- * సలాడ్ని ఉంచే గిన్నె లేదా ట్రేని చిల్లర్‌లో కాసేపు ఉంచి అందులో సలాడ్ ముక్కలు పెడితే సలాడ్ ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
- *మష్రూమ్ (పుట్టగొడుగులు) లని ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాకుండా పేపర్ బ్యాగుల్లో చుట్టిపెడితే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.
- *మొక్కజొన్నపొత్తుని ఉడికించే నీళ్లలో చిటికెడు పంచదార వేసి ఉడికిస్తే రుచిగా ఉంటుంది.
- *మాంసం ముక్కల్లో క్యారెట్ వేసి ఉడికిస్తే కొవ్వుని క్యారెట్ పీల్చుకుంటుంది. ఉడికిన క్యారెట్‌ను బయటకు తీసి మిగతా కాయగూరలతో కలిపి సూప్ కూడా చేసుకోవచ్చు.
- *పిండిని పూరీల్లా చేశాక వాటిని ఫ్రిజ్‌లో పదినిమిషాలు ఉంచాలి. ఆ తరువాత వేగిస్తే పూరీలు తక్కువ నూనె పీల్చుకుంటాయి. కరకరలాడతాయి.
- * రాజ్మా, మినపప్పుల్ని ఉప్పు వేయకుండా ఉడికించాలి.
- *వేపుళ్లకు వాడిన నూనె నల్లగా అయితే అందులో ఒక టీస్పూన్ తెలుపు వెనిగర్ వేసి మూత పెట్టి సన్నటి మంట మీద వేడిచేయాలి. చిటపటమనడం ఆగిపోయాక వడపోస్తే ఆ నూనె మళ్లీ వాడేందుకు పనికొస్తుంది.
- *ఉల్లిపాయ ముక్కల్ని నూనె వేయకుండా వేగిస్తే వాటి చెమ్మ పోతుంది. ఆ తరువాత కొద్దిగా నూనె వేసి వేగించుకుంటే తక్కువ నూనె పడుతుంది. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి.