కావలసిన పదార్థాలు :
గుడ్లు - 4
నూనె - టేబుల్ స్పూన్
జీలకర్ర - టీస్పూన్
ఉల్లిపాయ - ఒకటి
దాల్చిన చెక్క - 3 అంగుళాల ముక్క
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
ఎండుమిర్చి పొడి - అర టీస్పూన్ (కచ్చాపచ్చాగా దంచినది)
పసుపు - అర టీస్పూన్
వెల్లుల్లి - రెండు రెబ్బలు
ఉప్పు - తగినంత
టొమాటోలు - రెండు
మంచి నీళ్ళు - కప్పు
కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి :
ముందుగా కోడిగుడ్లను ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత పెంకు తీసి కాసేపు మంచినీళ్ళలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్లసొన సాగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. కాగాక జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత దాల్చిన చెక్క ముక్కలు వేయాలి. ఉల్లిపాయముక్కలు కొంచెం గోధుమ వర్ణంలోకి వచ్చిన తర్వాత ధనియాల పొడి, ఎండుమిర్చి పొడి, పసుపు, వెల్లుల్లి, ఉప్పు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత సిమ్ లో పెట్టి సన్నగా తరిగిన లేదా రుబ్బిన టమాటా గుజ్జు వేసి, నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. గ్రేవీ పచ్చి వాసన పోయి,మంచి వాసన వస్తూ దగ్గరగా ఉడికిన తరువాత గుడ్లను సగానికి కోసి కూరలో వేసి మరికాసేపు ఉడికించి దించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం