జీడిపప్పు పొడి - ఒక కప్పు
నెయ్యి - ఒక కప్పు
శనగ పిండి - ఒక కప్పు
ఎండుకొబ్బరి పొడి - ఒక కప్పు
చక్కెర పొడి - రెండు కప్పులు
పాలు - ఒక కప్పు (మరిగించినవి)
తయారుచేసే పద్ధతి :
జీడిపప్పు, ఎండు కొబ్బరి, చక్కెరను వేర్వేరుగా పొడి చేసి ఉంచుకోవాలి. అదేవిధంగా పాలను బాగా మరిగించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి ఉంచి మొదట శనగపిండిని వేసి రెండు నిముషాలు వేయించి పక్కకు తీసుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత శనగ పిండి, జీడిపప్పు పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కాచిన పాలు పోసి చిక్కబడే వరకు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అలా చిక్కబడిన హల్వాను ఒక బౌల్ లో తీసుకొని జీడిపప్పులు, చెర్రీలను డెకరేట్ చేసుకోవాలి. అంతే నోరూరించే జీడిపప్పు హల్వా రెడీ..
మూలం : సాక్షి దినపత్రిక