కావలసిన పదార్థాలు :
చికెన్ - ఒకటి
తాజా హెర్బల్ ఆకులు - అరకప్పు (రోజ్ మేరి, కొత్తిమీర, సేజ్, వాము, పూదీన)
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాలు - రుచికి సరిపడా
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
కిచెన్ కింగ్ మసాలా - టేబుల్ స్పూన్
కారం - టేబుల్ స్పూన్
స్టఫింగ్ కోసం :
నిమ్మకాయ - అర చెక్క
వెల్లుల్లి - కొన్ని
రోజ్ మేరి - చిన్న కొమ్మ
తయారుచేసే పద్ధతి :
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం
చికెన్ - ఒకటి
తాజా హెర్బల్ ఆకులు - అరకప్పు (రోజ్ మేరి, కొత్తిమీర, సేజ్, వాము, పూదీన)
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాలు - రుచికి సరిపడా
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
కిచెన్ కింగ్ మసాలా - టేబుల్ స్పూన్
కారం - టేబుల్ స్పూన్
స్టఫింగ్ కోసం :
నిమ్మకాయ - అర చెక్క
వెల్లుల్లి - కొన్ని
రోజ్ మేరి - చిన్న కొమ్మ
తయారుచేసే పద్ధతి :
- ఓవెన్ ను ముందుగానే 180 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేయాలి. చికెన్ పైన ఉన్న తోలు, లోపల ఉన్న కొవ్వు తీసేయాలి. తరువాత శుభ్రముగా కడిగి పలుచని బట్టతో తడి లేకుండా అద్దాలి.
- తాజా ఆకులన్నీ సన్నగా తరగాలి.
- ఓ చిన్న గిన్నెలో ఆకుల తురుము, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, నూనె, కిచెన్ కింగ్, కారం వేసి కలపాలి.
- కోడి పొట్ట లోపల నిమ్మచెక్క, వెల్లుల్లి రెబ్బలు, రోజ్ మేరి ఉంచాలి. ఇవి తినడానికి కాదు కేవలం మంచి వాసనా కోసం మాత్రమే.
- ఇప్పుడు తాజా ఆకుల తురుముని కోడికి అన్ని వైపులా పట్టించాలి. ఛాతి దగ్గర చర్మం వదులుగా లాగి లోపల కూడా పట్టించాలి.
- కాళ్ళని మందపాటి దారంతో కట్టేసి బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్ లో సుమారు గంట నుంచి గంటన్నర సేపు రోస్ట్ చేయాలి. మధ్యమధ్యలో చికెన్ నుంచి కారిన జ్యూస్ ను అడ ఎండిపోకుండా చికెన్ కు పట్టిస్తూ ఉండాలి.
- మొత్తం రోస్ట్ అయ్యాక దాన్ని అలాగే పదిహేను నిముషాలు ఉంచాలి. బయటకి తీసి పొట్టలోపల ఉంచినవన్నీ తీసేయాలి. ఇప్పుడు దీన్ని కావలసినట్లుగా ఏ భాగానికా భాగాన్ని విడతీసి వడ్డించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం