గుమ్మడికాయ ముక్కలు - 2 కప్పులు
సగ్గుబియ్యం - 1/4 కప్పు
యాలకుల పొడి - 1 టీ.స్పూ.
కిస్‌మిస్ - 20
పాలు - 1/2 లీటర్
కండెన్స్ మిల్స్ - 1/4 కప్పు
నెయ్యి - 1 టీ.స్పూ.
కార్న్‌ఫ్లోర్ - 1 టీ.స్పూ.
పంచదార - 1/4 కప్పు
పిస్తా పప్పు - 5
తయారుచేసే పద్ధతి:
- సగ్గుబియ్యం కడిగి నీళ్లుపోసి గంట సేపు నానిన తర్వాత మరిన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
- మరిగించి చల్లార్చిన పాలల్లో కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి ఉడుకుతున్న సగ్గుబియ్యంలో కలపాలి.
- ఇందులో చిన్నగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, నెయ్యి వేసి నిదానంగా కలుపుతూ ఉడికించాలి.
- ముక్కలు ఉడికిన తర్వాత పంచదార, యాలకుల పొడి, కండెన్స్ మిల్క్ వేసి మరికొద్దిసేపు ఉడికించి దింపేయాలి.
- వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న పిస్తా వేయాలి.