కావలసినవి:
మేక కాళ్లు - 4 (నాలుగేసి ముక్కలుగా కట్ చేయాలి);
టొమాటో ప్యూరీ - కప్పు;
ఉల్లితరుగు - రెండు కప్పులు;
గరంమసాలా - టీ స్పూను;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు;
ధనియాలపొడి - టేబుల్ స్పూను;
పచ్చిమిర్చి - 5;
కొబ్బరితురుము - 2 టేబుల్ స్పూన్లు;
కారం - 2 టీ స్పూన్లు;
మిరియాల పొడి - టీ స్పూను (పొడి మరీ మెత్తగా ఉండకూడదు);
పసుపు - కొద్దిగా;
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను;
నూనె - 3 టేబుల్ స్పూన్లు;
లవంగాలు - 6;
ఏలకులు - 4;
దాల్చినచెక్క - చిన్న ముక్క;
బిరియానీ ఆకు - 1;
ఉప్పు - తగినంత
తయారి:
మేక కాళ్లు - 4 (నాలుగేసి ముక్కలుగా కట్ చేయాలి);
టొమాటో ప్యూరీ - కప్పు;
ఉల్లితరుగు - రెండు కప్పులు;
గరంమసాలా - టీ స్పూను;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు;
ధనియాలపొడి - టేబుల్ స్పూను;
పచ్చిమిర్చి - 5;
కొబ్బరితురుము - 2 టేబుల్ స్పూన్లు;
కారం - 2 టీ స్పూన్లు;
మిరియాల పొడి - టీ స్పూను (పొడి మరీ మెత్తగా ఉండకూడదు);
పసుపు - కొద్దిగా;
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను;
నూనె - 3 టేబుల్ స్పూన్లు;
లవంగాలు - 6;
ఏలకులు - 4;
దాల్చినచెక్క - చిన్న ముక్క;
బిరియానీ ఆకు - 1;
ఉప్పు - తగినంత
తయారి:
- ఒక కప్పు ఉల్లితరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరితురుము వేసి మెత్తగా పేస్ట్ చేసి, పక్కన ఉంచాలి.
- లెగ్ పీసులను శుభ్రంగా కడగాలి. దీనిలో లీటరు నీరు, పసుపు, ఉప్పు జత చేసి కుకర్లో ఉంచి ఆరు విజిల్స్ రానివ్వాలి.
- బాణలిలో నూనె కాగాక, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిరియానీ ఆకు వేసి బాగా కలిపి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేయాలి.
- ఉల్లితరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి.
- ధనియాలపొడి, కారం, గరంమసాలా, మిరియాలపొడి వేసి ఒక నిముషం పాటు వేయించాలి.
- ఈ మొత్తం మిశ్రమాన్ని, కుకర్లో ఉడికించి ఉంచుకున్న లెగ్ పీస్లలో వేసి, తరువాత టొమాటో ప్యూరీ జత చేసి సుమారు రెండు నిముషాలు సన్నని మంట మీద ఉడికించాలి.
- తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి మసాలా, అర లీటరు నీరు జతచేసి, మంట పెద్దది చేసి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.