క్యారెట్ - అరకేజీ
చక్కెర - పావుకేజీ
నిమ్మరసం - పావు కప్పు
తయారుచేసే పద్ధతి :
- క్యారెట్లను కడిగి చక్రాల్లా తరిగి ఫోర్క్ తో మధ్యలో రంద్రం చేయాలి. ఈ ముక్కల్ని ఐదు నిముషాలు ఉడికించుకొని నీళ్ళు వంపేసి గిన్నెలోకి తీసుకోవాలి.
- ఓ గిన్నెలో చక్కెర తీసుకొని పావు గ్లాసు నీళ్ళు పోసి తీగ పాకం రానివ్వాలి. అందులో క్యారెట్ ముక్కలు కూడా వేసి మంట తగ్గించాలి. ముదురు పాకం వచ్చి, ఆ తీపి క్యారెట్ ముక్కలకి పట్టిందని నిర్ధారించుకున్నాక దింపేయాలి. నిమ్మరసం కూడా కలిపి, చల్లారనిచ్చి గాలి తగలని, తడి లేని డబ్బాలోకి తీసుకుంటే సరిపోతుంది. తియ్యగా, పుల్లగా క్యారెట్ మురబ్బా అప్పుడప్పుడు చప్పరించేందుకు సిద్దం.
మూలం : ఈనాడు వసుంధర