ములగ ఆకులు - రెండు కప్పులు
పెసరపప్పు - అరకప్పు
కొబ్బరి తురుము - ఒక కప్పు
బేబీ ఆనియన్స్ - 8-10
ఉల్లిపాయ - 1 పెద్దది
కారం - ఒక టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
ఎండు మిరపకాయలు - రెండు లేదా మూడు
కరివేపాకు - కొద్దిగా
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
ముప్పావు కప్పు కొబ్బరి, బేబీ ఆనియన్స్, జీలకర్ర, కారం, పసుపు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీరు పోసి కుక్కర్ లో పప్పు ఉడికించుకోవాలి. తర్వాత కడిగిన ములగ ఆకులు, ఒక కప్పు వేడి నీరు పోయాలి. ఉప్పు వేసి మూడు,నాలుగు నిముషాలు ఉడికించి పక్కన ఉంచుకోవాలి.
పాన్ లో నూనె వేడి చేసి మిగతా కొబ్బరి, మిరపకాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ముందుగా రుబ్బుకున్న పేస్ట్ దీనిలో కలిపి, నూనె విడివడేదాక ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పప్పులో కలుపుకోవాలి. చిక్కబదేదాకా ఉడికించి, సర్వింగ్ డిష్ లోకి తీసుకోవాలి. పరోటాలు, అన్నం తదితరాలకు ఇది మంచి కాంబినేషన్.
మూలం : స్వాతి సపరివార పత్రిక