కావలసిన పదార్థాలు :
గుడ్లు - 8
నెయ్యి - అర కప్పు
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - 2
పలావ్ ఆకులు - రెండు
దాల్చిన చెక్క - అంగుళం ముక్క
నల్ల యాలకులు - 2
పచ్చయాలకులు - 4
పసుపు - అర టీస్పూన్
కారం - అర టీస్పూన్
బాస్మతి బియ్యం - 2 కప్పులు
గోరు వెచ్చని నీళ్ళు- రెండున్నర కప్పులు
ఉప్పు - తగినంత
గరం మసాలా - టీస్పూన్
టమాటాలు - 4
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
ముందుగా కోడిగుడ్లను ఉడికించి పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తర్వాత పలావ్ ఆకులు, దాల్చిన చెక్క ముక్కలు, ఏలకులు వేసి వేయించాలి. ఇప్పుడు గుడ్లను వేసి కాసేపటి తర్వాత పసుపు, కారం వేసి 5 నిముషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి జాగ్రత్తగా కలుపుకొని రెండు నిముషాలు వేయించుకోవాలి. తర్వాత నీళ్ళు పోసి ఉప్పు వేసి, గరం మసాలా కూడా వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. నీళ్లన్నీ ఇంకి బియ్యం ఉడికిన తర్వాత కొత్తిమీర తురుము చల్లి, టమాటా ముక్కలతో అలంకరించి వడ్డించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం