telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

టమాట పులిహోర

10/30/2013

0 Comments

 
Picture
కావలసినవి
టమాటాలు-పావుకిలో
బియ్యం-అరకిలో
నూనె-100గ్రా
పచ్చిమిరపకాయలు-6
ఎండుమిర్చి-నాలుగు
ఆవాలు, జీలకర్ర-ఒక చెంచా చొప్పున
కరివేపాకు-అరకట్ట
శనగపప్పు-రెండు చెంచాలు
మినపప్పు-రెండు చెంచాలు
పల్లీలు-అరకప్పు
పసుపు-చిటికెడు
చింతపండు-100గ్రా.
ఉప్పు-రుచికి సరిపడా


తయారుచేసే విధానం
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నంగా వండుకుని ఒక పళ్లెంలో పోసి చల్లార్చుకోవాలి. మందపాటి బాణలిలో నూనెపోసి కాగాక పోపు సామానులన్నీ వేసుకుని దోరగా వేయించాలి. ఇందులోనే సన్నగా తరిగిన టమాటాలు, సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి మళ్లీ ఉడికించాలి. బాగా ఉడికిన కూరను చల్లారిన అన్నంలో బాగా కలపాలి. నిమ్మకాయను పిండుకుని కొత్తిమీరతో అలంకరించుకుంటే ఘుమఘుమలాడే టమాట పులిహోర తయారు. దీనిని ఉదయాన్నే అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.

0 Comments

థైర్ వెజ్ ఇడ్లీ

10/26/2013

0 Comments

 
Picture
కావలసినవి:
 గోధుమలు - ఒకటిన్నర కప్పులు,

మినప్పప్పు - ముప్పావు కప్పు,
బఠాణీ - పావు కప్పు,
క్యారట్ తురుము - పావు కప్పు,
బీన్స్ తరుగు - పావు కప్పు,
పెరుగు - అర కప్పు,
కొత్తిమీర - కొద్దిగా,
కరివేపాకు - రెండు రెమ్మలు,
ఆవాలు - టీ స్పూను,
మినప్పప్పు (బద్దలు) - 2 టీ స్పూన్లు,
శనగపప్పు - 2 టీ స్పూన్లు,
అల్లం - చిన్న ముక్క,
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,
ఉప్పు - తగినంత,
నూనె - తగినంత
 
 తయారి:  
  •  గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి
  •  మినప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి  
  •  గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి  
  •  మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి  
  •  బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి  
  •  క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి  
  •  నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి  
  •  ఇడ్లీ రేకులలో వేసి కుకర్‌లో ఉంచి విజిల్ లేకుండా ఉడికించాలి.

0 Comments

తీపిఊతప్పం

10/24/2013

0 Comments

 
Picture
కావలసినవి
మినపప్పు-కప్పు,

ఇడ్లీరవ్వ-రెండు కప్పులు
పెసరపప్పు, పంచదార-అరకప్పు చొప్పున
యాలకులు-రెండు,

ఎండుద్రాక్ష-పది
వేరుశనగపప్పు-అరకప్పు,

సోంపు-అరచెంచా
జామ్‌-మూడు చెంచాలు,

జీడిపప్పు పలుకులు-ఐదు
పచ్చికొబ్బరికోరు-అరకప్పు


తయారుచేసే విధానం
  • మినపప్పు, ఇడ్లీరవ్వ, పెసరపప్పును వేర్వేరుగా నానబెట్టాలి. నానినపప్పును మెత్తగా రుబ్బుకుని అందులో కడిగిన ఇడ్లీరవ్వ కలపాలి.
  • నానిన పెసరపప్పును మరోసారి కడిగి నీరు వంపేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
  • ఇప్పుడు వేరుశనగపప్పు, జీడిపప్పు, సోంపు, యాలకులు కలిపి మిక్సీలో మెత్తని పొడిలా చేయాలి.
  • పొయ్యిమీద బాణలి పెట్టి అరకప్పు నీళ్లు మరిగించాలి. ఆ నీటిలో పంచదార కరిగించి రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు ముద్ద, వేరుశనగపప్పు పొడి, పచ్చికొబ్బరి తురుము వేసి ఉడికించాలి.
  • ఆ తరువాత ఎండుద్రాక్ష, జామ్‌ కూడా చేర్చి బాగా కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక దింపేయాలి.
  • ఇప్పుడు మరీ లోతుగా లేని కుక్కర్‌ గిన్నెలో చెంచా నెయ్యి రాసి మినపప్పు మిశ్రమాన్ని రెండు గరిటెలు వేసి, సిద్ధం చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకుని ఈ పిండిపై పరిచి పైన మరో రెండు గరిటెలు మినప్పిండి వేయాలి.
  • సన్నటిమంటపై ఉంచి, మూతపెట్టేసి పదినిమి షాలు ఉడకనివ్వాలి. ఆ తరువాత తీసేసి మనకిష్టమైన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. స్కూలు పిల్లలు లంచ్‌ బాక్సులలోకి ఇది చాలా బాగుంటుంది.

దీనిలో పోషకాలు
శక్తి-340 కేలరీలు,
ఎదుగుదల కోసం మాంసకృత్తులు- 16,5గ్రా,
శరీరానికి శక్తి ఎముకల ఆరోగ్యం కోసం కార్బొహేడ్రేట్లు-25గ్రా.
కొవ్వు -11గ్రా.

0 Comments

బీరకాయ దోసె

10/16/2013

0 Comments

 
Picture
కావలసినవి:
బీరకాయలు - నాలుగు,
నూనె, దోసె పిండి - సరిపడా.

తయారీ:
దోసెపిండి తయారుచేసుకోవాలి. బీరకాయల్ని శుభ్రంగా కడిగి తొక్కును పైపైన తీసి బీరకాయ పై భాగాన్ని, అడుగు భాగాన్ని తీసేయాలి. ఆ తరువాత బీరకాయ ముక్కల్ని గుండ్రంగా కోయాలి. ఓ మాదిరి మంట మీద దోసె పెనాన్ని వేడిచేయాలి. ఒక్కో బీరకాయ రింగ్‌ని దోసె పిండిలో ముంచి పెనం మీద ఒక దాని పక్కన ఒకటి దోసెలా గుండ్రంగా అమర్చాలి. పైన నూనె వేసి మూత పెట్టి కాసేపు ఉంచి దోసెను తిప్పి కొద్దిగా నూనె వే సి కాల్చాలి. ఈ దోసెను వెన్న లేదా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.

0 Comments

కొబ్బరి పొంగడాలు

10/7/2013

0 Comments

 
Picture
కావలసినవి
కొబ్బరికోరు-రెండు కప్పులు,

తడిబియ్యం పిండి-రెండున్నర కప్పులు
బెల్లం, పంచదార-కప్పు చొప్పున,

యాలకులు-ఆరు
నూనె-పావుకిలో,

జీడిపప్పు-పావు కప్పు,
నెయ్యి-నాలుగు చెంచాలు
పెరుగు-కప్పు


తయారుచేసే విధానం
  • బెల్లానికి నీరు చేర్చి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి.
  • అందులో కొబ్బరికోరు, పంచదార, బియ్యం పిండి చేర్చి బాగా కలియతిప్పాలి.
  • పదార్థం బాగా దగ్గర పడ్డాక నెయ్యి చేర్చి మూతపెట్టాలి. తరువాత పెరుగు వేసి గరిటె జారుగా కలిపి దించేయాలి.
  • ఇప్పుడు పెనం వేడి చేసి అరచెంచా నెయ్యి రాసి ఈ పిండిని చిన్నచిన్న అట్లులా వేయాలి. రెండువైపులా కాల్చితే...చాలా రుచిగా ఉంటుంది. లేదంటే...నూనెలో కూడా వేయించుకోవచ్చు.
  • అయితే ఈ పిండిని గుంట గరిటెతో తీసుకుని నూనెలో వేయాలి. వేగాక ఇది రెండు పొరలుగా విడిపోతుంది.

0 Comments

బీరకాయ ఫ్రిట్టర్స్

10/5/2013

0 Comments

 
Picture
కావలసినవి:
బీరకాయ (ముక్కలు తరిగి) - ఒకటి,
శెనగపిండి - ఒక కప్పు,
బియ్యప్పిండి - పావుకప్పు,
కారం - ఒక టీస్పూన్,
వంటసోడా- చిటికెడు,
మిరియాలపొడి, సోయాసాస్ - ఒక్కో స్పూన్,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - వేగించడానికి తగినంత.

తయారీ:
బీరకాయల్ని కడిగి చెక్కు తీసి సన్నగా గుండ్రంగా కోయాలి. ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్ధాలన్నింటిని వేసి సరిపడా నీళ్లు పోసి దోసెపిండిలా కలుపుకోవాలి. కళాయిలో నూనె వేడిచేయాలి. శెనగపిండి మిశ్రమంలో బీరకాయ ముక్కల్ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌తో తింటే టేస్టీగా ఉంటాయి.


0 Comments

ఓట్స్ ఇడ్లీ

10/2/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఓట్స్ - ఒక కప్పు
రవ్వ - అర కప్పు
పెరుగు - అర కప్పు
పసుపు - పావు టీ స్పూన్
కొత్తిమీర - అర కట్ట
బేకింగ్ సోడా - కొద్దిగా
పచ్చిమిరపకాయలు - 2
అల్లం పేస్ట్ - అర టీ స్పూన్
మినపప్పు - అర టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
ఇంగువ - కొద్దిగా
కరివేపాకు - 4 రెమ్మలు
నూనె - 2 స్పూన్
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
ఓట్స్‌ని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. రెండు నిమిషాల పాటు సన్నని సెగ మీద రవ్వను కూడా వేయించాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలను వేయాలి. తర్వాత మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, అల్లం పేస్ట్ వేసి రెండు నిమిషాలు అలాగే ఉంచి దించేయాలి. ఇందులో వేయించుకున్న రవ్వ, ఓట్స్ పొడి వేసి కలపాలి. ఇంకా పెరుగు, పసుపు, బేకింగ్ సోడా, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్ళు కూడా పోసి మరికాసేపు కలిపి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక్కో ప్లేటుకు నూనె రాసి ఆ మిశ్రమాన్ని అందులో వేయాలి. అలా అన్ని రాసిన తర్వాత మూత పెట్టి 10నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఓట్స్ ఇడ్లీలు తయారైనట్టే!

0 Comments

చిల్లీ, చీజ్ టోస్ట్

9/25/2013

0 Comments

 
Picture
కావలసినవి:

బ్రెడ్ స్లైసులు - 6
చీజ్ - 5 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 1
పుదీనా ఆకులు - 6 లేక 8
కొత్తిమీర - కొద్దిగా
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - తగినంత


చేద్దాం ఇలా:

పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా చీజ్‌లో గ్రీన్ చట్నీ ఉంటే కలుపుకోవచ్చు. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి ఉంచుకోవాలి. బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి ఈ చీజ్ మిశ్రమాన్ని పలుచగా రాసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి అదమాలి. దానిపైన మళ్లీ ఇంకోసారి చీజ్ మిశ్రమం రాసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి అదమాలి. దీన్ని ఇలాగే ఫ్రిజ్‌లో పెట్టి కావలసినప్పుడు తీసి రెండు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. దీన్ని మరోలా కూడా చేసుకోవచ్చు. చీజ్‌లో కారం పొడి, టమాటా సాస్ కలిపి ఎర్రరంగులో మిశ్రమం చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మిరియాల పొడి బదులు కాస్త గరం మాసాలా పొడి వేసుకోవాలి.


0 Comments

సేమియా పనీర్ బాత్

9/23/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు .
సేమియా 1 కప్పు
పనీర్‌ ముక్కలు 3 చెంచాలు
క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ ముక్కలు పావు కప్పు
ఉప్పు తగినంత
నూనె రెండు చెంచాలు,
గరం మసాలా అరచెంచా
కొత్తిమీర 1 కట్ట

తయారు చేసే విధానం :
ముందుగా గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని సేమియా వేసి ఉడకనివ్వాలి. ఆ తరువాత నీళ్లు వంపేసి సేమియాను ఓ ప్లేట్‌లోకి తీసుకుని ఆరనివ్వాలి. బాణలిలో నూనె వేడి చేసి క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ ముక్కలు వేయించాలి. 5 నిమిషా లయ్యాక పనీర్‌ ముక్కలు కలిపి తగినంత ఉప్పు, గరంమసాలా చల్లి, చివరగా సేమియా వేసి బాగా కలపాలి. 5 నిమిషాలయ్యాక కొత్తిమీర తురుమును చల్లి దించేయాలి. అంతే నోరూరించే సేమియా పనీర్‌ బాత్‌ రెడీ!


0 Comments

పన్నీర్ బ్రెడ్

9/22/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
శాండ్‌విచ్‌ బ్రెడ్‌ ముక్కలు       : పది
పనీర్‌                    : వంద గ్రా.
ఉల్లిపాయ                 : ఒకటి
కారం                    : ఒక టీ.
అల్లం వెల్లుల్లి               : అర టీ.
శెనగపిండి.                : వంద గ్రా.
ఉప్పు                   : తగినంత
మంచినీళ్లు                 : ఒక కప్పు
నూనె                    : సరిపడా
గరంమసాలా               : ఒక టీ.

తయారుచేసే పద్ధతి :

ఉల్లిపాయ, పనీర్‌లను విడివిడిగా సన్నగా తరగాలి. బాణలిలో ఒక టీస్పూన్‌ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కల్ని వేసివేయించాలి. పన్నీర్‌, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. బ్రెడ్‌ ముక్కల అంచులు తీసేసీ.. త్రికోణాకారంలో కట్‌ చేసుకోవాలి. విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యపిండి, తగిన నీళ్లు పోసి గట్టి పేస్టులా చేసి పన్నీర్‌ ముక్కల మిశ్రమంలో కలపాలి.కత్తిరించిన ఓ బ్రెడ్‌ముక్కను తీసుకుని దాని మీద ఈ మిశ్రమాన్ని పలుచగా పూసి పైన మరో బ్రెడ్‌ ముక్క పెట్టి శాండ్‌విచ్‌లా తయారుచేయాలి. ఇలా మొత్తం బ్రెడ్‌ముక్కలని చేసుకుని.. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె కాగాక బ్రెడ్‌ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే పనీర్‌ బ్రెడ్‌ రెడీ.. ! వీటిని టమాటో సాస్‌ లేదా చింతకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.


0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    దహీ కడీ పకోడీస్
    దహీ రింగ్ చాట్
    ఇన్ స్టంట్ దోశ
    ఎగ్ బోండాలు
    రవ్వ దోశ
    రాగి వడలు
    వెజ్ వడలు
    బీట్ రూట్ దోశ
    బీట్ రూట్ వడలు
    థైర్ వెజ్ ఇడ్లీ
    రాగి ముద్ద
    ఎగ్‌ పరోటా
    పోహా ఉప్మా
    లాచా పరాటా
    రాగి ఇడ్లీ
    గోభీ పరాటా
    రవ్వ ఊతప్పం
    చీజ్ టోస్ట్
    వెజ్ టేబుల్ దోశ
    రవ్వ పులిహోర
    టమాట పులిహోర
    తాటి ఇడ్లీలు
    పులి బొంగరాలు
    ఓట్స్
    ఓట్స్ ఇడ్లీ
    బఠానీ పరాటా
    బనానా ఇడ్లీ
    పాలక్ పరాటా
    ఓట్స్ మసాలా రవ్వ దోశ
    ముంబై స్టఫ్డ్ పరాటా
    ఓట్స్ క్యారెట్ థాలిపీట్
    ఓట్స్ వెజిటబుల్ బాత్
    ఓట్స్ సగ్గుబియ్యం వడలు
    ధేబ్రా
    చిల్లీ
    మామిడి ఆవడ
    క్విక్ దోశ
    పెసరట్ దోశ
    బీరకాయ దోసె
    గ్రీన్ పరోటా
    అటుకుల ఉప్మా
    మైసూర్ మసాలా దోశ
    సేమియా పనీర్ బాత్
    కార్న్ ఓట్స్ మసాలా
    సొరకాయ తెప్లా
    సేమియా వంటకాలు
    బీరకాయ ఫ్రిట్టర్స్
    బోండాలు
    అస్సామీ దోశ
    కోకోనట్ దోశ
    అడపిండి వడలు
    మిరియాల వడలు
    మొఘలాయి పరోటా
    పన్నీర్ బ్రెడ్
    పన్నీర్ బుర్జీ
    పన్నీర్ కుల్చా
    బ్రెడ్‌ పెరుగు వడ
    కొబ్బరి పొంగడాలు
    రొట్టెలు
    థాలిపీట్
    స్టఫ్డ్‌ చపాతీలు
    చిలగడదుంప వడ
    ములగాకుతో దోసె
    చిలగడదుంప పూరీ
    చిలగడదుంప పరాఠా
    తీపిఊతప్పం
    మొక్కజొన్న దోశ
    మొక్కజొన్న బోండా
    సగ్గుబియ్యం దధ్యోదనం
    న్యూట్రీషియస్ దోసె
    694d582dbf
    తేనీరు(tea)

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.