పన్నీర్ - 30(గా.,
గ్రీన్ క్యాప్సికం - 1,
రెడ్ క్యాప్సికం - 1,
యెల్లో క్యాప్సికం - 1,
జీడిపప్పు -10,
అల్లం - చిన్న ముక్క,
టమాటా ప్యూరీ - ఒక కప్పు,
జీలకర్ర - ఒక టీ స్పూన్,
కారం - ఒక టీ స్పూన్,
పసుపు - అర టీ స్పూన్,
ధనియాల పొడి - ఒక టీ స్పూన్,
గరం మసాలా పౌడర్ - అర టీ స్పూన్,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
- పన్నీర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- పెనం పెట్టి నూనె లేకుండా పన్నీర్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఈ ముక్కలను ఉప్పు వేసి వేడి నీటిలో 15నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు మెత్తగా అవుతాయి.
- మూడు రంగుల క్యాప్సికాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె పోసి జీలకర్ర, అల్లం, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. దీంట్లో టమాటా ప్యూరీ వేసి సన్నని మంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
- కొన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి పదినిమిషాలు అలాగే ఉంచాలి. దీంట్లో పన్నీరు ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కలిపి మూత పెట్టేయాలి.
- మరో ఐదు నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. చివరగా జీడిపప్పులను వేసి దించేయాలి.