బీరకాయ (చెక్కుతీసి, ముక్కలు కోసి) - మూడు కప్పులు,
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి),
గసగసాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు,
పసుపు, కారం - ఒక్కోటి పావు టీస్పూన్,
పచ్చిమిర్చి - రెండు (తరిగి),
నూనె - రెండు టీస్పూన్లు,
ఆవాలు - పావు టీస్పూన్,
ఎండుమిర్చి - రెండు,
ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ:
గసగసాల పొడిలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమన్నాక ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. తరువాత బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద వేగించాలి. పసుపు, ఉల్లిపాయముక్కలు, కారం, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తరువాత గసగసాల పేస్ట్ వేసి కూరగాయ ముక్కలు పొడిపొడిగా అయ్యే వరకు అంటే ముదురు రంగులోకి మారే వరకు వేగించాలి. వేడివేడిగా తింటే బీరకూరని ఇష్టపడని వాళ్లు కూడా ఈ కూరను మళ్లీ మళ్లీ తింటారు.