గుడ్లు : ఆరు
ఉల్లిపాయలు : రెండు
అల్లం : తగినంత
జీలకర్ర : చెంచా
టమాటా గుజ్జు : అరకప్పు
పచ్చిమిర్చి : రెండు
పచ్చికొబ్బరి తురుము : కప్పు
పసుపు : చిటికెడు
ఆవనూనె : ఆరుచెంచాలు
గరంమసాలా : ఒకటిన్నర చెంచా
ఉప్పు : రుచికి తగినంత
ఇలా చేయాలి:
సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఉడికించుకించిన కోడుగుడ్లను తీసుకొనవలెను. బాణలిలో నూనె వేడి చేసి కోడిగుడ్లను బంగారువర్ణంలో వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి. అదే నూనెలో మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేయించి ఆ తరువాత ఉల్లిమిశ్రమాన్ని చేర్చాలి.పచ్చివాసన పోయి నూనె పైకి తేలాక పసుపు, కొబ్బరి తురుము చేర్చి సన్నటి మంట ఉంచాలి. ఐదు నిమిషాల తరువాత టమాటా గుజ్జు, కప్పు నీళ్లు, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి మూతపెట్టేయాలి. గ్రేవీ పూర్తిగా తయారయ్యాక గుడ్లను నాలుగు ముక్కలుగా కోసి గ్రేవీలో వేసి గరంమసాలా చల్లి మూడు నిమిషాలయ్యాక దించేస్తే సరిపోతుంది. కమ్మని నోరూరించే గ్రేవి రెడీ...