ఉల్లిపాయ : 1
క్యాలీఫ్లవర్ : ఒక పువ్వు
కొబ్బరి తురుము : మూడు టేబుల్ స్పూన్లు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ : పావు టీస్పూన్
పసుపు : కొద్దిగా
కారం : టీస్పూన్
పచ్చిమిర్చి : 3
ఉప్పు : తగినంత
పోపు కోసం
ఆవాలు : టీస్పూన్
జీలకర్ర : టీస్పూన్
తయారి విధానం :
స్టవ్ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. కొద్ది సేపటి తరవాత ఉల్లితరుగు, కరివేపాకు వేసి కొద్దిగా బంగారు వర్ణంలోకి వచ్చాక తరిగి ఉంచుకున్న క్యాలిఫ్లవర్ వేసి వేయించాలి. కాసేపటి తర్వాత కొద్దిగా ఇంగువ, పసుపు, కారం, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. అన్నీ బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చివరగా కొద్దిగా కొబ్బరి తురుము వేసి ఒక్కసారి మొత్తం కలిపి దించేయాలి.
మూలం : సాక్షి