సోయా చంక్స్ - 1 కప్పు
మునక్కాయ ముక్కలు - 2 కప్పులు
ఉల్లిపాయ - 2
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెబ్బలు
టమాటాలు - 3
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 2 టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
తయారుచేసే పద్ధతి:
- ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు మరిగించి సోయా చంక్స్ వేసి దింపేయాలి. చల్లారిన తర్వాత జల్లెట్లో వేసి నీరంతా గట్టిగా పిండేయాలి.
- మునగకాయలు రెండు అంగుళాల సైజులో కట్ చేసుకుని పైన నార తీసేయాలి.
- పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్దవేసి కొద్దిగా వేపి కారం పొడి, ధనియాల పొడి, సోయా చంక్స్ వేసి మరో నాలుగు నిమిషాలు వేయించాలి.
- ఇందులో మునగకాయ ముక్కలు, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన టమాటాలు లేదా టమాటా ప్యూరీ (ముద్ద) వేసి కలిపి మూతపెట్టాలి.
- కొద్దిగా మగ్గిన తర్వాత కప్పుడు నీళ్లు గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. ముక్కలు ఉడికి నూనె తేలుతున్నప్పుడు దింపేయాలి.
మూలం : ఆంధ్రభూమి