గోధుమ పిండి : పావుకిలో
బెల్లం : పావుకిలో
నూనె : పావుకిలో
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
గోధుమ పిండిలో ఉప్పు వేసి పూరీ పిండి మాదిరిగా కలిపి ఒక గంట నాననివ్వాలి. అంతలో ఒక గిన్నెలో బెల్లం, కొన్ని నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి. గవ్వలు తయారుచేసే స్పూన్ లేదా పీటపై గోలి సైజ్ పిండి తీసుకొని గవ్వలుగా చేసుకోవాలి. మూకుట్లో నూనె కాగాక గవ్వలు కొన్ని వేసుకొని ఎర్రగా వేయించి చల్లారక బెల్లం పాకంలో వేసుకుంటే సరి.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ