పు               -            రుచికి సరిపడా
జీలకర్ర              -             అర టీస్పూన్ 
బ్రెడ్ పొడి           -              2 టీస్పూన్లు 
                                                                   బేకింగ్ సోడా       -              అరటీస్పూన్ 
                                                                   నూనె               -              వేయించడానికి సరిపడా 

తయారుచేసే పద్ధతి:
  • పప్పులన్నీ ఓ గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మెంతులు, ఎండుమిరపకాయ ముక్కలు విడిగా ఓ గిన్నెలో నానబెట్టుకోవాలి. 
  • ఉదయాన్నే నానబెట్టిన వాటికి ఒక కరివేపాకు రెమ్మ జోడించి మిక్సీలో వేసి రుబ్బాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి. తరువాత బేకింగ్ పౌడర్, బ్రెడ్ పొడి, జీలకర్ర, పసుపు వేసి కలిపి చిన్న చిన్న వడల్లాగా చెస్ కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని కొత్తిమీర పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి. 

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం  

0 Comments
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    దహీ కడీ పకోడీస్
    దహీ రింగ్ చాట్
    ఇన్ స్టంట్ దోశ
    ఎగ్ బోండాలు
    రవ్వ దోశ
    రాగి వడలు
    వెజ్ వడలు
    బీట్ రూట్ దోశ
    బీట్ రూట్ వడలు
    థైర్ వెజ్ ఇడ్లీ
    రాగి ముద్ద
    ఎగ్‌ పరోటా
    పోహా ఉప్మా
    లాచా పరాటా
    రాగి ఇడ్లీ
    గోభీ పరాటా
    రవ్వ ఊతప్పం
    చీజ్ టోస్ట్
    వెజ్ టేబుల్ దోశ
    రవ్వ పులిహోర
    టమాట పులిహోర
    తాటి ఇడ్లీలు
    పులి బొంగరాలు
    ఓట్స్
    ఓట్స్ ఇడ్లీ
    బఠానీ పరాటా
    బనానా ఇడ్లీ
    పాలక్ పరాటా
    ఓట్స్ మసాలా రవ్వ దోశ
    ముంబై స్టఫ్డ్ పరాటా
    ఓట్స్ క్యారెట్ థాలిపీట్
    ఓట్స్ వెజిటబుల్ బాత్
    ఓట్స్ సగ్గుబియ్యం వడలు
    ధేబ్రా
    చిల్లీ
    మామిడి ఆవడ
    క్విక్ దోశ
    పెసరట్ దోశ
    బీరకాయ దోసె
    గ్రీన్ పరోటా
    అటుకుల ఉప్మా
    మైసూర్ మసాలా దోశ
    సేమియా పనీర్ బాత్
    కార్న్ ఓట్స్ మసాలా
    సొరకాయ తెప్లా
    సేమియా వంటకాలు
    బీరకాయ ఫ్రిట్టర్స్
    బోండాలు
    అస్సామీ దోశ
    కోకోనట్ దోశ
    అడపిండి వడలు
    మిరియాల వడలు
    మొఘలాయి పరోటా
    పన్నీర్ బ్రెడ్
    పన్నీర్ బుర్జీ
    పన్నీర్ కుల్చా
    బ్రెడ్‌ పెరుగు వడ
    కొబ్బరి పొంగడాలు
    రొట్టెలు
    థాలిపీట్
    స్టఫ్డ్‌ చపాతీలు
    చిలగడదుంప వడ
    ములగాకుతో దోసె
    చిలగడదుంప పూరీ
    చిలగడదుంప పరాఠా
    తీపిఊతప్పం
    మొక్కజొన్న దోశ
    మొక్కజొన్న బోండా
    సగ్గుబియ్యం దధ్యోదనం
    న్యూట్రీషియస్ దోసె
    694d582dbf
    తేనీరు(tea)

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.