గింజలేని ద్రాక్ష పండ్లను సగానికి కట్ చేయాలి. ఈ ముక్కలను ముఖంపైన, మెడపైన లైన్ గా అమర్చాలి. ఇరవై నిముషాలు అలాగే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి.
0 Comments
జుట్టు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరినూనెతో మర్దన చేసి ఉదయం తలస్నానం చేయాలి.
బెల్లం, పెరుగు కలిపి పేస్ట్ లా చేయాలి. దీనికి ముల్తానీ మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పూసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది.
అల్లం ముక్కలు 5, ఆముదం గింజలు 5, జీడి ఆకుల రసం 10 గ్రా., ఆవనూనె 20 గ్రా. కలిపి నూరుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తే శరీరం అందంగా తయారవుతుంది.
శరీరంపై అధికంగా చెమటపడుతుంటే కరక్కాయ పెచ్చులను నీటితో నూరి ఒంటికి నలుగుపెట్టుకోండి. చెమట తగ్గి చర్మం చక్కగా ఉంటుంది. అలాగే సునాముఖి చూర్ణంను అరకప్పు ఆవుమజ్జిగలో కలుపుకొని రోజూ తాగుతుండాలి.
ఉడికించిన బంగాళాదుంప గుజ్జును, మరిగించిన పాలలో వేసి మెత్తని పేస్ట్ లా వేసుకుంటే చర్మం కాంతివంతముగా మారుతుంది. పొడిబారే సమస్యే ఉండదు.
టీ బ్యాగ్ లను బాగా మరిగించిన నీళ్ళలో వేసి కాసేపయ్యాక పెదాల మీద ఉంచాలి. ఇలా చేస్తే పగుళ్ళు పోతాయి.
గోరువెచ్చని నెయ్యిలో దూదిని ఉండగా చేసి వేయాలి. కొద్ది సేపయ్యాక తీసి పెదాలపై ఇరవై నిమిషాలపాటు బాగా రాయాలి. దీనివల్ల తేమ అంది పెదాలు మృదువుగా మారతాయి.
చలి కాలంలో పెదాలు పగిలి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొద్దిగా క్యారెట్ రసం తీసుకొని దానికి తేనె కలిపి రాసుకుంటే సరిపోతుంది. కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. తేమ అంది ఆరోగ్యంగా పెదాలు కనిపిస్తాయి.
మాయిశ్చరైసర్ లో కొద్దిగా చక్కెర వేసి పెదవులకు రాసి మర్దన చేయాలి. మృతచర్మం పోయి పెదవులు అందంగా, గులబీరంగులో కన్పిస్తాయి.
|