telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

జాంగ్రీలు 

5/20/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

మినపప్పు            :          అరకిలో 
బియ్యం                :          2 కప్పులు 
పంచదార             :           కిలో 
నెయ్యి                 :           అర కిలో 

తయారుచేసే పద్ధతి :
 
                ముందుగా బియ్యాన్ని, మినపప్పును వేర్వేరుగా రెండు గంటల పాటు నానబెట్టి తర్వాత నీళ్ళు లేకుండా వంపేయాలి. తరువాత తడి లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. పలుచగా ఉండకూడదు. ఒక గిన్నెలో  పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి తీగ పాకం పట్టాలి. కొద్దిగా రంగు (ఎడిబుల్ కలర్స్ అమ్ముతారు) పాలలో కలిపి పాకంలో వేయాలి. వెడల్పాటి పళ్ళెంలో ఒక మంచి వస్త్రంలో కొద్దిపాటి మినపపిండి చొప్పున తీసుకుంటూ గట్టిగా మూటలా కట్టి నేతిలో దోరగా వేయించి తర్వాత పాకంలో వేయాలి. అన్నింటిని ఇలాగే వేసి పాకంలో నానిన తర్వాత తీసి మరోపాత్రలో వేస్తే సరిపోతుంది.

మూలం : ఆదివారం ఆంధ్రప్రభ 
0 Comments

అరిసెలు 

5/20/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

బియ్యం                :              ఒక కిలో 
బెల్లం కోరు            :              ముప్పావు కిలో 
నువ్వులు             :              కొద్దిగా 
నూనె                  :               వేయించుకోవడానికి సరిపడా 

తయారుచేసే పద్ధతి :

 
              ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడుక్కొని, ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే ఆ నీటిని వడకట్టి, నీరు పోయేదాకా ఒక గుడ్డమీద ఆరబెట్టుకోవాలి. తడిలేని బియ్యాన్ని పొడి చేసుకొని జల్లడ పట్టుకోవాలి. బెల్లం పొడికి కప్పు నీరు కలిపి స్టవ్ మీద పెట్టుకొని చిక్కటి పాకం వచ్చేదాకా కలపెట్టాలి. ఇలా తయారైన బెల్లం పాకానికి, బియ్యం పిండి కొంచెం తిప్పుతూ బాగా కలిసి పోయేట్టు కలుపుకోవాలి. పొయ్యి మీద నుండి దించుకొని ఉండలు లేకుండా చేసుకోవాలి. దీనిని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. చేతి మీద ప్లాస్టిక్ పేపర్ లేదా అరిటాకు వేసుకొని, దానికి నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండా తీసుకొని కొన్ని నువ్వులు చల్లుకొని పూరిలాగా చిన్న మంట మీద నూనెలో వేపుకోవాలి. ఒక్కోదాన్ని అట్లాకాడల మద్య నూనె బాగా పోయేట్టు నొక్కుతూ బయటకి తీయాలి.
 
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ 
0 Comments

చక్కెర పొంగలి 

5/20/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

బియ్యం               :               ఒక కప్పు 
పెసర పప్పు         :               ఒక కప్పు 
పాలు                  :               ఒక కప్పు 
పొడి చేసిన బెల్లం  :               3 కప్పులు 
నీళ్ళు                  :               రెండున్నర కప్పులు 
జీడిపప్పు            :               తగినంత 
ఎండు ద్రాక్ష          :               తగినంత 
యాలకుల పొడి   :                తగినంత 
నెయ్యి                 :                తగినంత 
కుంకుమ పూవు  :                 చిటికెడు 


తయారుచేసే పద్ధతి :
 
              ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి పెసరపప్పును కాసేపు వేయించాలి. తర్వాత వేయించిన పెసరపప్పు, బియ్యం, పాలు, రెండు కప్పుల నీళ్ళు పోసి అన్నంలా ఉడికించుకోవాలి. అంతలోపు ఇంకొక గిన్నె తీసుకొని ముప్పావు కప్పు నీళ్ళు పోసి బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. మట్టి ఏమైనా ఉంటే పోయేందుకు వడకట్టి మళ్లీ సన్నని సెగపై పెట్టి, చిక్కబడే దాక ఉంచాలి. తర్వాత దీనిలో పెసరపప్పు మిశ్రమాన్ని మెల్లగా తిప్పుతూ కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత స్టవ్ మీద నుండి దించేసి వేడి నెయ్యిని, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కలపాలి. దీనిపైన యాలకుల పొడి, కుంకుమ పూవు కొంచెం చల్లుకోవాలి. కావాలంటే జాజి పొడి కూడా వేసుకోవచ్చు. 

మూలం : ఆదివారం ఆంధ్రప్రభ 
0 Comments

బాదం హల్వా 

5/20/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

బాదం పప్పులు         :              ఒక కప్పు 
పంచదార                 :              రెండున్నర కప్పులు 
నీళ్ళు                      :              మూడు కప్పులు 
కుంకుం పూవు          :              చిటికెడు 
నెయ్యి                     :              రెండు కప్పులు 

తయారుచేసే పద్ధతి :
వేడి నీళ్ళలో బాదంపప్పులు నానబెట్టాలి. పొట్టు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు పోసి పంచదార వేసి పాకం పట్టుకోవాలి. ఈ సిరప్ లో బాదంపప్పుల పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళలో కుంకుమ పువ్వు కలిపి సిరప్ లో వేసుకోవాలి. ఒక కప్పు నెయ్యి కలుపుకోవాలి. చిక్కబడుతున్నపుడు కొద్దికొద్దిగా నెయ్యి పోస్తూ కలపాలి. బాగా చిక్కబడ్డాక దింపేస్తే బాదం హల్వా రెడీ.  

మూలం : స్వాతి సపరివార పత్రిక 
0 Comments

ఫ్రూటీ శ్రీఖండ్ 

5/20/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

తాజా పెరుగు            :              ఆరు కప్పులు 
పంచదార పొడి           :              నాలుగు కప్పులు 
యాలకుల పొడి          :             అరటీస్పూన్
కుంకుం పూవు          :              చిటికెడు 
కండెన్స్ డ్ మిల్క్       :              అర కప్పు 
తాజా పండ్ల ముక్కలు  :              రెండు కప్పులు 


తయారుచేసే పద్ధతి :

           ముందుగా శుభ్రమైన వస్త్రంలో పెరుగు వేసి ఆరేడు గంటలు హ్యాంగ్ చేస్తే నీరంతా పోతుంది. చిక్కని పెరుగు ఓ గిన్నెలోకి తీసుకొని దారపొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. కండెన్స్ డ్ పాలల్లో కుంకుం పూవు వేసి కలిపి పెరుగు మిశ్రమంలో కలపాలి. సర్వ్ చేసేదాకా ఫ్రిజ్ లో పెట్టాలి. 

మూలం : స్వాతి సపరివార పత్రిక 
0 Comments

పులుగం 

5/17/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

బియ్యం                 :            రెండు కప్పులు 
బెల్లం తురుము     :            రెండు కప్పులు 
యాలకుల పొడి     :             పావు చెంచాడు 
నెయ్యి                   :            చెంచాడు 
బియ్యం పిండి        :             రెండు చెంచాలు 
నువ్వులు             :            ఒక కప్పు 
ఎండు కొబ్బరి తురుము :      కొద్దిగా 
పాలు                   :             నాలుగు గ్లాసులు 
డ్రై ఫ్రూట్స్             :              తగినన్ని 


తయారుచేసే పద్ధతి :

               ముందుగా నువ్వులకు కొన్ని నీళ్ళు చల్లి చేతితో బాగా రుద్ది తర్వాత బియ్యం పిండి కూడా వేసి బాగా రుద్ది చెరగాలి. పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బియ్యంలో నాలుగు కప్పుల నీళ్ళు, ఒక కప్పు పాలు, నెయ్యి వేసి కుక్కర్ లో పెట్టి మెత్తగా అన్నములాగా ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ లో విజిల్ వచ్చాక మూత తీసి మిగతా అన్ని పదార్థాలను వేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత నువ్వుల పొడి, డ్రైఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి. బెల్లం కరిగాక దించాలి. అంతే ! కమ్మని 'పులుగం' రెడీ! ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.

మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం  
0 Comments

బేసన్ బర్ఫీ

5/17/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

శనగ పిండి            :           పావు కిలో 
చక్కెర                  :           పావు కిలో 
నెయ్యి                  :          ఒక కప్పు 
పాలు                   :          2 చెంచాలు 
యాలకులు          :          4
జీడిపప్పు, కిస్ మిస్ :        కావలసినన్ని

తయారుచేసే విధానం:

          శనగ పిండిని పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత దీనిలో నెయ్యి తప్ప మిగిలినవన్నీ వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత నెయ్యి వేడి చేసి, మిశ్రమాన్ని అందులో వేయాలి. చక్కెర కరగడం మొదలయ్యాక మిశ్రమం పాకంలా తయారవుతుంది. ఇందులో జీడిపప్పు, కిస్ మిస్ లను వేసి కలపాలి. దగ్గరగా అయ్యాక తీసి, నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి, చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మూలం : సాక్షి ఆదివారం పుస్తకం 
0 Comments

చిలగడదుంపల స్వీట్ 

5/16/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

చిలగడదుంపలు    -       అర కేజీ 
బెల్లం                    -       పావు కేజీ 
నెయ్యి                   -       రెండు టీ స్పూన్లు 
యాలకుల పొడి     -       అర టీ స్పూన్   
  

తయారుచేసే పద్ధతి :

                 చిలగడదుంపలు చెక్కు తీసి శుభ్రంగా కడగాలి. గుండ్రంగా పెద్ద సైజులో ముక్కలు తరగాలి. ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న చిలగడదుంప ముక్కలు, తురిమిన బెల్లం, కొద్దిగా నీరు వేసి సన్నని మంటఫై ఉడికించాలి. దింపే ముందు రెండు టీ స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. వేడి వేడిగా సర్వ్ చేయాలి. 

మూలం : సాక్షి దినపత్రిక  
0 Comments

పూతరేకులు

5/16/2013

0 Comments

 
తయారుచేసే పద్ధతి :

              పూతరేకుల కోసం జయా బియ్యం మాత్రమే వాడుతారు. ఇవి చేయడానికి ప్రత్యేకమైన కుండ ఉంటుంది. బియ్యాన్ని రెండు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పూతరేకుల కోసమే తయారుచేసిన కుండను బోర్లించి లోపల తాటాకులతో మంట పెట్టాలి. ఫై భాగంలో శుభ్రం చేసిన ఒక చేతి గుడ్డంత వెడల్పు గుడ్డను పలుచగా కలిపిన పిండిలో ముంచి కాలే కుండ మీద పరిచి వెంటనే లాగాలి. అప్పుడు పలుచని రేకులాగా లేస్తుంది. వాటినే పూతరేకులంటారు. చెక్కర, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తో కూడా పూతరేకులు చుట్టవచ్చు. పంచదార, బెల్లంతో రెండు విధాలుగా వీటిని తయారుచేసుకోవచ్చు. రేకులు, యాలకులు కలిపి మెత్తగా పొడి చేసుకున్న పంచదార, కరిగించిన నెయ్యి, బెల్లంతో చేయాలనుకుంటే బెల్లం పొడి చేసుకొని అందులో యాలకుల పొడి కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా తీసుకోవాలి. ఒకటి లేదా రెండు రేకులను పరిచి దానిమీద కరిగించిన నెయ్యి వేసి పంచదార పొడి లేదా బెల్లం పొడి చల్లి చాపలా చుట్టాలి.
0 Comments

పాన్ కేక్

5/16/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

కరిగించిన వెన్న          :          100 గ్రా.
పంచదార పొడి            :          1/2 కప్పు 
ఆరంజ్ రసం               :          సగం పండు 
ఫైనాపిల్ ముక్కలు     :           ఒక కప్పు (సన్నగా తరిగినవి)
మైదా పిండి                :           2 కప్పులు
జీడిపప్పు                  :           2 చెంచాలు 
బాదం                       :           2 చెంచాలు 
పిస్తా పలుకులు         :           2 చెంచాలు  
మిక్స్ డ్ డ్రై ఫ్రూట్స్     :           100 గ్రా.

తయారుచేసే పద్ధతి :

              పంచదార పొడిని ఆరంజ్ రసం లో కలిపి, వెన్న, పిండి కూడా చేర్చి పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. పళ్ళ ముక్కలు, జీడిపప్పు ముక్కలు కూడా కలిపి ఈ పిండిని చిన్న చిన్న కేక్ ప్యాన్ల (గిన్నె) ల్లోకి తీసుకొని ఒక ట్రేలో పెట్టి 20 నిముషాలు 350 డిగ్రీల ఫారన్ హీట్ లో లేదా 180 డిగ్రీల సెంటీగ్రేడ్ లో బేక్ చేసుకోవాలి.

0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    పాల పేడా
    ఆలూ హల్వా
    జామ హల్వా
    ఎగ్ హల్వా
    పాల బ్రెడ్ హల్వా
    పాల ముంజెలు
    గుల్ గూలె
    రవ్వ కేక్
    పాల్ పోలీ
    మినీ కాజా
    బీట్ రూట్ హల్వా
    బీట్ రూట్ పాయసం
    అరటి ఉండలు
    పెసర లడ్డు
    ఖీర్ మోహన్
    తీపి అప్పం
    రవ్వ లడ్డు
    రవ్వ కేసరి
    మైదా కుట్చి
    రైస్ మిట్టా
    చక్ర పొంగలి
    బటర్ స్కాచ్ బర్ఫీ
    పెసర లడ్డూలు
    కోవా లడ్డులు
    సజ్జ ముద్దలు
    కోవా నువ్వుల లడ్డు
    అరటి తొక్కతో హల్వా
    తీపి ఉండ్రాళ్లు
    హల్వా
    కద్దూ కా ఖీర్‌
    స్టఫ్ డ్ గులాబ్ జామ్
    ఆమ్లా ఖీర్
    మూగర్ పులీ
    గోధుమ రవ్వ పాయసం
    గోధుమ హల్వా
    ఆపిల్ పాయసం
    బేసన్ బర్ఫీ
    ఉసిరి పాయసం
    జొన్న బనానా కేక్
    జొన్న బనానా కేక్
    చూర్ణ లడ్డూలు
    పనీర్ కలాకండ్
    పులుగం
    కేసర్‌ పేడా
    ఆరెంజ్ కేక్
    సొరకాయ హల్వా
    యాపిల్ హల్వా
    సేమియా కేసరి
    ఖర్జూర పాయసం
    మామిడి లడ్డు
    అటుకుల పాయసం
    అటుకుల కేసరి
    సేమ్యా లడ్డు
    అటుకుల లడ్డు
    మామిడి బర్ఫీ
    ఆవిల్‌ ఖీర్‌
    సేమ్యా కేసరి
    ఆరెంజ్ బాల్స్
    చక్కెర పొంగలి
    మిల్క్ మైసూర్ పాక్
    బెల్లం డోనట్స్
    మామిడి రసగుల్లా
    బెల్లం కుడుములు
    బెల్లం రసగుల్లా
    బ్రెడ్ జీడిపప్పు హల్వా
    ఓట్స్‌- కొబ్బరి హల్వా
    అరిసెలు
    కొబ్బరి
    సటోరియా
    కలకండ్‌
    పురాన్‌ పొలి
    గుమ్మడి రవ్వ కేసరి
    కొబ్బరి కోరు చపాతీ
    కొబ్బరి పాయసం
    పరుప్పు పాయసం
    పన్నీర్ పాయసం
    కొబ్బరి సద్ది
    పుట్నాల పప్పు లడ్డూలు
    ఖర్జూరం లడ్డు..
    కోకోనట్ క్రీమ్ కేక్
    నువ్వుల పూర్ణాలు
    కొబ్బరి బొబ్బట్లు
    నువ్వుల బొబ్బట్లు
    శ్రీఖండ్
    పాలపాయసం
    క్యారెట్ కేక్
    సోరక్కాయ పాయసం
    పైనాపిల్ హల్వా
    పొట్లకాయ పాయసం
    క్యారెట్ బర్ఫీ
    బొప్పాయి హల్వా
    క్యారెట్ సేమియా కీర్
    క్యారెట్ మురబ్బా
    సాబూదాన్ క్యారట్ పాయసం
    చాక్లెట్ పంప్కిన్ బ్రెడ్
    వేరుసెనగ బొబ్బట్లు
    జాంగ్రీలు
    పూతరేకులు
    చిలగడదుంప
    శెనగపప్పు లడ్డు
    చిలగడదుంప హల్వా
    గోధుమరవ్వ ఉండ్రాళ్లు
    క్యారెట్‌-గుమ్మడి హల్వా
    దద్ద్యోజనం
    స్ట్రాబెరీ కేక్
    గుమ్మడికాయ పాయసం
    గుమ్మడికాయ భక్షాలు
    సగ్గుబియ్యం పాయసం
    మొక్కజొన్నపాయసం
    కార్న్‌ప్లేక్స్‌ లడ్డు
    80c3816368
    8237c124fa
    8276cc6caa
    8610b8784a
    8ca04ba74d
    90265c732f
    9345ab6c22
    9355304df2
    95a87d2dd4
    969b6e516e
    9d649010b7
    A5d73421d0
    C2424650fd
    C2c38940ea
    C71667ccab
    D921ab6dd1
    Dc2cfa4dc1
    Ddfa844233
    E176abfba7
    E5b5e78e15
    E5da439130
    F5d6e3be0e
    F5fa18e27d
    F69387bcb0
    F7f191d0c1

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.