- పప్పు ఉడికిన తరువాతనే ఉప్పు వేయండి. మొదటే వేస్తే పప్పు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- పచ్చిమిరపకాయలను పిన్నీసుతో ఐదు రంద్రాలను చేసిన అనంతరం వేయిస్తే పగిలి గింజలు మీద పడవు.
- బొబ్బట్లు విరిగిపోతుంటే మైదాపిండిలో కాస్త గోధుమ రవ్వ కలపాలి.
- గులాబ్ జామున్స్ తయారుచేసేటప్పుడు కోవాలో అరకప్పు తాజా పనీర్ గనక కలిపితే రుచి రెట్టింపవుతుంది.
- కాఫీ డికార్షన్ బాగా చిక్కగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే డికార్షన్‌లో.. వేయించిన పంచడార కలపాలి.
- కాఫీ డికార్షన్ వేడిగా ఉండాలంటే దానిలో కొద్దిగా పంచదార వేయండి.
కుక్కర్ గాస్కెట్ ఉపయోగించిన వెంటనే ఐస్ వాటర్‌లో ముంచితే ఎక్కువ రోజులు మన్నుతుంది. - కేక్ చేసేటప్పుడు ఫ్రీజ్‌లోంచి తీసిన వెంటనే గుడ్లను ఉపయోగించరాదు. కొంచెం సేపు బయట ఉంచకపోతే కేక్ మెత్తదనం లోపిస్తుంది.
- జామ్ తయారికి ఉపయోగించే పండ్లకు ఒక టీస్పూన్ గ్లిజరిన్ కలిపితే 100 గ్రాములు చక్కెర ఆదా అవుతుంది.
- గ్రుడ్డు సోనకి ఒక టీస్పూన్ మైదా పిండి కలిపితే ఆమ్లెట్ పెద్దగా పొంగినట్లుగా వచ్చి చాలాసేపు అలాగే ఉంటుంది.
- కోడిగుడ్డు సోనాకు చిటికెడు కుంకుమ పువ్వు కలిపి ఆమ్లెట్ వేసి చూడండి. రుచి, రంగుతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే.
- కోడిగుడ్లను ఉడిించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా ఉడికించి వెంటనే గ్రుడ్లను చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా ఊడివస్తుంది.