పాలకూర - పావు కిలో
ఉడికించిన బొబ్బర్లు - రెండు కప్పులు
పచ్చిమిర్చి - 8
ఉల్లిగడ్డ - ఒకటి
జీలకర్ర - చెంచాడు
పసుపు - చిటికెడు
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
పాలకూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కట్ చేసిన మిర్చి వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన పాలకూర, బొబ్బర్లు, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. కొద్దిసేపు సన్నని సెగఫై ఉంచాలి. అంతే 'పాలక్ ఫ్రై' తయార్! ఇది అన్నం, పుల్కాలోకి బాగుంటుంది.
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం