తేనె - పావు లీటర్
వెన్న - అరకప్పు
ఆరెంజ్ పీల్ - 1 స్పూన్ (కమలా తొక్కల తురుము )
కోడిగుడ్లు - 3
ఆరెంజ్ జ్యూస్ - పావు లీటర్
మైదా - పావుకిలో
బేకింగ్ పౌడర్ - 3 స్పూన్లు
బేకింగ్ సోడా - అర స్పూన్
ఉప్పు - అర స్పూన్
దాల్చిన చెక్క పొడి - 1 స్పూన్
బాదం పొడి - అరకప్పు
తేనె - మరో అరకప్పు
తయారుచేసే పద్ధతి :
మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి కలపాలి. మరో గిన్నెలో కోడిగుడ్ల సొన, తేనె బాగా గిలక్కొట్టి ఉంచాలి. అందులో బాదం పొడి కలిపి ఈ మొత్తాన్ని మైదా మిశ్రమంలో కలపాలి. ముందుగానే ఓవెన్ ను 180 డిగ్రీల సెంటీ గ్రేడ్ దగ్గర వేడి చేసి ఉంచుకోవాలి. కేక్ బాక్సుకి నెయ్యి రాసి మైదాపిండి చల్లి పెట్టుకోవాలి. ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి ఓవెన్ లో పెట్టి ముప్పావు గంట సేపు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత ముక్కలు కోసి పైన అరకప్పు తేనె పోస్తే చాలు. హనీ కేక్ రెడీ ...
మూలం : ప్రజా శక్తి ఆదివారం