బియ్యం : ఒక కిలో
నిమ్మకాయలు : 4
పచ్చిమిర్చి : 12
ఎండుమిర్చి : 6
కరివేపాకు : 2 రెబ్బలు
పల్లీలు : 100 గ్రాములు
తాలింపు గింజలు : ఒక స్పూన్
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
ముందుగా అన్నం కాస్త పలుకుగా వండి పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం తీసి, అందులో ఉప్పు వేసి అన్నంలో పోసి బాగా కలుపుకోవాలి. తరవాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని నూనె పోసి పల్లీలు, పసుపు, తాలింపు గింజలు, పచ్చి మిర్చి, ఎండుమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీనికి అన్నంను బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే నిమ్మకాయ పులిహోర రెడీ...
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ