
మాణిక్యమ్మ మాజీ సర్పంచ్. ఊరికి చాలా చేశారు. ఊరినే మార్చేశారు. ఊళ్లో వైన్‌షాప్ అన్నదే లేకుండా చేశారు. శుభ్రతకు ఒక అవార్డ్. అభివృద్ధికి ఒక అవార్డ్. ఊరికి ఆమె ఇచ్చిన ‘మనశ్శాంతి’ మరొక అవార్డ్. ఎవరైనా ఇంతక న్న ఏం సాధిస్తారు? ఐతే సాధించడం గొప్ప కాదంటారు మాణిక్యమ్మ! సాధించినదాన్ని నిలుపుకోవడం ముఖ్యం అంటారు. ఇప్పుడామె ఏకైక ధ్యేయం... మద్యం మహమ్మారి మళ్లీ కోరలు చాచకుండా చూడడం! పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ‘గెలిపిస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అనేవాళ్లని చూశాం. మాణిక్యమ్మ మాత్రం... ‘ఎవరు గెలిచినా... ఊళ్ల్లోకి వైన్షాపుని మాత్రం రానివ్వం’ అంటున్నారు. ఇది ఆమె ఎన్నికల వాగ్దానం కాదు. ఊరును ఓడిపోనివ్వనని చేస్తున్న ప్రమాణం... Read more