కావలసిన పదార్ధాలు :
ఉడికించిన చికెన్ : 150 గ్రాములు
వెల్లుల్లి ముక్కలు : ఒక టీస్పూన్
ఉల్లిపాయ : పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి )
పచ్చిమిరపకాయలు : రెండు లేదా మూడు
క్యాప్సికం : 2 (ముక్కలుగా చేసుకోవాలి )
కారం : రెండు టీస్పూన్లు
వైట్ సాస్ : కొద్దిగా
బ్రెడ్ ముక్కలు : 2
నూనె : 15 ml
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
ముందుగా చికెన్ సన్నని ముక్కలుగా కట్ చేయాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి, బాగా కాగిన తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉడికించి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం పొడి, వైట్ సాస్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నె లో కొద్దిగా నీళ్ళు తీసుకొని బ్రెడ్ ముక్కల్ని నానబెట్టాలి. తర్వాత నీటిని పిండేసి బ్రెడ్ ముక్కలఫై మద్యలో చికెన్ మిశ్రమము ఉంచి, బ్రెడ్ ను మడిచేసి రోల్ చేసుకోవాలి. ఒక భాండి లో నూనె పోసి వేడి అయిన తర్వాత రోల్ చేసిన బ్రెడ్ ముక్కలని వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. వేగాక ఒక్కొక్క రోల్ ని రెండు గా కట్ చేసుకోవాలి. దీనికి టమాటో కెచప్ మంచి కాంబినేషన్.
మూలం : స్వాతి సపరివార పత్రిక