బియ్యం : కిలో
కొబ్బరి కోరు : ఒక కప్పు
ఎండుమిర్చి : 2 (తరిగి పెట్టుకోవాలి)
పచ్చి మిర్చి : 4(తరిగి పెట్టుకోవాలి)
కరివేపాకు : 2 రెబ్బలు
తాలింపు గింజలు : ఒక స్పూన్
నూనె : ఒక కప్పు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి:
అన్నం కాస్త పలుకుగా వండి, దానికి తగినంత ఉప్పు కలిపి ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని నూనె పోసి కాగాక తాలింపు గింజలు, మిర్చి, కొబ్బరి కోరు, పసుపు వేసి వేగినాక కరివేపాకు చిటపటలాడిచ్చి అన్నంలో వేసి కలిపితే సరి... వేడివేడిగా కొబ్బరి అన్నం సిద్దం.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ